5, నవంబర్ 2014, బుధవారం

తొలి ప్రేమ (63-67)



@                                              63. తొలి ప్రేమ   (63-67)
పల్లవి: 
తోక మల్లె చెట్టు మీనా తొలి ప్రేమ రాసుకుందాం

పొన్న చెట్టు నీడ లోన పొంగులే కాచుకుందాం

వయసు పొంగులే కాచుకుందాం     :తోక:

చరణం:
రాతిరి కలలో ఒక రాణి ఒంటిగ

నన్ను కలిసి కన్ను గీతి             :రాతిరి:

గుత్తగా హత్తు కుందీ.......

అబ్బ గుత్తంగ హత్తుకుందీ

ఆ రాణి నువ్వేలే..

నా అలివేణి నువ్వేలే......           :తోక:

చరణం: 
అద్దమంటి ఆకసాన

అందాల చందురుడూ...

అద్ద మంటి ఆకసాన

అందాల చందురుడూ

యెద పొంగులే రేపుతుంటే

రేప, మాప అంటుంది

అబ్బ గుట్టు రట్టు చేస్తుంది

గుడి మీద బొమ్మలే గురుతు చేస్తుంది

వల్లకాడు వయసూ....

ఒల్ల నొల్ల నోరి మావ       (వల్ల)

అల్లరీ కాక ముందే

అయిరేణి ముందు

తాళి కట్ట రావ మావ                 :తోక:

                                

                                                     64.సవరల సరాలు


పల్లవి: 
ఒలె ఒలె ఒలె ఒలె వల్లే అనవే
ఒక ఒక ఒక ఒక ముద్దిచ్చి పోవే                                       :ఒలె:
తగల మాకే అడ్డు తగల మాకె
ఈ అడివి కె నేనంటే హడల్ హడల్                                     :ఒలె:


హీరోయిన్:
ఒరే ఒరే ఒరే ఒరే వద్దురో...
హద్దు మీరి పోవద్దురో               :ఒరే:
ముద్దుకి మనవాడ అడ్డురో
అడ్డు తగిలావంటే.....
ఈ అడివి తల్లి మీద ఒట్టురో        :ఒరే:


చరణం(హీరో):
కండ బలంతో నే బండలనే పిండి చేస్తా
గుండె బలంతో నే గుదేన్ని రాపాడిస్తా           :కండ:
ఈ అడివి రాముడాన  లేక ఆకైన ఆడదే
ఈ అడివి లోన
ఈ పూట నా మాట 
ఈ అడివికే చెల్లు బాట


హీరోయిన్:
కండ బలమున్న గూడెం రాజు కూనను
గుండె బలమున్న కొండ జాతి కన్నెను         :కండ:
నే కదం తొక్కితే కొండ ఊగులాడును
నే పదం పాడితే కోన ఊసులాడును

హీరో:
కోలనేసి కూల వేస్తా కాలు దువ్వినోళ్ళని
చూపు వల ఏసి చేత బడత పారు పిట్టని


హీరోయిన్:
అంత మోజున్న మొగనాలి వైతే,
ఒక్క రోజన్నా ఆగ లేక పొతే
పొదరింట పులి ఆట ఆడుకో
ఆపైన ఓలిచ్చి ఆలి చేసుకో             :పొద:
ఒరే ఒరే ఒరే ఒరే వద్దురో.......
హద్దు మీరి పోవద్దురో
ముద్దుకి మనువాడ అడ్డురో
అడ్డు తగిలావంటే
ఈ అడివి తల్లి మీద ఒట్టురో
ఒలె ఒలె ఓలె ఒలె వలల్లె యనవే .....
ఒరే ఒరే ఒరే ఒరే వద్దురో..........
ఒక ఒక ఒక ఒక ముద్దిచ్చి పోవే
తగాల మాకె అడ్డు తగలమాకే
ఈ అడివికే నేనంటే హడల్ హడల్ 
@

