@ 50. అతి స్నేహం (50-62)
మాయావి లోకంలో
ఎండమావి స్నేహమూ
మేలైనా, కీడైనా
మూలమే స్నేహమూ :మాయావి:
కాపాడినా స్నేహమే
కబళించినా స్నేహమే
అని విన్నాను
అంతటా నమ్మాను
అలుసై పొయ్యాను
కంటిలోని నలకలా
కనబడదేం స్నేహమూ?
నిన్నెలా వెలికి తియ్యను?
నిన్నెలా వెతకను? :మాయావి:
సృష్టి రహస్యం సహ జీవనమూ
స్నేహం అందులో పెను భాగమూ
సృష్టికే మూలం
సృజనకు ఆలవాలం :మాయావి:
శృతి మించిన స్నేహం
శృతి తప్పిన గీతం
మితి మీరిన స్నేహం
దేహానికి రోగం
తన్ను మాలిన స్నేహం
మొదటికే మోసం :మాయావి:
51. రాగం: అనురాగం
కినుకే ఒక రాగం కనక పుష్య రాగం
ఆ వెనుకే జడగంటల రాగ సరాగం
ఆ నడకే గజ గామిని వర గమకం
ఆ కులుకే సాని కిన్నెర కన్నె సోయగం :కినుకే:
నే కనుక నీ వెనక బడి
ప్రణయ గానాలు రాయుదునా?
సరాగ రాగాలు పాడుదునా?
సుస్వర రాగ మాలికలు పాడుదునా? :కినుకే:
ఆ కినుకే-ఆ నడకే- ఆ వెనకే నే కనకే
కన్నానులే కనులార కనుగొన్నానులే
నా అన్నుల మిన్న వలపు చిత్తరువులూ
వలచి ఒలిచి నిలిచిపోవే కన్నుసన్నలా :కినుకే:
దరి చేరక దాగుడు మూతలా?
ఒడి చేరక క్రీగంటి కవ్వింపులా?
లేని పోని కోపమా? భామా కలాపమా?
ఏదొక్కమాటు ఊది పోదువుగదే!
మది కన్నుల నా బృందావనిలో :కినుకే:
52. ఆహ్వానం
ఇళ్ళల్లోకి వెళుతున్నావండి
కొత్త ఇళ్ళల్లోకి వెళుతున్నావండి
మీరంతా తప్పక విచ్చేయ్యండి
మమ్మల్ని దీవించి దయ చూడండి :ఇళ్ళ:
చుట్టాలు, పక్కాలు చూడ ముచ్చటలెండి
ఇరుగు, పొరుగు వారెంతో వినయవండి
సహాధ్యాయుల సహకారముంది
పట్నంలో పలుకుబడికి లోటే లేదండి :ఇళ్ళ:
కలిమి కలిగిన వారము కావండి
చెలిమికి మేమంతా చిరునామా లెండి
లేమి మా వాకిలి లోనే లేదండి
కలిసి మెలిసి మసులుతూ
లేమిని మా దరికే రానీయమండి :ఇళ్ళ:
పాపాయిల నవ్వులే పచ్చతోరణాలండి
ముత్తైదువుల కదలికలే ముత్యాల ముగ్గులండి
మీరొచ్చిన వేళే ముహూర్తమండి
మీ మనోకామనలే మాకాశీస్సులండి :ఇళ్ళ:
కొత్త బట్టల కోలాహలం ఎందుకు లెండి?
మాయ మర్మం లేని మాటలాడు కుందావండి
అరమరికల్లేకుండా ఆరగించేద్దాం
సహపంక్తులండి సహభోజనాలండి :ఇళ్ళ:
53. నేను
నేనో ఎడారిని
ఆశీస్సులు కాదు:
ఒయాసిస్సులు కావాలి
నేనో చిన్ని దివ్వెని
భవంతులు కాదు;
ఓ చిన్న ఇల్లు కావాలి
నేనో కొవ్వొత్తిని
జేజేలు’ కాదు;
ఆరిపోకుండా చూడండి
నేనో స్ఫటికాన్ని
పారమార్దీకం కాదు
పారదర్శకత కావాలి
నేనో నదీమ తల్లిని
పూజలు కాదు;
కలుషితం చెయ్యకండి.
నేనో గిరిజనున్ని
నా తల్లిని పొట్టన పెట్టుకోకండి;
నాకు అక్షర భిక్ష పెట్టండి.
నేనో కొండల గుంపుని
నా గుండెలు వ్రక్కలు చెయ్యకండి;
చల్లని మేఘాల స్నేహం నిలపండి.
నేనో ప్రకృతి కాంతని
అందునా, అందమైన స్త్రీ మూర్తిని:
ప్రకృతిలో మిగిలిన
ఏకైక సౌందర్యరాశిని;
నాపై అత్యచారాలాపండి:
లేదో-
విశ్వం లో వికృత ప్రలయమై
జీవన వేదం నశించిపోతుంది
కాల చక్రం ఆగి పోతుంది
54. ప్రేమ జాలం
ప్రేమ యోగమా? మాయ రోగమా?
వయసు పరిణామమా? మనసుకే పరిమితమా?
ఎదిగీ ఎదగని మనసులు
చాలీ చాలని వయసులు
జీవితాలతో ఆటలు-నవ్వులాటలు
ప్రేమంటే ఇంతేనా?
జీవితమే ప్రేమ జాలమా?
పారు దేవదలెవరు?
లైలా మజ్నూలదేదేశము?
అనార్కలీ, సలీములదేకులము?
రోమియో-జూలియట్ కధ నిజమేనా?
ప్రేమ మోసం చేసిందా?
ప్రేమకు ద్రోహం చేసామా?
జగమే నాటక రంగమని
జీవితం ఏడు పాత్రలని
ప్రేమ ఒక్క పాత్ర మాత్రమేనని
జీవితమంతా ప్రేమ కాదని
తెలిసి మసులుకో
మనుగడ సుఖం చేసుకో
అప్పుడే- ప్రేమ యోగమౌనురా!
జీవిత సారమిదేనురా
వేదాలకు మించిన సారమిదేరా
55. బృందావన కృష్ణుడు
బృందావన కృష్ణుడు
గోపికా పరివేష్టుడు
వినీల మేఘశ్యాముడు
చిత చోరుడు
పరంధాముడు :బృందావన:
రాధనురా-
నీ ప్రేమ మానసనురా
రాగాభావనా వినోదనురా
విరహ యోగినిరా
నిన్ను చేర మది కోరితిరా
కరుణింపరా :బృందావన:
శరణాగతులను
వీడని వాడవనీ
అపవాదైనా-అప్రియమైనా,
ఆస్వాదించే నందనందనా
లీనము కానీరా
నీలో లీనము కానీరా :బృందావన:
రసిక రాజువని
నమ్మిన వారు గోపికలు
గోపిక కానురా- నే గోపిక కానురా
గోపకిశోరా!
ఓపిక ఉన్న ఓపిక గాధనురా
రాధనురా! నీ రాధనురా! :బృందావన:
56. మనిషిగా
మనసుకి మౌనం బాగుంటుందా?
ఊసులాడకున్న ఊరుకుంటుందా?
మాట మూగాదైతే చేటు లేదులే
మనసు మూగాదైతే జీవితం సున్నాలే!
మాటాడే మనసు ఊసులు
కష్టసుఖాలకు ప్రతిబింబాలు
మూగోళ్ళ సైగలే ఊసులు
ఎంత గొప్పదో ఈ మనసూ :మనసుకి:
పన్నీటి పలకరింపులైనా,
కన్నీటి వెల్లువలైనా,
యెద నవ్వుల పులకరింతలైనా,
ఆ ఒక్క మనసుకే చెల్లు;
అది లేదందుకే, నవ్వలేవు
జంతువులూ,
మనసు లేదందుకే
నవ్వలేవు జంతువులూ! :మనసుకి:
మనిషిలో ఉదయం ఉషస్సు
ఉషాస్సుకు మేలుకొలుపు పాడేదే మనస్సు
ఆ మనసిచ్చి,” వాడు” దేవుడయ్యాడు
మనసెంత గొప్పదో మూగాబోనీకురా! :మనసుకి:
మనసు మనసుతో స్పందిన్చనీ
మనిషి మనిషినీ బ్రతకనీ
సాటి మనిషి కష్టాలు పంచుకో
సమాజ హితవుకై శ్రమించరా! :మనసుకి:
మనసున్న ఓ మనిషీ!
మంచీ చెడులను గుర్తించు
“నే మనిషిని”, పశువును కాదని
నిరూపించరా నిష్కామివై! :మనసుకి:
57. పనియే పరమావధి
పల్లవి:
కృషితో నాస్తి దుర్భిక్షం
కృషితో నాస్తి దుర్భిక్షం
కృషితోనే కుశలం
కృతమే సుకృతం
ఆ కృషితోనే జీవనం :కృషితో:
చరణం:
పనివంటి వస్తువు లేదనీ
పనివంటి వస్తువు లేదనీ
ప్రజా కవులు చెప్పారు
పనితోనే మన్నికనీ
చెయ్యని మనిషో
పనికి మాలిన వాడనీ
నిర్వ్యాపారం నాతోనే
అంతం కావాలనీ
సంకల్పం చెప్పుకుందాం :కృషితో:
చరణం:
చేసే వాడికే “పని” దొరుకుతుందనీ,
చేసే వాడికే “పని” దొరుకుతుందనీ,
చెయ్యని వాడికి సాకు దొరుకుతుందనీ
నిలివెత్తు సందేశం
మన ఆత్మలే నిదర్శనం
వంద కోట్లు దాటిన దేశంలో
పని చేసే వాళ్ళే కరువైనారే!
ఇది ప్రభుత్వాల వైఫల్యమా?
తీరు తెన్నూ లేని ప్రజల నిర్వాకమా? :కృషితో:
చరణం:
ప్రజాతంత్ర మంటే ఎన్నికలు కావనీ
ప్రజాతంత్ర మంటే ఎన్నికలు కావనీ
మన్నికైన ప్రతినిధుల ప్రాతిపదికనీ
ఎన్నుకోండి! ఎన్నుకోండి!
ఎన్నికకో మన్నిక కల్పించండి
ఇది ప్రజా కోర్టు తీర్పనీ
వంటా వార్పూ కాదనీ
ఇవి హెచ్చరికల చురకలనీ
ఇకనైనా తెలుసుకోండి! :కృషితో:
చరణం:
అంతరించి పోయింది ఫ్యూడలిజం
అంతరించి పోయింది ఫ్యూడలిజం
అంతరించి పోయింది పెత్తందారీతనం
అంతరించి పోయింది కమ్యూనిజం
మిగిలింది మేలైన ప్రజాస్వామ్యం
ఇది అంతరించి పోకూడదనీ
మిగిలిందిదొక్కటేననీ
ప్రజా కంకణం కడతాం
దక్కించుకు తీరుతాం :కృషితో:
58. ఇరవై:ఇరవై
58. ఇరవై:ఇరవై
ఎచట నుంచో ప్రజా నాదం
ఎచట నుండో ప్రజా వాదం
ఎచ్చటి నుంచి ఈ ప్రజావాదం?
ఎచ్చటి నుండి ఈ ప్రజా నాదం?
వర్ణ భేదాలోద్దని ప్రజావాదం
వర్గ భేదాలోద్దని ప్రజానాడం
ఇది ప్రజా గుంపుల ఏక కంఠం
దశ దశాబ్దాల ప్రజల కంఠం
ఎల్లల్లేని భూగోళం నా దేశం
అరమరికల్లేని పాలనా శాశనం
అరకొర చట్టాలొద్దు
అర్దాయుషు రాయితీలొద్దు
మది నిండా జగమంతా కుటుంబం
సరిహద్దులు-సైనిక ముట్టడులు
మిత్ర రాజ్యాలు-మిత్రకూతములు
ఒప్పందాలు-ఒడంబడికలు
తిరిగి రాయొద్దు నిన్నటి చరిత్రలు
శాంతి, భద్రతలు రెండే రెండు
ప్రజల్లేక సంఘం లేదు
భద్రత లేక ప్రజల్లేరు
శాంతి లేక వికాసం లేదు
వికాసం లేక దేశమే లేదు
ఎంత కాలమీ మల్ల గుల్లాలు
కొట్లాడు కుంటూ కొల్లగొట్టు కుంటూ
అభివృద్ధి చెందుతూనే ఉండడం
భారత వాక్యం పలుకు దాం
భారత్ ని బాగు చేద్దాం
మరువకండి మనం నూరు కోట్ల ప్రజలం
ప్రతి మనిషీ పని చేసుకుందాం
విజ్ఞానం, వనరులు అన్నీ ఉన్నాయ్
మన విజ్ఞానం పెంచుకుందాం
సుజలాం – సుకలాం
సుఫలాం – సుకలాం
సువికసితాం – సువిశాల భారతాం
59. బ్రతుకు తెరువు వేదం
నవ్వు లాట కాదయ్యా
ఇది జీవితమయ్యా బ్రహ్మయ్యా
నుదుట ఇన్ని గీతలు గీసీ
బ్రతుకు తెరవు గీత మరిచేవయ్యా :నవ్వు:
ఓ అమ్మ కడుపున పడేసి
ఈ భూమ్మీద పడేసి
వందేళ్ళూ బతకమని
ఇరికిన్చేవయ్యా
ఇరికించుట నీ వంతైతే
బయట పాడుట నా వంతా?
ఎవరి వంతా పాడ కుంటే
ఈ బ్రతుకంతా ఇంతేనా? :నవ్వు:
మనిషి జన్మ నా కిచ్చి సాధించేననుకున్నావ్
ఇలాగే బతుకుతాననుకున్నావ్
ఎలాగైనా బతకొచ్చని తెలుసుకున్నాను
ఇంట కన్న యుగ ధర్మం ఇల లోనే లేదంటా :నవ్వు:
నాకు కాని నీ రాతలు నువ్వేచెరిపేసుకో
లేదంటే నువ్విచ్చిన జన్మే తీసేసుకో
నా తల రాతలు నేనే రాసు కుంటా
ఇహాన ఇంట కన్న తెరువే లేదంటా
ఇంట కన్న బ్రతుకు తరువు లేనే లేదంటా :నవ్వు:
#
#
60.
జగమేమాయ
సాకీ:
చదువే.... మయా...జాబులే....మయా..
చదువే.... మయా...జాబులే....మయా..
డిగ్రీలలో సారమింతేనయా.... ఈ వింతేనయా....
పల్లవి:
చదువే మాయా – జాబులే మాయా
చదువే మాయా – జాబులే మాయా
డిగ్రీలలో సారమింతేనయా
ఈ వింతేనయా
:చదువే:
చరణం:
చదువూ, లోనులూ, తీర్చే కష్టాలూ
చదువూ, లోనులూ, తీర్చే కష్టాలూ
చదువూ, లోనులూ తీర్చే కష్టాలూ
క్లాసుల్లో నోట్సులనీ
భయమేలోయీ
పట్టా కగితమోయ్ – చదువులు పెడదారోయ్
కనుగొంటే సత్యమింతెనోయీ
ఈ వింతేనోయీ
:చదువే:
చరణం:
జాబూ, మొహములా, దరిరానీకోయీ
జాబూ, మొహములా, దరిరానీకోయీ
పెద్దలకే ఈ దుఖం అంకితమోయీ
పెద్దలకే ఈ దుఖం అంకితమోయీ
ఉద్యోగాల్లేవనే భావన రానీకోయ్
ఆఎరుకే వింత వేదాంతమోయ్
పల్లవి:
పదవుల్లేని చదువులేలనో?
పదవుల్లేని చదువులేలనో?
చదువుల్లేని పౌరులేలనో?
ఏమాయనేమో ఈతరమూ
ఏమాయనేమో
ఈ దేశమూ :పదవు:
చరణం:
దేశము కన్నా, అప్పు మిన్నగా-
దేశము కన్నా, అప్పు మిన్నగా-
భక్తులకన్నా, ద్రోహులెక్కువై;
ఓ....హో...హో...ఓ.....ఓ.....
నీ దేశమూ, ఈశకమూ
మెల్ల మెల్లగా –
మెట్టు మెట్టుగా..
జారెనే....... :పదవు:
చరణం:
జాబుల్లేని యువకులేలనో?
జాబుల్లేని యువకులేలనో?
యువకుల్లేని దేశామేలనో?
ఓ.....హో.....హో....ఓ....ఓ...
ఎమాయనేమో ఈతరము
“ఆమ్యామ్య” దేవా ఈదేశామూ పదవు:
చరణం:
మొన్నటి కన్నా, నిన్న మోసమూ,
మొన్నటి కన్నా, నిన్న మోసమూ,
నిన్నటి కన్నా, నేడు శూన్యమూ
ఓ....హో....హో...ఓ..ఓ...
నీ
తరమూ, నీ దేశమూ
జోరు,జోరుగా,
దిగాజారె తీరు..... :పదవు:
62. హాసం-లాస్యం-గీతం-సంగీతం
62. హాసం-లాస్యం-గీతం-సంగీతం
పల్లవి:
హాసములోనే హాయి ఎలనో?
హాసములోనే హాయి ఎలనో?
హాయిమి లోనే హాస్యమేలనో?
ఏమాయే ఏమో ఓ రాజా!
ఏ
మాయే ఏమో ఓ రాజా! :హాస:
చరణం:
గీతము లోన సంగీతమేలనో?
గీతము లోన సంగీతమేలనో?
సంగీతములోన స్వరములేలనో?
ఏమ్మాయ ఏమో ఓ రాజా!
ఏమ్మాయో ఏమో ఓ రాజా!
చరణం:
మొన్నటి కన్నా, నిన్న మిన్నగా-
మొన్నటి కన్నా, నిన్న మిన్నగా-
నిన్నటి కన్నా, నేడు నిండుగా,
ఓ...హో...హో..ఓ..ఓ... :మొన్నటి:
నీ హాసమూ-ఈ లాస్యమూ
హాస్య గీతమై విరిసెలే! :హాస:
చరణం:
గీతము కన్నా, బాణి మిన్నగా,
గీతము కన్నా, బాణి మిన్నగా,
స్వరముల కన్నా, పదము మిన్నగా
ఓ...హో...హో...ఓ...ఓ...
:గీ:
నీ హాసమూ, సంగీతమూ
హాసమై
విరిసెలే! :హాస:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి