@ 40. రుద్రమ, చాళుక్య వీరభద్ర యుగళగీతం (40-49)
పల్లవి(వీరభద్ర చాళుక్య):
ఓరుగంటి సామ్రాజ్ఞీ! కాకతీయ రాజ్ఞీ!
ఓరుగంటి సామ్రాజ్ఞీ! కాకతీయ రాజ్ఞీ!
ఆజ్ఞాపనలేగాని విజ్ఞాపనలు లేని
సార్వభౌమధీనిధీ! కాకతీయ ధీరణీ!
క్షాత్రవులకు ప్రళయమూ చాళుక్య భద్రునకదే ప్రణయమూ : ఓరుగంటి :
పల్లవి(రుద్రమ):
నిరవద్యపుర రేడా! గెలవ జాలగలడా?
నిరవద్యపుర రేడా! గెలవ జాలగలడా?
ఆ సుమశరుడూ! నిలువజాలగలడా?
ఆ కుసుమ బాణ శరుడూ?
చిత్తగించి చిత్తుగ జేసిన చితచోరుడా! చిత్తచోరుడా!
వీరుడా! చాళుక్య భద్రుడా!
చరణం(రుద్రమ):
సాటి లేని మేటి ఓరుగంటి మహరాణిని చేపట్టిన
సాటి లేని మేటి ఓరుగంటి మహరాణిని చేపట్టిన
ఆ చెరకు వింటి వేల్పు కన్న ఘనుడా!
నిరవద్యపుర రేడా! భళా! చాళుక్య భద్రుడా!
చరణం(వీరభద్రుడు):
ఓరుగంటి సామ్రాజ్ఞీ! కాకతీయ రాజ్ఞీ!
ఓరుగంటి సామ్రాజ్ఞీ! కాకతీయ రాజ్ఞీ!
కర కంకణాల మెరుపు కన్న
భీకర కరవాల తళుకులే మిన్న
ఎవ్వనికీ దక్కనివీ నాకొక్కనికే చెల్లినవి
నీ కరకంకణాల మెరుపులు
నీ కరవాల మెరుపుటురుములు
శాత్రవులకు శత సహస్ర శతఘ్నుల
రణ మారణ ఘోషలు
రానా? నే రానా?
నన్నోడి నిన్ను గెల్చుకున్న చాలునంటి
ఓరుగంటి మచ్చెకంటి అచ్చ తెనుగింటి రాజ్ఞీ!
41. ఒక హిందీ గానం
పల్లవి:
హే హసీనా! హసీ మజాక్ కర్ లేంగే
హే హసీనా! హసీ మజాక్ కర్ లేంగే
హే తుహీనా! హద్ సారే మిటాఎంగే
తుసీ మేరీ జింద్ గానీ మై తేరా మీఠా జానీ
పంజాబీ లో ప్రేమించుకుందాం
పబ్బుల్లో తేలి పోదాం హసీ తుసీ ఉడ్ జాయేంగే
జమానా యే క్యా కర్ లేంగే?
హద్ సారే మిటాఎంగే- హసీ మజాక్ కర్ లేంగే
తుమ్మేరీ జింద్ గానీ
మై తేరా మీఠా జానీ
చరణం:
తన్ తేరీ భారత్ దేశం మన్ మేరీ ప్రజాస్వామ్యం
తన్ తేరీ భారత్ దేశం మన్ మేరీ ప్రజాస్వామ్యం
మన్ మర్జీ కర్ లేంగే
మై మర్జీ కా మాలిక్ హూ
తోడీ న తుం కం హో రానీ
హై తూభీ మర్జీ కా మాలికినీ :హసీ-తుసీ:
చరణం:
బినా తేరీ సంగ్ దిన్ నహీ చల్తా
బినా తేరీ సంగ్ దిన్ నహీ చల్తా
రోజంతా పిచ్చెక్కి రోగంతో బాధ పడ్తా
హోటోన్కీ దవా దే ప్యారీ
ఈ రోగమొస్తే ప్రతీ సారీ
దిన్ నహీ ధల్తా -బ్రెయిన్ నహీ చల్తా
హోటోన్కీ దవా దే ప్యారీ
పంజాబీ లో ప్రేమించుకుందాం
పబ్లిగ్గా తేలి పోదాం
హసీ తుసీ ఉడ్ జాయేంగే
జమానా యే క్యా కర్లేన్గే?
చరణం(హీరోయిన్):
బినా కాం కీ చల్తా నహీ డెమోక్రసీ
బినా కాం కీ చల్తా నహీ డెమోక్రసీ
న హమ్ చల్పాఎంగే అఉర్ ఖర్చా పానీ
పూజా మే కాం మత్ దేఖో
బల్కీ కామ్మే పూజా దేఖో
బైఠె బైఠె న సర్కార్ చలేగా
హమ్రీ ఇష్క్ చలేగా
ఇద్దరూ:
అబ్భీ హమ్ కసం ఖాతే
అబ్భీ హమ్ కసం ఖాతే
రోజానా కామ్మే జాతే
కామ్మే ప్రజాతంత్ర్ హై
కాం కే బాద్ హీ ఇష్క్ మిథాస్ హై
హమ్ ప్రియ భారత్ వాసీ హై
తన్ హమ్రీ ( మహా) భారత్ హై
మన్ హమ్రీ ప్రజాతంత్ర్ హై
మన్ మర్జీ కర్నా జుల్మ్ హై
హమ్ కానూన్ కే తెహెత హై
కామ్మే హీ ప్రజాతంత్ర్ హై
అబ్భీ హమ్ కసం ఖాతే
రోజానా కామ్మే జాతే
ఇష్క్ జిందగీ కా ఎక్ హిస్సా హై
జమానా కో సమ్జ్హాఎంగే
42. ఆన్ లైన్ ప్రేమలు(మోహాలు)
పల్లవి:
చూడవే చిలకా
చూడవే చిలకా
దేనికా అలకా?
నాపై ప్రేమ లేకా?
అస్సల్నేనంటే నచ్చకా?
ఇంత దూరమొచ్చాక,
వదలనే చిలకా
ప్రేమ మొలకా
ఊరించి మెలికా?
చరణం:
ఆ గురిపెట్టే చూపులు
ఆ గురిపెట్టే చూపులు
కంప్యూటర్ కర్సరే
నీ నడుము వంపులు
ఆన్స్క్రీన్ సేవరే
కస్సుమంది కర్సరే
కమానంటే ఎంటరే
నీ సాఫ్టువేరూ
ఫ్రెండ్లీ యూజరూ
బగ్గూ సిగ్గూ లేని
నే డైలీ యుజరూ
చరణం:
ఫేసు బుక్కు లవ్వర్లం
ఫేసు బుక్కు లవ్వర్లం
చూడరులే ఎవ్వరూ
నువ్ నాలో ఉంటే
నే నీలో ఉంటే
ఆన్ లైన్లో ఇద్దరముంటాం
లేనే లేదు యే తంటా
కనబడం ఎవ్వరి కంటా
నో ట్రబుల్ షూటరు
ఇందుకే కంప్యూటరు
చరణం (హీరోయిన్):
హేకిన్గెవరైనా చేస్తారేమో!
హేకిన్గెవరైనా చేస్తారేమో!
మన గుట్టు రట్టు
తట్టు కోలేను నీ యెడ బాటు
అమ్మ అన్నలిద్దరూ
కంట్రోలు పెడతారు
హీరో:
అందుకే పాస్ వర్డు
అందుకే పాస్ వర్డు
బయోమెట్రిక్ వెసులుబాటు
శతకోటి సిస్టములు
అనంత కోటి సెక్యూరిటీలు
తుంటరి స్పార్కుంటే
ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్
హీరోయిన్:
ఇప్పుడే ఎంటరయ్యాం ఇంజినీరింగులో
ఇప్పుడే ఎంటరయ్యాం ఇంజినీరింగులో
అప్పుడే ఎందుకయ్యో లవ్వురింగులు
తప్పు మీద తప్పులు
తప్పవు కవరింగులూ
నాలుగేళ్ళు కష్టపడదాం
నలభై ఏళ్ళు సుఖపడదాం
ప్రేమంటే పరుగు కాదు
నూరేళ్ళ పంట సాగు
హీరో:
అల్లాగైతే నాలుగేళ్ల దాకా
అల్లాగైతే నాలుగేళ్ల దాకా
కల్లోకైన రాకే; నా పేరైనా తలవకే
టెలిపతి గిలిపతి జాన్తానై
చదువయ్యాకె చట్పటాలు మోగిద్దామే
@ 43. సుప్రజారాముడు
@ 43. సుప్రజారాముడు
పల్లవి:
రాముడే ఎత్తైన దేవుడు
రాముడే ఎత్తైన దేవుడు
అందరిలో గణ నీయుడు
పల్లె పల్లెలో రామాలయమూ
అందరికీ ఆదర్శమూ :రాముడే:
చరణం:
గురువుకి ఆదర్శ శిష్యుడిగా
గురువుకి ఆదర్శ శిష్యుడిగా
రాక్షస సంహారము చేసిన ఘనుడు
అనుజులకు అనువైన అన్నతడు
తండ్రి మాట జవ దాటని తనయుడు
ఆ రాముడే మహనీయుడు
మనుషులలో దేవుడు :రాముడే:
చరణం:
కడలికే వారధి కట్టి
కడలికే వారధి కట్టి
పత్నిని చెర బట్టిన
రావణుని మట్టు బెట్టిన
సూర్యవంశ సుసైనికుడు
రఘురాముడు-కోదండ రాముడు :రాముడే:
చరణం:
ప్రజకో నీతి తనకో నీతి తగదని
ప్రజకో నీతి తనకో నీతి తగదని
ధర్మ పత్నికే పరీక్ష బెట్టిన
ధరణీ వల్లభుడు
రామ రాజ్యమే ప్రజారాజ్యముగా
పాలించిన సుప్రజారాముడు
ధరణీ నాధుడు –జానకీ వల్లభుడు :రాముడే:
44. నేటి పరిణయ పరిణామ ప్రమాణాలు
హీరో:
పరిణతీ! ఓ పరిణతీ!
పరిణతీ! ఓ పరిణతీ!
మనం పెళ్ళాడు కుందామే
హీరోయిన్:
ఎవరైనా చూస్తే?
ఎవరైనా చూస్తే?
అమ్మా, నాన్నలకి తెలిస్తే?
హీరో:
బొమ్మల పెళ్లందాంలే
బొమ్మల పెళ్లందాంలే
సరదా, సందడి అన్దాంలే
కూడా ఉన్న ఫ్రెండ్సంతా
పాడేస్తారు వంతా
హీరోయిన్:
అంతేనా? ఇంతేనా?
అంతేనా? ఇంతేనా?
పెళ్లై పోతుందా?
హీరో:
గుట్టే చప్పుడుగా
గుట్టే చప్పుడుగా
గుడికన్నా పదిలంగా
మన పెళ్లై పోతుందే!
ఇదేమీ కొత్త కాదులే
శశి రేఖా, అభిమాన్యుల పెళ్లి కూడ ఇంతేలే!
పరిణతీ! ఓ పరిణతీ!
పెల్లాడుకున్దాములే
మనం పెళ్ళాడు కుందామే
హీరోయిన్:
పరిచితుడా! ఓ పరిచితుడా!
పరిచితుడా! ఓ పరిచితుడా!
పెళ్ళాడు కుందామురా
వరుడా! ఓ వరుడా!
వర్రీ నాట్, ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మారేజీ ఫటా ఫట్
ఇంకెందుకు లేట్, టు టై ద నాట్?
బట్ పేరెంట్స్ ఫైట్ ఏమో?
హీరో:
వై పేరెంట్స్ ఫైట్?
వై పేరెంట్స్ ఫైట్?
హీరోయిన్:
లెట్ దెం ఫైట్ ఐ సే!
లెట్ దెం ఫైట్ ఐ సే!
హీరో:
లెట్స్ హోల్డ్ ద నాట్టైటై సే
లెట్స్ హోల్డ్ ద నాట్టైటై సే
24ఇంటు7 డే ఇన్ అండ్ డే అవుట్
వై టు వర్రీ డార్లింగ్?
తాళి కాస్తా కట్టేశాగా!
హీరోయిన్:
లెట్ దెం హాంగ్ విత్ ద రోప్ అండ్ ఫాల్ ఇంద బే అఫ్ బెంగాల్!
లెట్ దెం హాంగ్ విత్ ద రోప్ అండ్ ఫాల్ ఇంద బే అఫ్ బెంగాల్!
హీరో:
డేటింగుల కన్న ఇదే మంచిది
డేటింగుల కన్న ఇదే మంచిది
ఓ పనంటూ ఐపోతుంది
హీరోయిన్:
నువ్వు చెప్పేది 100% కరెక్ట్
నువ్వు చెప్పేది 100% కరెక్ట్
నాకో చిన్న డౌట్
మనిద్దరం ఉద్యోగస్తులం
ఉంటుందా అటు ఇటు సపోర్టు?
పెళ్ళంటూ అయ్యాక
ఇద్దరం ఒకటయ్యాక
పిల్లలు పుడతారు
అమ్మా, నాన్నలు గుర్తుకొస్తారు పెళ్లి గెష్టు
ఫ్రెండ్సంతా అటు-ఇటు చెల్లా చెదుర్
హీరో:
అవ్వా బువ్వా రెండూ కావాలంటే ఎట్టా?
అవ్వా బువ్వా రెండూ కావాలంటే ఎట్టా?
అటు ఉద్యోగం ఇటు ఊంజల్ సాగవే సాగవు
ఒకటి కోసం ఇంకోటి వదులు కోవాలి
తీరా పెళ్ళయ్యాక కిరికిరులెందుకే?
రెండేళ్లాగుదాం ఎంజాయ్ చేద్దాం
ఓన్లీ ఎంజోయ్మెంట్
అందాకా ఫుల్ స్టాప్ ప్రగ్నంట్
ఓకేనా? ఓకేనా?
హీరోయిన్:
ఓకేరా! ఓకేరా!
ఓకేరా! ఓకేరా!
ఇదేదో బాగుంది సర్దుబాటు
ఈ లోగా దిగి వస్తారు
మన అమ్మనాన్నలో మెట్టు
రాక పోకలు సాగు సాగు
సంసారం బాగు బాగు
చూస్తూ చూస్తూ ఊరుకుంటారా
బేబీని చూడక చస్తారా?
హీరో:
అయితే దీనికే ఫిక్స్ ఐయ్ పోదాం
అయితే దీనికే ఫిక్స్ ఐయ్ పోదాం
పెట్టేద్దాం కొకపేట్లో కాపురం సాకుల్లేని వీకెండ్లు
లవర్సు స్టాపులు ఇనోర్బిట్ షాపింగులు
మర్చి పోనీ హ్యాపీ డేస్
హ్యాపీ డేస్- హ్యాపీ డేస్
45. నేటి జీవన వేదం
పల్లవి:
జాలి లేదు కన్నీళ్ళకి పేదనీ గొప్పనీ
జాలి లేదు కన్నీళ్ళకి పేదనీ గొప్పనీ
దయ లేదు కష్టాలకి కులమూ మతమనీ
చిత్రమేమిటో గానీ, చితి లోనూ
కాలనిదీ కులమొక్కటేనేమో! :జాలి:
చరణం:
కులాలు-మతాలూ, కులమత భేదాలు
కులాలు-మతాలూ, కులమత భేదాలు
సృష్టిలోన లేవు-సృజియింప బడ లేదు
మానవుడే సృష్టించి
మట్టిపాలు చేసాడు :జాలి:
చరణం:
అందమైన ప్రకృతి జేసి
అందమైన ప్రకృతి జేసి
చక్కంగ బతకమని
సర్వేషుడంటేనూ
నడుమేమొ నరుడొచ్చి
నరికేసి, చెరిపేసి
నరకంగ మార్చేడు :జాలి:
చరణం:
మనసున్న వాడు దేవుడు
మనసున్న వాడు దేవుడు
నరకాన్ని చెయ్ లేదు
స్వర్గ మొక్కటే చేసి
సుఖియించమన్నాడు
స్వార్ధ బుద్ధితో నరులూ
నరకంగ మార్చేసి
నట్టేట ముంచేరు :జాలి:
చరణం:
స్వార్ధ చింతన వీడి
స్వార్ధ చింతన వీడి
నరకాన్ని చెరపండి
నిస్వార్ధ బుద్ధి మరిగి
జీవించనీయండి
ఇంత కన్న వేదం
ఏ లోకాన లేదండి :జాలి:
46. పెళ్ళంటే లైట్ తీస్కో
పల్లవి:
అప్పుడే, నీకప్పుడే పెళ్ళేవిటే?
అప్పుడే, నీకప్పుడే పెళ్ళేవిటే?
నీకప్పుడే పెళ్ళేవిటే?
ట్వంటీ తౌజండు ట్వీటులు ఉన్నాయా?
ఫిఫ్టీ తౌజండు లైకులు ఉన్నాయా?
తీరా పెళ్ళయ్యాక, పెళ్ళాం కన్నా
ఎక్కువేం కావులే-
అందుకే, అప్పుడే, ణీకప్పుడే పెళ్ళేవిటే? :అప్పుడే:
చరణం:
ఇప్పుడే చేరావు సాఫ్టువేరు జాబులో
ఇప్పుడే చేరావు సాఫ్టువేరు జాబులో
ఇప్పుడిప్పుడే ఇండిపెండెంటువయ్యావు
పోకెట్ మనీలు పోయి
పేకేజిల్లో పడ్డావు
ఫ్రీడమ్ వదులుకుని
సంబడానికా పెళ్లి?
అప్పుడే, నీకప్పుడే పెళ్లేవిటే?
బడాయి పెరిగేనా?
బతుకుతెరువు పెరిగేనా?
నీకప్పుడే పెళ్ళేవిటే?
చరణం:
అమ్మోరికి కట్టినట్టు పట్టు చీర కడతారు
అమ్మోరికి కట్టినట్టు పట్టు చీర కడతారు
బుగ్గన చుక్కెట్టి బూచమ్మను చేస్తారు
మెహందీలు పులిమేసి మెచ్చుకోలు చేస్తారు
కల్యాణం బొట్టెట్టి గైరమ్మను చేస్తారు
లేని పోని సిగ్గు తెచ్చి పెళ్లి రూపు తెస్తారు
ఎందుకే? నీకిప్పుడే పెళ్ళేవిటే?
ఆట విడుపు వదులుకుని
ఆరళ్ళు తెచ్చుకోకె
అర్ధరాత్రి స్వాతంత్ర్యం ఆడదాని బతుకంటే
పల్లెటూళ్ళు ముందు ముందు పారిస్సులవుతాయే
అప్పుడే నీకప్పుడే పెళ్ళేవిటే?
చరణం:
మిల్లెన్నియం కొత్తదాయే
మిల్లెన్నియం కొత్తదాయే
పెళ్లి తంతు మారదాయే
గ్లోబలైజేషన్తో దూరాలు దగ్గిరాయే
“దునియా ముట్టీ మే” దూసుకు పోవాలె
కుందేలు సామెత అది నిన్నటి మాట
అమ్మాయిల హవా తోనే
ఈ మిల్లెన్నియం సాగుతోందే
కలర్ఫుల్ లక్కర్సుం
ఇంటల్లెక్చ్యువల్ బీయిన్గ్సుం
దూకుడైన దున్నుడైన
ఈ తరం మనదేనే
మనం లేక మన్న లేదు
మానవ లోకం
మన తోనే నిర్మాణం నేటి తరం
మహిళా లోకం తోనే
మన్నికైన వికాసం
అప్పుడే నీకప్పుడే పెళ్ళేవిటే?
రెండేళ్లో, మూడేళ్లో
పోస్టు పోను చేస్కో
పెళ్ళంటే లైట్ తీస్కో
47. పౌరుడు
పల్లవి:
మంచి మాట ఆడరా
మంచి మాట ఆడరా
మంచి పాట పాడరా
మానవాళి మెచ్చుకునే
మంచి పనిని చెయ్యరా : మంఛి :
చరణం:
యోగ్యమైన పౌరుడై
యోగ్యమైన పౌరుడై
జాతి మనుగడ చెట్టుకి
నీళ్ళు పోసి పెంచరా
దేశ ఖ్యాతి పెంచరా :మంచి:
చరణం:
నలుగురితో కలిసిపో
నలుగురితో కలిసిపో
నలుగురిని కలుపుకో
ఒంటరి పోరాటం
తీరమే లేని ఆరాటం :మంచి:
చరణం:
నేత కాలేదని బాధపడకురా
నేత కాలేదని బాధపడకురా
ఒక్క నేత వెన్కక నిలిచి చూడరా
ఐదు వేళ్ళు ప్రజలైతే
పిడికిలే తిరుగు లేని నేతరా :మంచి:
చరణం:
మెదడు ఒక్కటే
మెదడు ఒక్కటే
అవయవాలు రెండేసి
దేవుణ్ణి నమ్మక పోయినా
సృష్టి నైన నమ్మరా :మంచి:
48. స్వార్ధమే ఉపద్రవం
పల్లవి:
పక్షం రోజులు పరితపించి చంద్రుడు
పక్షం రోజులు పరితపించి చంద్రుడు
సముపార్జించిన ప్రకాశ పుంజములు
ప్రసరించడే ప్రాణికోటికి చంద్రికలు?
దాపరికంపు దౌర్భాగ్యమేల అబ్బెనో
మనుజ సంతతికి ఉపద్రవంబు గాక?
పల్లవి:
మల బారులు దాటి ప్రయాసంబుతో
మల బారులు దాటి ప్రయాసంబుతో
పవన తేరులు పయనంబు గావించి
బాల మరీచి వీచికలు తాపమడంప
తప్త హ్రిదయాల్ని తాకవే?
దాచుకొను బుద్ధి ఏల అబ్బెనో?
మానవాళికి స్వార్ధ ప్రవృత్తి గాక?
నిరతంబు ఘోషించు రత్నగర్భుడు
తానలయక ఒడ్డున జేర్చును అల్ప ప్రాణులన్
అగాధమున మనజాలని ప్రాణి సంతతులన్
జగత్తును మత్తు వీడమని బోధ జేయ్యడే సముద్రుండు?
నేర్వ లేని గుణమ్బేల దాపురించెనో
ఉపద్రవంబు గాక!
ప్రక్రుతి పాథముల్ నేర్వరే!
మనుజులన్ధకార బంధీకృతులై మంద బుద్ధులై!
49. పరోపకారం
ఎందుకు పుట్టాను వెలివేసిన కులంలో?
డబ్బుకే విలవిచ్చే ఈ వింత లోకంలో!
పుట్టించిన దేవుడిదా తప్పు?
డబ్బులు దాచుకోని నాదా తప్పు?
అంతా మంచేనని,
అందరూ మనవాళ్ళేనని
అందరూ మంచి వాళ్ళేనని
ఉపకారానికి ఉపకారమని,
సహాయ్యానికి సహాయమని,
దూసుకుపోయాను
మనవాళ్ళని, మంచివాళ్ళని,
తోడుగా ఉంటారని,
తోడుగా వస్తారని,
దూసుకుంటూ పోయాను
గోతిలోన పడ్డాను
దూసుకుంటూ పొయ్యాను
ముళ్ళు గుచ్చుకునేదాకా
చుట్టూసుకున్నాను
నిర్జనం-నిర్జనం
తర్జన భర్జనతో
తల్లడిల్లి పోయాను
ఆ దేవుడే ఉన్నాడని
సరిపెట్టుకున్నాను
కదలని దేవుడు రాడనీ
కదిలే మనిషీ రాడనీ
తెలిసే సరికి తెల్లవారి పోయింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి