12, జులై 2014, శనివారం

@                                             33. సైనికుడు  (33-34)                     మే 2005
నేనొక సైనిక ఉద్యోగిని
నేనొక స్నేహ పిపాసిని

నన్నంతా మంచి "హోస్టు" అంటారు

నా"కంపెనీ" అంత కోరుకుంటారు
పొగడ్తలకు పొంగిపోయే "సీజర్నా?"
స్నేహదాహంలో కర్నుడినా?

"స్నేహమే","సహనం", "సహనమే"-"సహనం"

అని,చాటి-పాటించిన
చమరీ మృగాన్ని
అందరిచే పిలిపించుకునే "చామరీ తీ"ని

"ఎందుకూ" పనికిరాక పోతే ,

"సివిల్లో"అన్ఫిట్టైతే,"ఆర్మీలో"చేరతారు
అన్నాడో మిత్రపుంగవుడు!

ఐతే ,"ఉద్యోగం వచ్హిందా ?,లేదా"

అన్న "మీమాంస"వొచ్చింది నాకే !
నా హృదయాంతరాళ్లో
నే నార్మీలో జేరానే కానీ
నాకు "ఉద్యోగం"రాలేదన్నాను

అయినా "పార్టీ"అడిగారు

" బృందాల "వారీగా ఇచ్చాను

నువ్వొస్తేనే "తాగుతాం "అన్నారు అందరూ

నీకోసమే తాగుతున్నామన్నారు ఇంకొందరు
"పానీయం"తో బాటే పంచ భక్ష్యాలన్నారు
"లాజిక్ "లాగేవాళ్లు

"తీరా శెలవై పోతే ,స్టేషన్ కిఎవరొచ్హారని ?"

తోటి ప్రయాణీకుడు అడిగితే,
చెప్పడానికి సిగ్గేసింది !
అతని సెండాఫ్ మిత్రుల్ని చూచాక !

"ఆర్మీలోస్నేహం స్టేషన్ వరకే"

అన్న "నానుడి "
"సివిల్లో స్నేహం cheers వరకే"
అన్నది నాకు తెల్సిన సత్యం;
కానీ,1975-76 నాటి "ఆర్మీ"మిత్రుల్తో
ఇంకా స్నేహం కొనసాగుతోంది ప్రవాహంలా!

వాడ,ఊరు,జిల్లా,రాష్ట్రాలు దాటి ,

ఒంటరిగా  సోల్జరింగ్ చేస్తూకూడా ,
పోలేదు భ్రమ నాకు స్నేహితులంటే 
"ఇదే",అవ్యక్తమైన ప్రేమంటారేమో ? 

పేరుపేరునా రాసాను "లేఖలు"

పేరుపేరునా వేసాను "శుభాకంక్షలు "
"రిప్లైసు" ఇవ్వలేదెవ్వరూ !
తీరా,శెలవొచ్చాక అడిగితే కన్ఫర్మేషన్:
"మాకందలేదంటే ,మాకందలేదు"
ఐ యామ్ టూ చైల్డిష్ !,ఆరంటై ?

"రిప్లై" ఇవ్వడం బద్దకమన్నారొకరిద్దరు ;

నువ్వొస్తే ,""ప్రాణం "ఇస్తామన్నరొకరిద్దరు;
"రిప్లై"ప్రమాణమా ?స్నేహానికి ?
 తెలివైనవాళ్ళు 
అప్లై-అప్లై -నో రిప్లై !

సహనం ఛస్తున్నా, పోలేదు 

ఎప్పుడు సెలవొచ్చినా కలిసేవాణ్ణి 
"జీతం ఎంత?" అని అడిగేవాళ్ళు కొందరు ;
"ఏనా తెచ్చావా ?అనడిగేవాళ్ళు కొందరు ;
తేకుండా ఉంటాడా ?తాగకుండా ఉంటాడా ?
"అన్నభరొసాతో ఉన్నవాళ్ళంతా,
ఛీర్స్  కొట్టిన వాళ్ళే" అన్టు ద  లీస్" !

సహనం ,ఓడింది - ఓడింది 

"భరోసా" గెలిచింది!
నమ్మకం గెలిచింది 
నేనోడిపోయాను !
వ్యసనం గెలిచిందా ?

నాకు "సహనం" నశించినట్లు ;

నా "స్నేహం ఓడినట్లు ;
నా "నమ్మకం"ఓడినట్లు ;
నా" విశ్వాసం"సన్నగిల్లినట్లు ;
హౌ పిస్తోంది !హా!హౌపిస్తోంది 
డామిట్ !డేమెనిట్ !