                                             65. జన్మ రహస్యం              
     కళ్ళు తెరిస్తే లోకం
     కళ్ళు మూస్తే మైకం
     తర తరాల మనిషి జీవనం
     తప్పుల పయనం
     ఇంట సతీ సుతులు
     బయట మిత్రులు
     ఇది రక్త సంబంధం
     అది సామాజిక నైజం
     బాల్యం చాపల్యం 
     కౌమారం చాంచల్యం
     నడుమ సంసార మధనం
     వృద్ధాప్యం చాదస్తం
     కళ్ళు తెరవనిదే జననం కాదు
     కళ్ళు మూయనిదే మరణం కాదు
     కళ్ళు తెరిస్తే చప్పట్లు
     కళ్ళు మూస్తే శోకాలు
     జన్మ సార్థకతకి కొలబద్దల్లేవ్
     జన్మ రాహిత్యానికి జమాపద్దులా?
     జన్మ రహస్యం-జన్మ రాహిత్యం
     అంతు తెలియని పాథాలోయ్!
     జన్మ రహస్యం ఓ జడ పదార్ధం
     జన్మ రాహిత్యం అంతర్లీనం
     మనుజులారా మేల్కొండి!
     మనుషుల్లా జీవించండి!

                                             66. నా మరణ శాశనం
     నేడే నా మరణ దినం
     నేడే ఆ పర్వ దినం
     నేడే నా దినం దినం
     నేడే నా దినవారం


     స్నేహితులారా రారండోయ్!
     స్నేహితులారా రారండోయ్!
     లేఖ రాయనందుకు మన్నించండోయ్!
     విసిగి వేసారిన నన్ను విమర్శించకండోయ్!
     మీకెన్నో పనులు
     మీకెన్నో బాధ్యతలు
     రాలేదని బాధపడనోయ్
     నేనెప్పుడూ అనాధనేనోయ్!
     నాకెందుకోయ్ సంతాప సభలు?
     నా కెందుకోయ్ అశ్రు తర్పణాలు?
     నా కెందుకోయ్ తిలోదకాలు?
     చేసుకున్నందుకు చేసుకున్నంత!
     నా బతుకు నాదేనోయ్
     నా బతుకు పండేనోయ్
     బతికినన్నాళ్ళూ రుణ పడి ఉన్నానోయ్!
     చచ్చాక మీరుణమెలా తీర్చుకోనోయ్?
     నన్ను చంపిన హంతకుల్ని వెతికి పట్టుకొండోయ్
     నేరస్తుల్ని మిత్రన్యాయస్థానంలో నిలబెట్టన్డోయ్!
     బతికినన్నాళ్ళూ చచ్చి బతికేను
     చచ్చి నేను బతికిపోయానని
     వినోదమా? విచారమా?
     బ్రతికి నందుకు బాగు బాగు
     చచ్చినందుకూ బాగు బాగేనా?
     నన్ను శాంతంగా బతకనివ్వ లేదు
     నన్నుప్ర శాంతంగా చావనిచ్చినందుకు
     స్నేహ నమస్తులందుకొండోయ్!
     నా స్నేహ కృతజ్ఞతలు అందుకొండోయ్!
     నా మరణ వార్త ఎవ్వరికీ చెప్పోద్దని
     నా స్నేహితురాలితో విన్నవించుకున్నా
     అదొక్కటే స్నేహచిహ్నమా?
     మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రక్షాలించుకుంటా                  
                                             28-04-2004

4, నవంబర్ 2014, మంగళవారం

   @                     50.  అతి స్నేహం  (50-62)

       మాయావి లోకంలో
       ఎండమావి స్నేహమూ
       మేలైనా, కీడైనా
       మూలమే స్నేహమూ                :మాయావి:
       కాపాడినా స్నేహమే
       కబళించినా స్నేహమే
       అని విన్నాను
       అంతటా నమ్మాను
       అలుసై పొయ్యాను
       కంటిలోని నలకలా
       కనబడదేం స్నేహమూ?
       నిన్నెలా వెలికి తియ్యను?
       నిన్నెలా వెతకను?                   :మాయావి:
       సృష్టి రహస్యం సహ జీవనమూ
       స్నేహం అందులో పెను భాగమూ
       సృష్టికే మూలం
       సృజనకు ఆలవాలం                 :మాయావి:
       శృతి మించిన స్నేహం
       శృతి తప్పిన గీతం
       మితి మీరిన స్నేహం
       దేహానికి రోగం
       తన్ను మాలిన స్నేహం
       మొదటికే మోసం                       :మాయావి:
                                                51.  రాగం: అనురాగం
     కినుకే ఒక రాగం కనక పుష్య రాగం
     ఆ వెనుకే జడగంటల రాగ సరాగం
     ఆ నడకే గజ గామిని వర గమకం
     ఆ కులుకే సాని కిన్నెర కన్నె సోయగం             :కినుకే:
               నే కనుక నీ వెనక బడి
               ప్రణయ గానాలు రాయుదునా?
               సరాగ రాగాలు పాడుదునా?
               సుస్వర రాగ మాలికలు పాడుదునా?           :కినుకే:
     ఆ కినుకే-ఆ నడకే- ఆ వెనకే నే కనకే
     కన్నానులే కనులార కనుగొన్నానులే
     నా అన్నుల మిన్న వలపు చిత్తరువులూ
     వలచి ఒలిచి నిలిచిపోవే కన్నుసన్నలా              :కినుకే:
               దరి చేరక దాగుడు మూతలా?
               ఒడి చేరక క్రీగంటి కవ్వింపులా?
               లేని పోని కోపమా? భామా కలాపమా?
               ఏదొక్కమాటు ఊది పోదువుగదే!
               మది కన్నుల నా బృందావనిలో               :కినుకే:
                                                           52.  ఆహ్వానం
          ఇళ్ళల్లోకి వెళుతున్నావండి
          కొత్త ఇళ్ళల్లోకి వెళుతున్నావండి
          మీరంతా తప్పక విచ్చేయ్యండి
          మమ్మల్ని దీవించి దయ చూడండి              :ఇళ్ళ:
     చుట్టాలు, పక్కాలు చూడ ముచ్చటలెండి
     ఇరుగు, పొరుగు వారెంతో వినయవండి
     సహాధ్యాయుల సహకారముంది
     పట్నంలో పలుకుబడికి లోటే లేదండి                 :ఇళ్ళ:
          కలిమి కలిగిన వారము కావండి
          చెలిమికి మేమంతా చిరునామా లెండి
          లేమి మా వాకిలి లోనే లేదండి
          కలిసి మెలిసి మసులుతూ
          లేమిని మా దరికే రానీయమండి               :ఇళ్ళ:
     పాపాయిల నవ్వులే పచ్చతోరణాలండి
     ముత్తైదువుల కదలికలే ముత్యాల ముగ్గులండి
     మీరొచ్చిన వేళే ముహూర్తమండి
     మీ మనోకామనలే మాకాశీస్సులండి                :ఇళ్ళ:
          కొత్త బట్టల కోలాహలం ఎందుకు లెండి?
          మాయ మర్మం లేని మాటలాడు కుందావండి
          అరమరికల్లేకుండా ఆరగించేద్దాం    
          సహపంక్తులండి సహభోజనాలండి            :ఇళ్ళ:

                                           53.  నేను
      నేనో ఎడారిని
      ఆశీస్సులు కాదు:
      ఒయాసిస్సులు కావాలి
               నేనో చిన్ని దివ్వెని
               భవంతులు కాదు;
               ఓ చిన్న ఇల్లు కావాలి
      నేనో కొవ్వొత్తిని
      జేజేలు’ కాదు;
      ఆరిపోకుండా చూడండి
                 నేనో స్ఫటికాన్ని
                 పారమార్దీకం కాదు
                 పారదర్శకత కావాలి
        నేనో నదీమ తల్లిని
        పూజలు కాదు;
        కలుషితం చెయ్యకండి.
                  నేనో గిరిజనున్ని  
                  నా తల్లిని పొట్టన పెట్టుకోకండి;
                  నాకు అక్షర భిక్ష పెట్టండి.
        నేనో కొండల గుంపుని
        నా గుండెలు వ్రక్కలు చెయ్యకండి;
        చల్లని మేఘాల స్నేహం నిలపండి.
                   నేనో ప్రకృతి కాంతని
                   అందునా, అందమైన స్త్రీ మూర్తిని:
                   ప్రకృతిలో మిగిలిన
        ఏకైక సౌందర్యరాశిని;
        నాపై అత్యచారాలాపండి:
        లేదో-
        విశ్వం లో వికృత ప్రలయమై
        జీవన వేదం నశించిపోతుంది
        కాల చక్రం ఆగి పోతుంది

                                          54.   ప్రేమ జాలం
     ప్రేమ యోగమా? మాయ రోగమా?
     వయసు పరిణామమా? మనసుకే పరిమితమా?
     ఎదిగీ ఎదగని మనసులు
     చాలీ చాలని వయసులు
     జీవితాలతో ఆటలు-నవ్వులాటలు
             ప్రేమంటే ఇంతేనా?
             జీవితమే ప్రేమ జాలమా?
             పారు దేవదలెవరు?
             లైలా మజ్నూలదేదేశము?
             అనార్కలీ, సలీములదేకులము?
             రోమియో-జూలియట్ కధ నిజమేనా?
             ప్రేమ మోసం చేసిందా?
             ప్రేమకు ద్రోహం చేసామా?
     జగమే నాటక రంగమని
     జీవితం ఏడు పాత్రలని
     ప్రేమ ఒక్క పాత్ర మాత్రమేనని
     జీవితమంతా ప్రేమ కాదని
     తెలిసి మసులుకో
     మనుగడ సుఖం చేసుకో
     అప్పుడే- ప్రేమ యోగమౌనురా!
     జీవిత సారమిదేనురా
     వేదాలకు మించిన సారమిదేరా
                                              55.   బృందావన కృష్ణుడు

       బృందావన కృష్ణుడు
       గోపికా పరివేష్టుడు
       వినీల మేఘశ్యాముడు
       చిత చోరుడు
       పరంధాముడు                             :బృందావన:
            రాధనురా-
            నీ ప్రేమ మానసనురా
            రాగాభావనా వినోదనురా
            విరహ యోగినిరా
            నిన్ను చేర మది కోరితిరా
            కరుణింపరా                           :బృందావన:
            శరణాగతులను
            వీడని వాడవనీ
            అపవాదైనా-అప్రియమైనా,
            ఆస్వాదించే నందనందనా
            లీనము కానీరా
            నీలో లీనము కానీరా                 :బృందావన:
       రసిక రాజువని
       నమ్మిన వారు గోపికలు
       గోపిక కానురా- నే గోపిక కానురా
       గోపకిశోరా!
       ఓపిక ఉన్న ఓపిక గాధనురా
       రాధనురా! నీ రాధనురా!                    :బృందావన:
                                             56.   మనిషిగా
             మనసుకి మౌనం బాగుంటుందా?
             ఊసులాడకున్న ఊరుకుంటుందా?
             మాట మూగాదైతే చేటు లేదులే
             మనసు మూగాదైతే జీవితం సున్నాలే!
       మాటాడే మనసు ఊసులు
       కష్టసుఖాలకు ప్రతిబింబాలు
       మూగోళ్ళ సైగలే ఊసులు
       ఎంత గొప్పదో ఈ మనసూ                         :మనసుకి:
             పన్నీటి పలకరింపులైనా,
             కన్నీటి వెల్లువలైనా,
             యెద నవ్వుల పులకరింతలైనా,
             ఆ ఒక్క మనసుకే చెల్లు;
             అది లేదందుకే, నవ్వలేవు
             జంతువులూ,
             మనసు లేదందుకే
             నవ్వలేవు జంతువులూ!                     :మనసుకి:
       మనిషిలో ఉదయం ఉషస్సు
       ఉషాస్సుకు మేలుకొలుపు పాడేదే మనస్సు
       ఆ మనసిచ్చి,” వాడు” దేవుడయ్యాడు
       మనసెంత గొప్పదో మూగాబోనీకురా!           :మనసుకి:
             మనసు మనసుతో స్పందిన్చనీ
             మనిషి మనిషినీ బ్రతకనీ
             సాటి మనిషి కష్టాలు పంచుకో
             సమాజ హితవుకై శ్రమించరా!        :మనసుకి:
       మనసున్న ఓ మనిషీ!
       మంచీ చెడులను గుర్తించు
       “నే మనిషిని”, పశువును కాదని
       నిరూపించరా నిష్కామివై!                      :మనసుకి:                                               
                                             57.  పనియే పరమావధి
       పల్లవి: 
       కృషితో నాస్తి దుర్భిక్షం
       కృషితోనే కుశలం
       కృతమే సుకృతం
       ఆ కృషితోనే జీవనం               :కృషితో:
       చరణం:
       పనివంటి వస్తువు లేదనీ
       ప్రజా కవులు చెప్పారు
       పనితోనే మన్నికనీ
       చెయ్యని మనిషో
       పనికి మాలిన వాడనీ
       నిర్వ్యాపారం నాతోనే
       అంతం కావాలనీ
       సంకల్పం చెప్పుకుందాం          :కృషితో:
       చరణం:
       చేసే వాడికే “పని” దొరుకుతుందనీ,
       చెయ్యని వాడికి సాకు దొరుకుతుందనీ
       నిలివెత్తు సందేశం
       మన ఆత్మలే నిదర్శనం
       వంద కోట్లు దాటిన దేశంలో
       పని చేసే వాళ్ళే కరువైనారే!
       ఇది ప్రభుత్వాల వైఫల్యమా?
       తీరు తెన్నూ లేని ప్రజల నిర్వాకమా?   :కృషితో:
       చరణం:
       ప్రజాతంత్ర మంటే ఎన్నికలు కావనీ
       మన్నికైన ప్రతినిధుల ప్రాతిపదికనీ
       ఎన్నుకోండి! ఎన్నుకోండి!
       ఎన్నికకో మన్నిక కల్పించండి
       ఇది ప్రజా కోర్టు తీర్పనీ
       వంటా వార్పూ కాదనీ
       ఇవి హెచ్చరికల చురకలనీ
       ఇకనైనా తెలుసుకోండి!                    :కృషితో:   
       చరణం: 
       అంతరించి పోయింది ఫ్యూడలిజం
       అంతరించి పోయింది పెత్తందారీతనం
       అంతరించి పోయింది కమ్యూనిజం    
       మిగిలింది మేలైన ప్రజాస్వామ్యం
       ఇది అంతరించి పోకూడదనీ
       మిగిలిందిదొక్కటేననీ
       ప్రజా కంకణం కడతాం
       దక్కించుకు తీరుతాం                      :కృషితో:
                                                           58.   ఇరవై:ఇరవై
       ఎచట నుంచో ప్రజా నాదం
       ఎచట నుండో ప్రజా వాదం
       ఎచ్చటి నుంచి ఈ ప్రజావాదం?
       ఎచ్చటి నుండి ఈ ప్రజా నాదం?
       వర్ణ భేదాలోద్దని ప్రజావాదం
              వర్గ భేదాలోద్దని ప్రజానాడం
              ఇది ప్రజా గుంపుల ఏక కంఠం
              దశ దశాబ్దాల ప్రజల కంఠం
       ఎల్లల్లేని భూగోళం నా దేశం
       అరమరికల్లేని పాలనా శాశనం
       అరకొర చట్టాలొద్దు
       అర్దాయుషు రాయితీలొద్దు
       మది నిండా జగమంతా కుటుంబం
              సరిహద్దులు-సైనిక ముట్టడులు
              మిత్ర రాజ్యాలు-మిత్రకూతములు
              ఒప్పందాలు-ఒడంబడికలు
              తిరిగి రాయొద్దు నిన్నటి చరిత్రలు
       శాంతి, భద్రతలు రెండే రెండు
       ప్రజల్లేక సంఘం లేదు
       భద్రత లేక ప్రజల్లేరు
       శాంతి లేక వికాసం లేదు
       వికాసం లేక దేశమే లేదు     
              ఎంత కాలమీ మల్ల గుల్లాలు
              కొట్లాడు కుంటూ కొల్లగొట్టు కుంటూ
              అభివృద్ధి చెందుతూనే ఉండడం
              భారత వాక్యం పలుకు దాం
              భారత్ ని బాగు చేద్దాం
       మరువకండి మనం నూరు కోట్ల ప్రజలం
       ప్రతి మనిషీ పని చేసుకుందాం
       విజ్ఞానం, వనరులు అన్నీ ఉన్నాయ్
       మన విజ్ఞానం పెంచుకుందాం
       సుజలాం – సుకలాం
       సుఫలాం – సుకలాం
       సువికసితాం – సువిశాల భారతాం
                                                        59.  బ్రతుకు తెరువు వేదం
      నవ్వు లాట కాదయ్యా
      ఇది జీవితమయ్యా బ్రహ్మయ్యా
      నుదుట ఇన్ని గీతలు గీసీ
      బ్రతుకు తెరవు గీత మరిచేవయ్యా               :నవ్వు:
                ఓ అమ్మ కడుపున పడేసి
                ఈ భూమ్మీద పడేసి
                వందేళ్ళూ బతకమని
                ఇరికిన్చేవయ్యా
                ఇరికించుట నీ వంతైతే
                బయట పాడుట నా వంతా?
                ఎవరి వంతా పాడ కుంటే  
                ఈ బ్రతుకంతా ఇంతేనా?                :నవ్వు:
      మనిషి జన్మ నా కిచ్చి సాధించేననుకున్నావ్
      ఇలాగే బతుకుతాననుకున్నావ్
      ఎలాగైనా బతకొచ్చని తెలుసుకున్నాను
      ఇంట కన్న యుగ ధర్మం ఇల లోనే లేదంటా   :నవ్వు:
                నాకు కాని నీ రాతలు నువ్వేచెరిపేసుకో
                లేదంటే నువ్విచ్చిన జన్మే తీసేసుకో
                నా తల రాతలు నేనే రాసు కుంటా
                ఇహాన ఇంట కన్న తెరువే లేదంటా
                ఇంట కన్న బ్రతుకు తరువు లేనే లేదంటా   :నవ్వు:
#                                                    
                                         60.  జగమేమాయ
సాకీ: 
చదువే.... మయా...జాబులే....మయా..
డిగ్రీలలో సారమింతేనయా.... ఈ వింతేనయా....
పల్లవి:
చదువే మాయా – జాబులే మాయా
డిగ్రీలలో సారమింతేనయా
ఈ వింతేనయా                                              :చదువే:
చరణం: 
చదువూ, లోనులూ, తీర్చే కష్టాలూ 
చదువూ, లోనులూ తీర్చే కష్టాలూ
క్లాసుల్లో నోట్సులనీ
భయమేలోయీ
పట్టా కగితమోయ్ – చదువులు పెడదారోయ్
కనుగొంటే సత్యమింతెనోయీ
ఈ వింతేనోయీ                                             :చదువే:       
చరణం:
జాబూ, మొహములా, దరిరానీకోయీ
పెద్దలకే ఈ దుఖం అంకితమోయీ
పెద్దలకే ఈ దుఖం  అంకితమోయీ
ఉద్యోగాల్లేవనే భావన రానీకోయ్ 
ఆఎరుకే వింత వేదాంతమోయ్
ఎంతో ఆనందమోయ్-ఎంతో వైరాగ్యమోయ్             :చదువే: