# 68.నాయకుండా! ఓటూ లేదు! గీటూ లేదు! (68-76)
రావోయి నాయకుండ!
మా ఊరి
గాధ వినుమా!
రావోయి
నాయకుండ!
మా ఊరి గాధ వినుమా!
చక్కని స్కూలు లేదు
డిగ్రీ చదువులు లేవు
పట్నపు ఊళ్ళే గతియై
సతమతమాయే చదువే!
రావోయి నాయకుండ!
మాఊరి బాధ వినుమా!
రావోయి నాయకుండ!
ప్రతినలు చేసిరి సభలో
గతుకుల రోడ్లను పడిరోయ్
మాటలు కోటలు దాటే
నటనకు జోహార్లోయీ!
వచ్చేవు నాయకుండ
మాఇంట వోటు లేదు...
తమ సంపాదన తమదీ
జనమతమసలే పడదోయ్
ప్రజాక్షేమమే పూజ్యం
అంతా తమకే భోజ్యం :రావోయి
నాయకుండ:
రావోయి నాయకుండ
మీవెంట వోటు రాదూ
బేషరతుగా వోట్లను వేస్తే.....
మొదటికే మోసం లేవోయ్
69. ప్రజల మృదంగం-నాయకుల నృత్యం
పల్లవి:
ప్రజలకి నేర్పిన నడకలివీ.....
ప్రజలకి నేర్పిన నడకలివీ.....
నేతలకందని తర్కమిదీ......
నేరాలు,
ఘోరాలు నృత్యించే ఈవేళ...
చూడాలి
నాదేశ లీలా........
:ప్రజలకి:
చరణం:
ఖల నాయకులు వచ్చిరి పదవులకూ
ఖల నాయకులు వచ్చిరి పదవులకూ
ఇల చేసిరి ప్రణలికలూ
ఎన్నెన్నో స్కాముల హారములూ
ఎగవేసిరి పన్నులు సంపన్నులూ :ఎన్నెన్నో:
ఆయారాములూ –గయారాములు
సర్కారులూ-
కరందాసు కమనీయ కల్పనావల్లి
కరప్షన్ల
అగ్రగామి భారత తల్లి
:ప్రజలకి:
:చరణం:
సుఖ శాంతులు కరవాయే మచ్చునకూ
సుఖ శాంతులు కరవాయే మచ్చునకూ
భావియే కనరాని
యమలోకమూ :సుఖ:
నీదేశ-
సీమల్లో ఖేదములూ
తారాడే
కన్నుల్లో కన్నీళ్ళూ
పంచశీల నినాద సూత్రాలు
వివాదములై, విషమించెను నేటికినీ.. :ప్రజలకి:
70. శైవ స్తుతి
హే గిరీశా! శైలజేసా!
గౌరీశా – గగన విహంగా
పావన గంగా జటాభాసా
దక్షవాటికా
విధ్వంసా
:హే:
గరళ కంటా
– వరములపంటా
నిన్ను వేడిన భక్తులకంటా
మన్మధహారీ- విమోచనకారీ
కైలాసవిహారీ – కైవల్యప్రదాయీ :హే:
శివశివ మూర్తీ – శివపరశక్తి
శివశివ జపమున కలిగెను
ముక్తి
శివశివ ధ్యానం – పరమ పావనం
శివశివ ధ్యానం శివపురి యోగం :హే:
నిటలాక్షా!
కరుణాకటాక్షా!
ఓంకారనాద
సమీక్షా!
జగద్రక్షా! జ్ఞాననేత్రా!
నాగభూషణా!
భోళాశంకరా!
:హే:
శివ శివా శివాయ – శివశివాయ
శీఘ్ర సాక్షాత్కరాయ
ఓం - ఓంకార నాదాయ!
నమో.....నాదస్వరూపాయ
నమః నమోనమః –నమః నమోనమః
పాహి పాహిమాం-పాహిమాం-పాహి పాహి
:హే:
04-02-2014
71. ఈశ్వరా! జగధీశ్వరా!
పల్లవి:
ఈశ్వరా! జగధీశ్వారా!
ఈశ్వరా! జగధీశ్వారా!
దిగిరా! భూలోకమూ
భువియే కైలాసము
భూకైలసమూ!
:ఈ:
చరణం:
కనుమా! ఈ లోకమూ
కనుమా! ఈ లోకమూ
వినుమా! మాశోకమూ
ఎందుకు కైలాసమూ?
దిగిరా! భూలోకమూ :ఈ:
చరణం:
చర్మాంబరధారీ!
చర్మాంబరధారీ!
వస్త్రహీనులం
సిగ్గూ ఎగ్గూ లేని
వస్త్రవిహీనులం
:ఈ:
చరణం:
పిశాచాలు వేనవేలు
పిశాచాలు వేనవేలు
“భూతల” పిశాచాలు
వేలకుపాలకులు
కపాలకులు – భూకబ్జాలకులు :ఈ:
చరణం:
హిమసౌధాలు-హిమసౌఖ్యాలు
హిమసౌధాలు-హిమసౌఖ్యాలు
నిశీధి తాండవాలు
హేమాహేమీ నృత్యాలు
సోమా! రసపానాలు
అన్నీ ఉన్నాయ్!
రా! దిగిరా! కైలాస వాసా!
కైలాసవిలాసా!
:ఈ:
@ 72. సుమతీ! పశుపతీ ! ప్రజాపతీ!
@ 72. సుమతీ! పశుపతీ ! ప్రజాపతీ!
పల్లవి:
మహేశా! శ్రితజనమందారా!
మహేశా! శ్రితజనమందారా!
పరమ
పావనా! పార్వతీ వల్లభా!
గిరిధరా! గంగాధరా! హిమకరా!
:మహేశా:
చరణం:
నీదరిజేర నెరనమ్మితిరా!
నీదరిజేర నెరనమ్మితిరా!
తక్కువ
జేయక అక్కున చేర్చరా
వేగమె చేకొనిపోరా
వీగలేను ధర మారణహోమము :మహేశా:
చరణం:
ఏమీ తెలియని అల్పులు కొందరు
ఏమీ తెలియని అల్పులు కొందరు
అన్నీతెల్సిన పండితమానులు
కొందరు
చాకిరీ చేసినా బడుగులే కొందరు
ప్రజాధనము కాజేసే కోకొల్లలు;
నిటలాక్షా! నేత్రము తెరవరా!
సంహరించి సంస్కరణము చేయరా! :మహేశా:
చరణం:
జలమే జనజీవనమూ,
జలమే జనజీవనమూ,
బుద్ధి వికాసమే అన్నసారమూ
ఆచ్చాదనమే నాగరికమూ
గ్రాసం లేకున్నా వాసం నిక్కమురా
లేనివారికి సృష్టించుమురా
ప్రభంజనమూ! సమసమాజమూ!
సుమతీ! పశుపతీ! ప్రజాపతీ!
05-02-2010
73. సత్యం – శివం – సుందరం
పల్లవి:
ఈశ్వరా! నీవెరా ఆధారమూ!
ఈశ్వరా! నీవెరా ఆధారమూ!
నీఅనుగ్రహమే
జీవనమూ!
జీవకోటి
జీవనాధారమూ!
నీ ఆగ్రహమే
లోకనాశమూ! :ఈశ్వరా:
చరణం:
జంగమయా! మాయాజగమయా!
జంగమయా! మాయాజగమయా!
పాపహరణమూ-పంచాక్షరమూ
జాలువారనీ, మాపై జ్ఞానమూ
చేరవేయుమా!
నీద్వారమూ! :ఈశ్వరా:
చరణం:
సత్యము నీవే – శక్తివి నీవే
సత్యము నీవే – శక్తివి నీవే
స్వచ్ఛము నీవే –
సర్వమూ నీవే
సత్యమే శివమూ –
శివమే సుందరమూ
సత్యం – శివం –
సుందరం :ఈశ్వరా:
చరణం:
సత్యరూపాయ శివమ్
సత్యరూపాయ శివమ్
శివ రూపాయ
సుందరమ్
పిక్కటిల్లనీ
శివనాదం
అఖిలం-నిఖిలం-శివోహం :ఈశ్వరా:
@ 74. నీవేరా ప్రభూ! ఈశ్వరా! ప్రభుత్వము!
పల్లవి:
పన్నగ భూషణా! ఎన్నగతరమా!
పన్నగ భూషణా! ఎన్నగతరమా!
సన్నగ పిలిచినా
తోచెడి దైవమా!
ఎన్నజాల నీమహిమాన్వితమూ!
నీనాదమే
నభోంతరాళమూ! :పన్నగ:
చరణం:
గరళ తాపము చాలనట్టు
గరళ తాపము చాలనట్టు
బుసకొట్టు
పాములు దేహము చుట్టూ
విభూతిమయశరీరం
విస్మయమూ
నీవెలుగే విశ్వమంతయూ :పన్నగ:
చరణం:
సృష్టిలయకారుడవూ!
సృష్టిలయకారుడవూ!
నీవే
నాశకరుడవూ!
సంపత్ప్రదాతవూ!
భస్మవాటికా
ప్రవాసుడవూ!
ఎన్నజాల నీ
మహిమాన్వితమూ!
నీవేరా
నిజప్రభుత్వమూ! :పన్నగ:
@
@
75. రారండో! శ్రీశైలము!
పల్లవి:
రారో! భక్తులారా! రారండో!
రారో! భక్తులారా! రారండో!
హరోంహరా హర
హరోంహరా!
శివరూపాయ –
విష్ణురూపాయ
నమో నమః –నమ –
నమో నమః :రా:
చరణం:
రారో! భక్తులార! రారండో!
రారో! భక్తులార! రారండో!
శ్రీశైలం
మల్లన్నజూడ
శివరాత్రికి
శ్రీశైలము!
శివ శ్రీనగమూ!
దివ్యక్షేత్రమూ!
చరణం:
కీకారణ్యములోన
కీకారణ్యములోన
శ్రీనగము
పైన
కిరాతకరూపమెత్తి
నరుణ్ణి
నసపెట్టి
పాశుపతమిచ్చిన
శ్రీశైలమల్లన్నజూడ
రారో!
రారండో భక్తులార!
శివరాత్రికి
శ్రీశైలమూ! :రారో:
చరణం:
హరహర శంభో అన్నంత,
హరహర శంభో అన్నంత,
కొలువున్నా అల్లంత
శివ శివా అన్నంత
ఇల బాధలు
చూడలేక
మోక్షమిచ్చే
భోళాశంకరు
చూడ
రారో!
భక్తులారా! రారండో!
శివరాత్రికి
శ్రీశైలమూ!
శంకరుని,
శివశంకరుని శ్రీశైలమూ! :రా:@
76. మనవరాలి కోసం లాలిపాట
పల్లవి:
లాలపోశానమ్మ లాలనలుమీర
లాలపోశానమ్మ లాలనలుమీర
పాలుపట్టానమ్మ ఆకళ్ళు తీర :లాల:
చరణం:
చిలకపచ్చా రంగు
చిలకపచ్చా రంగు
పట్టుచీర పరిచి
పక్కవేశానమ్మ
ఊయలలు ఊగవే
తూగవే మాయమ్మ :లాల:
చరణం:
జోలాలి పాటకే
జోలాలి పాటకే
జోకైనబోమ్మా
కుందనము సరిరాదే
నీకుదురుకెదురు
లాలిదే పవిజమా!
పవీ, పవీ లాలీ!....
పదే పదే లాలిరా
భవ్య మాతల్లీ! :లాల:
చరణం:
ఎందరినొ పెంచి
ఎందరినొ పెంచి
అందెవేసినవారు
మీముత్తమ్మగారు
నిన్ను పెంచిన ఘనత
పొందినారమ్మ
పుచ్చుకోవేతల్లీ
ముందు తరాలకు
ముచ్చటగానూ :లాల:
చరణం:
తుంగ-భద్ర నదుల
తుంగ-భద్ర నదుల
నీటి నడకను మార్చి
భద్రముగా నీటిని
నిలువంగ జేసె
నీముత్తాత గారు
వారి జ్ఞానము పొందవే
మా తల్లీ
మీముత్తాతగారెంతో
మురిసిపోతారు :లాల:
చరణం:
“ఇన్ని” మార్కులు తేవ
“ఇన్ని” మార్కులు తేవ
ఎంతగా మురియునో?
“ఇన్ని” మార్కులు తెమ్మని
ఎపుడడగరమ్మ
వారే, మీ అమ్మమ్మగారు
అబల సంతోషీ
అమ్మమ్మనెప్పుడూసంతోషబెట్టు :లాల:
చరణం:
ఒర్పులో భీష్ముడు మీతాతగారు
ఒర్పులో భీష్ముడు మీతాతగారు
నేర్పుకన్నా గొప్ప ఓర్పుదేనమ్మా
తాతగారి ఓర్పు నేర్చుకోవమ్మా
ఒర్పున్నవాళ్ళేను గట్టునుండేరు :లాల:
చరణం:
వీణనీ, వాణినీ నట్టింట నిల్పిన
వీణనీ, వాణినీ నట్టింట నిల్పిన
సంగీతలక్ష్మిరా నీ చినముత్తమ్మగారు
సంగీత సాహిత్యాలు నేర్చుకో తల్లీ
సంప్రదాయము నిల్పి సాగావే తల్లీ! :లాల:
చరణం:
బోడుప్పాలను బ్రహ్మాండమందు
బోడుప్పాలను బ్రహ్మాండమందు
పదిలంగ ఉండిన నీ బులిముత్తమ్మగారు
లలితసాహిత్యాన ఘనత
గల్గిన వారు
లలిత పదములు కాసిన్ని
పుణికిపుచ్చుకొని
సంప్రదాయము సాగానీయమ్మా :లాల:
చరణం:
పవివని నువ్వు మురిసిపోకమ్మో!
పవివని నువ్వు మురిసిపోకమ్మో!
నిన్ను మించిన రత్నమణి
నీ చిట్టిముత్తమ్మ
ఆముత్తమ్మ మణిని అందుకోవమ్మా :లాల:
చరణం:
హైదరాబాదంటే ఎనలేనిప్రేమ
హైదరాబాదంటే ఎనలేనిప్రేమ
బెంగతోనుండే బెంగుళూరులో
నీ పెద్దమ్మగారు
కార్యసాధకులారు పెద్దమ్మగారు
కార్యసాధనాపట్టు నేర్చుకోవమ్మా :లాల:
చరణం:
ఇంతమందినీ చెప్పి
ఇంతమందినీ చెప్పి
మీమామ్మ ఘనత
చెప్పకుందునా?
ఒప్పుకోదేతల్లీ! ఇది సంఘవమ్మా
మంచి, చేడుగులు రెండే ఈసంఘమంటే
చినేమేచ్చును మీమామ్మగారు
నొచ్చనివ్వదు తానొవ్వబోదు
ఇది నీతి ఎరుగవే చిట్టి నాతల్లీ!
లోకరీతి తెలిసి మెలగవే తల్లీ! :లాల:
చరణం:
పడుకోవే పవి తల్లీ! పండుకోవే
పడుకోవే పవి తల్లీ! పండుకోవే
పార్కులో నాసఖులు వేచి ఉన్నారు
అమ్మ, అయ్యలిద్దరూ ఉద్యోగమంటూ
పొద్దున్నే బై
చెప్పి వెళి వచ్చి నారు :లాల:
చరణం:
తెయితెక్కలాడకే తెలు బొమ్మను చూడు
తెయితెక్కలాడకే తెలు బొమ్మను చూడు
తెయితెక్కలాడావో తాతక్కకొట్టేను
లాలి ఈపాట మీ తాత రాశాడు
నీకోసమే రాసి ననుపాడమన్నారు
“పనిదొంగ” మీతాత ఎరుగవే తల్లీ
పనిదొంగకెప్పుడూ
క్షమభిక్ష లేదమ్మ! :లాల:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి