9, అక్టోబర్ 2014, గురువారం

@                                                    35.హే! భారత్ !     (35-39)


ప్రియ స్వతంత్ర భారతమా !
ప్రియతర స్వతంత్ర భారతమా !
ప్రియతమ భారతం స్వాతంత్రమా?
 ప్రియాతి ప్రియ భారతం ప్రజాస్వామ్యమా?

ప్రియతర స్వతంత్ర భారతమా !
ప్రియతమ భారతం స్వతంత్రమా ?
ప్రియాతి ప్రియ జన జీవనమా ?
నాటి ప్రియ భారతం గణతంత్ర రాజ్యమా ?

ప్రియతరమో ?ప్రియతమమో ?
 ప్రియాతి ప్రియమో ?నాతి ప్రియమో?
ఏమో ఈ దేశ  స్వరూపమూ !
ఏమో ఈ రాజ్య స్వభావమూ!

పరమత ద్వేష జ్వాలలూ
ప్రాంతీయతా వైషమ్యాలూ
"పరిపాలనా సౌలభ్యం"  అంటూ,
ప్రాంతమొక్కప్రదేశ్ కావాలంటూ
"విభజనే" కాంక్షించే విషశ్సక్తులూ
 విలయ తాండవం చేసే
భారతావనిలో ;
నేడు :
కలియుగ పంచశీలాలు
ఒకటి "స్వార్ధ బుద్ది"
రెండు "కులమత ద్వేషాలు "
మూడు హద్దు మీరిన " అవినీతి"
"ప్రజా ధనం దోపిడీ"ప్రభుద్దులు"
"అజాతీయీతా" జాడ్యం
ఈ దేశ పయనం ఎటో ?

ప్రియ భరతమా !
ప్రియతమ భారతం స్వతంత్రమా ?
ప్రియతమ ప్రజాస్వామ్యమా ?
ప్రియాతి ప్రియ గణతంత్రమా?
నాతి ప్రియా  తూ తూ మంత్రమా ?



@

                                            36. మరో స్వాతంత్ర్య సమరం

   స్వాతంత్ర్యం వచ్చిన్దోయ్
   స్వాతంత్ర్యం వచ్చిన్దోయ్
   స్వపరిపాలన వచ్చిన్దోయ్
   స్వాహా పాలన తెచ్చిన్దోయ్
           స్వాతంత్ర్యం ఎలా వచ్చిన్దోయ్?
           ఏ ఒక వ్యక్తీ తీసుకు రాలేదోయ్
           ఏ ఒక్క సంస్థా తీసుకు రాలేదోయ్
           దేశ భక్తి పెల్లుబుకి
           ప్రజలంతా తిరగబడి
           పరుల దాస్యంలో చచ్చినా, బ్రతికినా
           తేడా లేదన్న భావం పెల్లుబికి
           ప్రతీ ఒక్క భారతీయుడు
           అహర్నిశలు శ్రమించి, పోరాడి
           వేల మంది ప్రాణాలర్పించి
           సంపాదిన్చినదీ స్వాతంత్ర్యం
           స్వాతంత్రం – స్వాతంత్రం
           స్వతంత్రం-స్వాహా మంత్రం(తంత్రం)
           సత్యాగ్రహాల్ – సహాయ నిరాకరణోద్యమాల్
           “క్విట్ ఇండియా” – ఉప్పు సత్యాగ్రహాల్
           ఒక ఎత్తైతే;
           “జలియన్వాలాబాగ్” లో ప్రాణాలు
           కోల్పోయిన దేశ భక్తులెవ్వరోయ్?
           వాడ – వాడ, ఊర-ఊర,
           రాష్ట్ర-రాష్ట్రాన, ప్రదేశ్-ప్రదేశాన
           కఠిన శిక్షలు – జైలు శిక్షలు
           కొరడా దెబ్బలు-కఠోర హింసలు
           మాన భంగాల పాలైన శీలవతుల
           శీలాలు
           రక్తసితమైన అన్నెం పున్నెం ఎరుగని
           అమాయక ప్రజలనూ లెక్కించాలోయ్
                    పరిపాలన వద్దన్న ఏక కంఠం;
                    ఏదేమైనా పరిపాలన మాకొద్దన్నఏక భావం;
                    మా పరిపాలన మాదన్న మమైక భావం;
                    “స్వాతంత్ర్యం మా జన్మ హక్కన్న”
                    సామాజిక స్పందన, నినాదాల్;
                    మా దేశంలో మీకేంపని?
                    ఇవన్నీ లెక్కించాలోయ్!
                    ఇవన్నీ రొక్కించి చరిత్రకెక్కిన్చాలోయ్!
   బ్రిటిష్ కిరాతకానికి హతమైన ప్రాణాలు
   బ్రిటిష్ దురాగతాలకు దుహ్కించిన బడుగులు
   ఎందరో! వీరందర్నీ,
   ఏ కితాబుల్లో లిఖించారోయ్?
   “ఆజాద్” చంద్రశేఖర్లు
   “షహీద్” భగత్ సింగులు
   “అల్లూరి” సీతారామరాజులు
   స్వాతంత్ర్య సమార చరిత్రల్లో
   అజరామరాలోయ్!
   అమరవీరులోయ్!
   భారతావనిలో రక్తం పారనిదే
   “మాతృ” భూమి “మరుభూమి” కానిదే
   ఈ దేశం “చెరకు పిప్పి” కానిదే
   రాలేదోయ్   స్వాతంత్ర్యం!
   అంతం కాలేదోయ్ పరతంత్రం!
   మన స్వాతంత్ర్య సంగ్రామం మరో కురుక్షేత్రం
   అది ధర్మ బద్ధం-ఇది బ్రిటిష్ తంత్రయుద్ధం
   దానికి “సారధి” ఒక్కడైతే
   దీనికి అందరూ సారధులే!
   కురుక్షేత్రం పాంచజన్యమైతే,
   స్వతంత్ర సమరం” ప్రజా ప్రభంజనమోయ్! 
   “అది” ఇతిహాసమైతే
   “ఇది” చరిత్రోదయమోయ్!
   “ఇది” చరిత్రోద్యమమోయ్!
              ఏం సాధించామోయ్
              స్వాతంత్ర్య తెచ్చుకుని?
              ఏం అనుభవిస్తున్నామోయ్
              స్వతంత్ర్యం సముపార్జించి?
              భారతీయ పౌరుడిగా
              నీ హక్కులేమిటోయ్?
              అన్నీ బాధ్యతలేనోయ్!
              పెరుగుతున్న టాక్సులు
              పెచ్చు పెరుగుతున్న ధరవరలు
              పాలకుల నిరంకుశత్వాలు
              ప్రజాప్రతినిధుల ఆగడాలు
              గతుకుల్లేని రోడ్లేవోయ్?
              మీ బతుకులెలా బాగుపడేనోయ్?
              తాగు నీరు లేదోయ్
              సాగునీటి మాటేమిటోయ్?
                       విద్యుచ్ఛక్తి ఒక విన్తోయ్!
                       జన జీవన ప్రమాణాల మాటేమిటోయ్?
                       మానవ విలువల మామిటోయ్?
                       “విద్య” ఓ వ్యాపారం
                       “మీడియా” దో అతి పెద్ద వ్యాపారం!
                       “బ్రతుకులు” మూడు నాళ్ళు
                       బ్రతికినన్నాళ్ళూ మూడే కావాలి
                       కూడు, గూడు, గుడ్డ
                       రోటీ, కపడాకే జీతాలు సరి సరి!
                       మరి గూడు మాటో? హరీ!హరీ!
                               ప్రాథమిక హక్కులు హరింపజేస్తున్న
                               ప్రభుత్వాలు;
                               ప్రజా ఉద్యమాల్ని హరింపజేస్తున్న
                               పోలీసు యంత్రాంగాలు;
                               ప్రభుత్వమో నాటకం
                               ప్రజాప్రతినిధులాడేది బూటకం
   అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిన దేశంలో
   పట్టపగలు కూడా పడతులు వీధుల్లో
   నిర్భయంగా నడవలేని దౌర్భాగ్యం
   ఇక ప్రజలు హాయిగా నిదరోయిన రాత్రులెన్నోయ్?
           సెక్యులరిజం మాటే గానీ, సెక్యూరిటీ లేదు!
           మనదో పిక్యూలియర్ ప్రజాస్వామ్యం!
           మనదో పిక్యూలియర్ పార్లమెంటరీ ప్రభుత్వం!
           మన దేశ ఇన్ఫ్లేషన్ పిక్యూలియర్!
           మన మార్కెట్లో అన్నీ ఉన్నాయ్
           సామాన్యుల కొనుగోలు శక్తి ఎంత మాత్రం?
           ఇది సెల్లర్స్ మార్కెట్
           “బయ్యర్సుది” ఏ మాత్రం కాదు!
   అరవై ఏళ్ల స్వాతంత్ర్యానికి
   వృద్ధాప్యం జబ్బు పట్టిందోయ్
   అరవైఏళ్ల వృద్ధాప్యపు
           నాయకులకు పెడదోవల
           పెరాలసిస్ వచ్చిన్దోయ్!
           ఉద్యోగులకే కాదు:
           ఊళ్ళేలే ప్రజాప్రతినిధులకూ
           రిటైర్మెంట్ ఇవ్వండి
           శాశనం చెయ్యండి!
                    మించి పోయింది లేదు
                    ఆలస్యం అమృతం విషం
                    కదలండోయ్! కార్మోన్ముఖులు కండోయ్!
                    కదలండోయ్! కల్మషం కడగండోయ్!
                    దేశభక్తితో కళ్ళు తెరవండోయ్!
                    మళ్ళీ స్వాతంత్ర సమరం నెరపండోయ్!
                    పనికిమాలిన జాడ్యపు పుటల్ని చిన్చండోయ్!
   ఇది మన దేశం-వీళ్ళంతా మన ప్రజలు,
   మా వంతు మేం కృషి చేస్తామంటూ,
   నాలుగ్గోడల చర్చలకు స్వస్తి పలకండోయ్!
   మరో స్వాతంత్ర్య సమరానికి నాంది పలకండోయ్! 
                                               ఏప్రిల్ 2004
@                                      37.  అమ్మలార! అయ్యలార!

                    అమ్మలార! అయ్యలార!
                    భారత భాగ్య విధాతలార!
                    బాలల భవితవ్యం తీర్చిదిద్దే
                    భారత భాగ్య విధాతలార!                       :అమ్మ:
          తల్లంటే తొలి గురువు
          చెరగని ముద్రల రుజువు
          జనయిత్రి, ధరియిత్రి, కవయిత్రి
          ధర్మ పధగామినీ గాయిత్రి                               :అమ్మ:
                    అమ్మంటే కాదు పూటకూళ్ళమ్మ
                    బరువు బాధ్యతల పట్టు కొమ్మ
                    ఎదిగే సమాజానికి తొలి మెట్టు
                    దేశానికి తానిచ్చిన కోట్ల పెట్టు                :అమ్మ:
           తండ్రంటే తెచ్చిపడేసే యంత్రం కాదు
           ధైర్యసాహసాలకు మారు పేరు
           నిజాయితీ నేర్పే నిష్కామి
           పాలనలో పట్టు తప్పని నాయకుండు
           కుటుంబ పరిపాలనకే ప్రయోజకుండు            :తండ్రంటే:
                    సామాజిక స్పందనకే విలువిచ్చి
                    నిస్వార్ధబుద్ధినే నేర్పించి
                    వికాసమే ధ్యేయంగా
                    దేశవికాసమే ధ్యేయంగా
                    తీర్చిదిద్దందోయ్
                    తల్లులార! తండ్రులార!
                    భారతభాగ్య విధాతలార!
                    బాలల భవితవ్యం తీర్చిదిద్దే
                    భారతభాగ్య విధాతలార!
                                                     38.  తపస్సిద్ధి
             మేఘమా – మేఘమా – ఓ మేఘమా!
             మేదినీ జీవనమా! ఏమి నీతపమూ!                       :మేఘమా:
                     గాలిచేతులు తాకగానే
                     పరవశించి పోదువేల?
                     పరవశించి నీరై పోదువో!....... నీరదమా!         :మేఘమా:
             పావనములైన నీరే
             అన్నగత ప్రాణాలు మాకు
             జీవనసోపానాలు
             రుచిరాన్నములిచ్చి
             నిముసమైన ఆగకుండ పోదువే......పావనీ...           :మేఘమా:
                     నీ ధాటికి ఆగలేక
                     నిన్ను మేము ఆపలేక
                     నిశ్చేష్టులైపోదుమే!
                     ప్రాణధారలాపంగలేని
                     అప్రాచ్యులమో! స్వాధ్వీజలలామమా!             :మేఘమా:
             ఆగిపోక సాగిపోదువేలనో?
             జలనిధులు చేరి చేరి
             జలధిసంతు తేలియాడ
             చూసి, చూసి మురిసిపోదువే!
             మువ్వంతుల మేల్బంతివే!                                   :మేఘమా:
                     మురిసి - మురిసి, సుషుప్తుల సోలి – సోలి,
                     తప్తహృదయివై ఆవిరైపోదువే!
                     మరల జల జలమని నెల రాలి
                     అభంగతపమాచరింతువే!
                     చరింతువే! చరితార్ధినీ!                                 :మేఘమా:
                                                                                     10-01-2013


@

                                          39.   ఫ్రీడం ఖరీదు?
     పల్లవి: 
     ఫ్రీడమంటే ఫ్రీగా వచ్చింది కాదురా!
     వేనవేల త్యాగాల ఫలమురా!                    :ఫ్రీడం:
    చరణం: ఎప్పుడైనా, ఎక్కడైనా
    యుద్ధాలు చేసిందెవరూ?
    నాయకులా? నేతలా?
    కాదు, కాదు-
    రాజులా? రారాజులా?
    కాదు, కాదు, కానే కాదు
    నిద్రాహారాలు నిర్జించి
    వెన్నుపోట్లు, దురాక్రమణలు,
    పగబట్టిన శత్రుసేనల పన్నాగాలూ-
    పసిగట్టి, ఎదిరించి, సల్పిన
    మనసేనల త్యాగనిరతి;
    భారతభాగ్య జనాభా జ్యోతి
    రమణీయ భారతి తిలకం
    వెలిగే వందకోట్ల ఆశాదీపం                        :ఫ్రీడం:   
    చరణం:
    ప్రభుత్వాలు సేన వెంక నిలవకపోతే?
    పౌరులు వారి వెన్నంటి ఉండకపోతే?
    ప్రతి పౌరుడు సైనికుడై వేచి ఉండకపోతే?
    ఫ్రీడం ఊరికే కాపాడబడుతుందా?
    వెచ్చించక తప్పదు వెచ్చటి నెత్తురు;
    వెచ్చింపక దక్కదు దేశమాత పేరు             :ఫ్రీడం:
    చరణం:
   దేశరక్షణ సేనలకే పరిమితమన్న
   వితండవాదం ;      
   మితిమీరి, శుష్కవాదమై ప్రబలెను నేడు!
   హక్కులిచ్చిన రాజ్యాంగం
   విధులనూ ఇచ్చిందని మరవకు
   రాజ్య సార్వభౌమాధిపత్యం
   ముప్పునబడితే?
   దేశరక్షణ ప్రతిపౌరిడి విధిరా!
   విధులను నిర్వర్తింపక
   హక్కులనుభవించే హక్కే
   నీకు లేదురా (హక్కుల భోక్తవు కాలేవురా!)  :ఫ్రీడం: