@ 63. తొలి ప్రేమ (63-67)
పల్లవి:
తోక మల్లె చెట్టు మీనా తొలి ప్రేమ రాసుకుందాం
తోక మల్లె చెట్టు మీనా తొలి ప్రేమ రాసుకుందాం
పొన్న చెట్టు నీడ లోన
పొంగులే కాచుకుందాం
వయసు పొంగులే
కాచుకుందాం :తోక:
చరణం:
రాతిరి కలలో ఒక రాణి ఒంటిగ
రాతిరి కలలో ఒక రాణి ఒంటిగ
నన్ను కలిసి కన్ను
గీతి :రాతిరి:
గుత్తగా హత్తు
కుందీ.......
అబ్బ గుత్తంగ హత్తుకుందీ
ఆ రాణి నువ్వేలే..
నా అలివేణి నువ్వేలే...... :తోక:
చరణం:
అద్దమంటి ఆకసాన
అద్దమంటి ఆకసాన
అందాల చందురుడూ...
అద్ద మంటి ఆకసాన
అందాల చందురుడూ
యెద పొంగులే రేపుతుంటే
రేప, మాప అంటుంది
అబ్బ గుట్టు రట్టు
చేస్తుంది
గుడి మీద బొమ్మలే
గురుతు చేస్తుంది
వల్లకాడు వయసూ....
ఒల్ల నొల్ల నోరి మావ (వల్ల)
అల్లరీ కాక ముందే
అయిరేణి ముందు
తాళి కట్ట రావ మావ :తోక:
64.సవరల
సరాలు
పల్లవి:
ఒలె ఒలె ఒలె ఒలె వల్లే అనవే
ఒలె ఒలె ఒలె ఒలె వల్లే అనవే
ఒక ఒక ఒక ఒక ముద్దిచ్చి పోవే :ఒలె:
తగల మాకే
అడ్డు తగల మాకె
ఈ అడివి కె నేనంటే హడల్
హడల్
:ఒలె:
హీరోయిన్:
ఒరే ఒరే ఒరే ఒరే వద్దురో...
ఒరే ఒరే ఒరే ఒరే వద్దురో...
హద్దు మీరి
పోవద్దురో :ఒరే:
ముద్దుకి
మనవాడ అడ్డురో
అడ్డు
తగిలావంటే.....
ఈ అడివి
తల్లి మీద ఒట్టురో :ఒరే:
చరణం(హీరో):
కండ బలంతో నే బండలనే పిండి చేస్తా
కండ బలంతో నే బండలనే పిండి చేస్తా
గుండె
బలంతో నే గుదేన్ని రాపాడిస్తా
:కండ:
ఈ అడివి రాముడాన లేక ఆకైన ఆడదే
ఈ అడివి
లోన
ఈ పూట నా
మాట
ఈ అడివికే చెల్లు బాట
ఈ అడివికే చెల్లు బాట
హీరోయిన్:
కండ బలమున్న గూడెం రాజు కూనను
కండ బలమున్న గూడెం రాజు కూనను
గుండె బలమున్న కొండ జాతి కన్నెను :కండ:
నే కదం
తొక్కితే కొండ ఊగులాడును
నే పదం
పాడితే కోన ఊసులాడును
హీరో:
కోలనేసి కూల వేస్తా కాలు దువ్వినోళ్ళని
కోలనేసి కూల వేస్తా కాలు దువ్వినోళ్ళని
చూపు వల ఏసి
చేత బడత పారు పిట్టని
హీరోయిన్:
అంత మోజున్న మొగనాలి వైతే,
అంత మోజున్న మొగనాలి వైతే,
ఒక్క
రోజన్నా ఆగ లేక పొతే
పొదరింట
పులి ఆట ఆడుకో
ఆపైన
ఓలిచ్చి ఆలి చేసుకో :పొద:
ఒరే ఒరే ఒరే
ఒరే వద్దురో.......
హద్దు మీరి
పోవద్దురో
ముద్దుకి మనువాడ అడ్డురో
అడ్డు
తగిలావంటేముద్దుకి మనువాడ అడ్డురో
ఈ అడివి
తల్లి మీద ఒట్టురో
ఒలె ఒలె ఓలె
ఒలె వలల్లె యనవే .....
ఒరే ఒరే ఒరే
ఒరే వద్దురో..........
ఒక ఒక ఒక ఒక
ముద్దిచ్చి పోవే
తగాల మాకె
అడ్డు తగలమాకే
ఈ అడివికే
నేనంటే హడల్ హడల్
@
@
65. జన్మ
రహస్యం
కళ్ళు
తెరిస్తే లోకం
కళ్ళు మూస్తే మైకం
కళ్ళు మూస్తే మైకం
తర తరాల
మనిషి జీవనం
తప్పుల పయనం
ఇంట సతీ
సుతులు
బయట మిత్రులు
ఇది రక్త
సంబంధం
అది సామాజిక
నైజం
బాల్యం చాపల్యం
కౌమారం చాంచల్యం
నడుమ
సంసార మధనం
వృద్ధాప్యం చాదస్తం
కళ్ళు తెరవనిదే
జననం కాదు
కళ్ళు
మూయనిదే మరణం కాదు
కళ్ళు
తెరిస్తే చప్పట్లు
కళ్ళు మూస్తే
శోకాలు
జన్మ
సార్థకతకి కొలబద్దల్లేవ్
జన్మ రాహిత్యానికి జమాపద్దులా?
జన్మ రహస్యం-జన్మ రాహిత్యం
అంతు తెలియని పాథాలోయ్!
జన్మ రహస్యం ఓ జడ పదార్ధం
జన్మ
రాహిత్యం అంతర్లీనం
మనుజులారా
మేల్కొండి!
మనుషుల్లా
జీవించండి!
66.
నా మరణ శాశనం
నేడే నా
మరణ దినం
నేడే ఆ
పర్వ దినం
నేడే నా
దినం దినం
నేడే
నా దినవారం
స్నేహితులారా
రారండోయ్!
స్నేహితులారా రారండోయ్!
లేఖ రాయనందుకు మన్నించండోయ్!
విసిగి వేసారిన నన్ను విమర్శించకండోయ్!
మీకెన్నో పనులు
మీకెన్నో బాధ్యతలు
రాలేదని
బాధపడనోయ్
నేనెప్పుడూ అనాధనేనోయ్!
నాకెందుకోయ్
సంతాప సభలు?
నా
కెందుకోయ్ అశ్రు తర్పణాలు?
నా
కెందుకోయ్ తిలోదకాలు?
చేసుకున్నందుకు చేసుకున్నంత!
నా
బతుకు నాదేనోయ్
నా బతుకు
పండేనోయ్
బతికినన్నాళ్ళూ
రుణ పడి ఉన్నానోయ్!
చచ్చాక మీరుణమెలా
తీర్చుకోనోయ్?
నన్ను చంపిన
హంతకుల్ని వెతికి పట్టుకొండోయ్
నేరస్తుల్ని మిత్రన్యాయస్థానంలో
నిలబెట్టన్డోయ్!
బతికినన్నాళ్ళూ చచ్చి బతికేను
చచ్చి నేను బతికిపోయానని
వినోదమా? విచారమా?
బ్రతికి నందుకు బాగు బాగు
చచ్చినందుకూ బాగు బాగేనా?
నన్ను శాంతంగా బతకనివ్వ లేదు
నన్నుప్ర
శాంతంగా చావనిచ్చినందుకు
స్నేహ
నమస్తులందుకొండోయ్!
నా స్నేహ
కృతజ్ఞతలు అందుకొండోయ్!
నా మరణ వార్త ఎవ్వరికీ
చెప్పోద్దని
నా
స్నేహితురాలితో విన్నవించుకున్నా
అదొక్కటే స్నేహచిహ్నమా?
మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రక్షాలించుకుంటా
28-04-2004
@ 67.నా పాట ఒక లక్ష (మనవరాలు)
28-04-2004
@ 67.నా పాట ఒక లక్ష (మనవరాలు)
పల్లవి:
కూతురువైనా నీవేనమ్మా
కూతురువైనా నీవేనమ్మా
మా వరాలవైనా, మనవరాలివైనా
నీవేనమ్మా!
మా ఇంట వెలిసిన మహాలక్ష్మివమ్మా :కూ:
చరణం:
అమ్మకి అమ్మ అమ్మమ్మ
అమ్మకి అమ్మ అమ్మమ్మ
మపద-దపమ-పదమ....
తెలుగు తనానికి తలకట్టు
చీరకట్టుకే పడికట్టు
సభలోనైనా, ఇంట్లోనైనా
తీసికట్టు ఇంకెవరైనా
ఆ
కట్టు, ఆ బొట్టూ నేర్చి
పట్టుకోమ్మవై నడిపించవమ్మా :కూ:
చరణం:
నాన్నకి అమ్మ నాన్నమ్మ
నాన్నకి అమ్మ నాన్నమ్మ
న
భూతో న భవిష్యతి
సహనానికి సబల
హైందవమున అమల
అలుపే ఎరుగని కమల
సనాతన ఒర్పునూ
అధునాతన నేర్పునూ
మేళవించి నడిపించే
సాటిలేని మేటి నాయకురాలు
ఆ ఒడుపులు పట్టి,
ఒడుదుడుకులు మించి
నడిపించవమ్మా
ముందు తరాలు :కూ:
అందరూ:
కూతురువైనా నీవమ్మా!
కూతురువైనా నీవమ్మా!
మనవరాలివైనా నీవమ్మా!
మాఇంటి కొత్త నేతవమ్మా!
మనవరాలివై,
మా వరాలు పండించవమ్మా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి