10, జూన్ 2015, బుధవారం

@                  బాపు రమణల సప్తస్వరాలు
ఆ.వె.  జంట కవుల పదము పంటలు పండించ
          నాడు దేశ మంత నాట్య మాడె;
          రెండు భాషలకును మెండైన కవులైరి
          వారి అంశ కాదె! బాపు రమణ!
ఆ.వె. గీత ప్రాణ పదము రాతలు రమణవి
          రాత, గీత బాపు రమణమయ్యె;
          సినిమ సీమ లోన సిరుల ముగ్గులనల్లె
          బాపురమణ జంట బహుపరాక్కు!
ఆ.వె. గీత సాక్షి రాత గీటుగా మొదలైన
          బాపురమణ జంట పయన కీర్తి    
          “రంగుసీమ” లోన రసగులికలనిచ్చె
          బాపురమణ జంట బహుపరాక్కు!
ఆ.వె. తడిసి “ముద్ద” అగుట తరతరాలుగ వచ్చె
          తడిసి “ముద్దు” రమణ తరహ రాత!
          తడిసి “హీరోఇన్లు” మడిగట్టు కుందురా?
          గీతగీయు బాపు; రాత రాయు రమణ!
ఆ.వె. మైత్రి లోని విలువ ధాత్రిలో చాటెను
          “ఉభయ కవులు” వారు అభయమిచ్చె
          రమణ లేని బాపు రసహీన కావ్యంబు
          కాదె! రాత లేక లేదు గీత!
ఆ.వె. సహజముగ “మరణము” సామాన్యులిలపోవ;
          మాన్యుడిలను పోవ అన్యమగును;
          మహిమగాదె  హ! అసమాన్యుడు పోవంగ!
          చేరు కొనెను బాపు చెంత రమణ!
సీ.      రాసిన రాతకు గీసిన గీత సా
          క్షిగ నిల్చి రస సృష్టి యగుట ఘనము;
          గీసిన గీతకు రసప్రుష్టి గల్గుట
          వేసిన రంగుకు రాసినట్టు!
          “రెండు జడల సీత” రెండు తెలుంగుల
          తెరచాటు వెలుగుల తెలుగు బాల!
          బాణికి సరిపడ వాణిని పల్కిన
          బాపు రమణలైరి బాసరమణి!
ఆ.వె. వేయు పల్కనేల? వెలుగు తెల్గులసాక్షి
          వెండితెరకు సాక్షి వేదమగును!
          కుంచె బాపు కదల కురిపించెను రమణ