31, మార్చి 2014, సోమవారం

@                                                          
                                   27."చెలి (మి)తో"  వ్యవసాయం (27-32)
పల్లవి :
ఏటవతల యవసాయం చేసుకొందమా ?
చక్కనైన చెలకుంది  చూసుకుందామా ?    :ఏట :

ఆమె :
ఏటవతల ఏరోచ్చి ముంపోస్తాది 
ఈడనే తోడుంటా , ఈ ఎకరం చేసుకో            :ఏట :

చరణం 

(ఆమె )
పొగనారు మడికట్టు 
తరగనన్ని సొమ్ములొచ్చి పడతాయి             :పొగ :
ఈపొద్దు -ఆపొద్దు 
మడితడుపుతుండాల 
"నాగా"పడినాదంటే 
ఏపుసచ్చి పోతాది              :ఏటవతల ఏరొచ్చి:

చరణం 

(అతడు )
పుగతోటలో నీసొగసు 
చూసుకుంటాను 
మొక్కజొన్నతోటలో 
మోజు తీర్చుకుంటాను 
అలుపూ సొలుపేలేని 
ఆరేసి కాలాల ఏరువాక సాగిద్దాము 

ఆమె :
హద్దూ పద్దూ లేని వగలెన్నో 
పండిద్దాము 

అతడు :
హద్దూ పద్దూ లేని వంగడాలు 
పండిద్దాం 

@                                          28.  నెల్లూరి నెరజాణ                     1981

పల్లవి :

 అల్లూరి సీమలో  నా కన్నెకవితకు 
ప్రాణమై నిలిచింది నువ్వు                   :అ :
అలవోకయై రేగిన భావాలకు 
జీవకళ పోసింది నువ్వు 
జీవకళ పోసింది నువ్వే-నువ్వు            :అల్లూరి :

చరణం :

"తలమంచి" మల్లెలు తలనిండ నింపుకొని 
 వన్నెలార బోసింది ,ఓ వన్నెలాడి 
వెన్నెలార బోసింది ,ఓ కన్నె లేడి 
వన్నెలా బోసింది -వెన్నెలార బోసింది 
ఓ నెల్లూరి నెరజాణ 
కవికే నేర్పింది - కవితా సుధలు             :అల్లూరి:

చరణం :

ఊరు కలుజు జాలువారులో 
కన్నె పద్మమొకటి 
విర బూసి నిలిచింది                             :ఊ:
సరిమంచు (సరిగంచు)కుచ్చెళ్లు 
సరిగమలాడగా 
"మందస్మిత"వదనయై 
వెన్నెలార బోసింది 
పున్నమి పూవెన్నెలలో                        :అల్లూరి:

@                                                      29  ఎంకి పాట                         1974

పున్నమి ........... ఎన్నెలా ......... 

పొద్దుపోనిత్తువా  ?
పొత్తు కుదిరినాది మా ..... వా ...... 
సద్దుమణిగుంటాది  మా ...... వా ..... 
మావా ..... 
సద్దు మణి గుంటాది ,మా.... వా.....  

పల్లవి :

పున్నమి ఎన్నలా పోనిత్తువా?
పొత్తు కుదిరినాది మావా 
సద్దుమణిగుంటాది  మావా 
మావా ...సద్దుమణిగుంటాది మావా 

చరణం :

చెరువు గట్టు నీడలో 
చెట్టా -పట్టా యేసుకొని 
పొన్నచెట్టు దాపుకీ 
పరుగెడుతూ ఉంటే .....   :చెరు :
వల్లకాడు వయసూ 
ఒగ్గేసినాను 
సిగ్గేసి కళ్ళూ మూసేసినాను    :పున్నమీ

చరణం :

కన్ను మూసినానా  ..... 
కన్నుమూసినానా 
కన్నె దిగులు కాతా .... 
రేప ?మాప ?అంటాది 
ఎదురాడమంటాది              :కన్ను:
గుబులు తీర్చే రోజూ 
గుర్తు చేయ మంటాది 
కొంగు జారి పొంగు 
పోరుతూ .... ఉంటాదిరో .... మావ     :పున్నమి:

@
                               30.  పదారేళ్ళ పరుగులు
హీరో: 
పదారు ప్రాయం పిల్లా - గుండె గాయం గుంతల్లా
ప్రేమ పాశం చూపల్లా – యమ దాహం నిలువెల్లా
ప్రాయం, పిట పిట –గాయం చిట పట
పాశెం, కట కట – దాయం టక టక                             ;పదారు:
హీరోయిన్: 
రామా రామ అయ్యో ప్రేమ – ప్రేమా ప్రేమ అయ్యో రామ
రామ రామ ఇదే ప్రేమా? అయ్యో రామా ఇదే ప్రేమా?
రాజు కుంది రాను రాను – రాజు కుంది ప్రేమా ప్రేమ!
మోజుగుంది రామా రామా – మోజుగుంది ప్రేమా ప్రేమ
రాను రాను రాజుకుంది – రాజుకున్న కొద్దీ మోజుగుంది      :రామా:
హీరోయిన్: 
ఆగలేను అయ్యో రామ
వేగలేను కుయ్యో మొర్రో
వేగి వేగి ఉన్నాను
వేచి వేచి ఉన్నాను
రెమ్మ రెమ్మకు వెన్నలయ్యో
చెంప చెంపకూ సిగ్గులయ్యో
చుక్కలన్నీ చూస్తున్నాయి
వేడి మానై అల్లుకుపోరో!
వేగుచుక్కై నిలిచిపోరో!
హీరో:
జాము రాతిరి రామా రామా!
తాళ లేనే అయ్యో రామా!
జాము రాతిరి అయ్యో రామా!
తాళ లేను అయ్యో రామా!   
కోటి వాగులు చుట్టూ ముట్టి
కోడె నాగులు పగను పట్టి
కన్నె చూపు  కస్సుమన్నాదే!
సాని కిన్నెర కన్నెర్రజేసిందే!                                     :రామ:
హీరోయిన్:
మదనా! మన్మదనా! ఇదే అదనురా!
వేడిమానై అల్లుకుపోరా! 
వేగుచుక్కై నిలిచిపోరా!
వేగంగ రారో ఆగంగలేనురా!                                     :రామ: