@ చామర్తి గేయశతకము –
2
(
నేటి లోక రీతులు )
1. మగని మీద ప్రేమ మగువకు లేకున్న
నరకయాతనగును నట్టి ఇంట
ప్రేమలేని చోట పెన్నిధి నిలుచునా?
మహిని నీతి బాట మర్తి మాట.
2.వంట మనిషిగ సతినింటిలో చూసిన
యింతి యగునె వంట ఇంతి గాని
అర్ధభాగమీక అర్ధాంగి ఎట్లౌను?
మహిని నీతి బాట మర్తి మాట.
3.వంట మనిషిగ సతినింటిలో చూసిన
యింతి యగునె? వంట ఇంతి గాని
పెత్తనంబునీక పెండ్లాములగుదురా?
మహిని నీతి బాట మర్తి మాట.
4.దొరకు దొరకు మధ్య దొరసాని ఉండంగ
దొరలు దోచు కొనిరి దొరికినంత
నాటి విభజనంబు నాతియే జేసెరా!
మహిని నీతి బాట మర్తి మాట.
5.తెల్ల వాడు నాడు దేశము రెండుగా
చీల్చి, పెర్మనెంటు చిచ్చు పెట్టె
కర్రి వాడు చీల్చి కార్చిచ్చు
పెట్టెరా!
మహిని నీతి బాట మర్తి మాట.
6.మేడి పండు వేరు; మేలురకముపండు
అత్తిపండు వేరు ఎత్తి చూడ;
జాతులొకటియైన జవరుచులొకటౌనె?
మహిని నీతి బాట మర్తి మాట.
7.అన్నదమ్ములిట్లు ఉన్న చోటును చీల్చి
సొంతకాపురంపు ముంత వండ
ఉప్పుపప్పు లేని దుప్పిభోజనమాయె!
మహిని నీతి బాట మర్తి మాట.
8.ఖనిజ సంపదలకు అనివార్య గొడవలు
నీటినిల్వ పైన మేటి గొడవ
పంపకాలతీరు చెంపదెబ్బగ మారె!
మహిని నీతి బాట మర్తి మాట.
9.పోరుబాట పట్టి పోకున్న బడులకు
విద్య, బుద్ధులెట్లు సాధ్యమగును?
పానశాల కాదు పరిపాలనంటేను!
మహిని నీతి బాట మర్తి మాట.
10 రాజధానిరభస రాచపుండుగ మారె
రాధకృష్ణకమిటి రంగు డొల్ల
ప్రభుతకవసరమగు ప్రాంతమే ఖాయంబు!
మహిని నీతి బాట మర్తి మాట.
14 ఇంటికొక్క జాబు ఈమధ్యవినవచ్చె
15. పంపకాలలోన పలు అంశములు వచ్చె
11 మాట కల్లబొల్లి చేతలు చేదురా
ప్రజలగోడు లేని రాచలీల;
మాట కల్ల! బొల్లి మాత్రమే
మిగులునో!
మహిని నీతి బాట మర్తి మాట.
12 దొంగతనము చేసి దొమ్మరి దొర అయ్యె
లంజతనము చేసి లక్ష్మి చేర్చె
ఏమిచెయ్యనోళ్ళు లేమిగా మిగిలిరా?
మహిని నీతి బాట మర్తి మాట.
13 ఇందిరమ్మ ఇళ్ళు చందమామగమారె;
గనులఖాయదాలు
ఘనుల(గాలి)పాలు:
జలముయజ్ఞమంత జలగల పాలాయె!
మహిని నీతి బాట మర్తి మాట.
కొత్త పేర్ల వరద కొట్టు కొచ్చె
వరములెల్ల వరద బురదల పాలురా!
మహిని నీతి బాట మర్తి మాట.
ఛావణీలు, సేన చర్చ లేదు;
జైకిసాను
మిగిలి, జైజవానులు పోయె!
మహిని నీతి బాట మర్తి మాట.
16. చారుధాము ఘోరవరదలందునెగాక,
అవనిగడ్డలోనుసేవ
జేసె;
ముప్పులందు
సేన ముడుపులకు కిసాను!
మహిని నీతి బాట మర్తి మాట.
17. చర్చలు,
కమిటీలు చర్చకు అంశముల్
చావు బక్క చిక్కి చివికె రైతు;
కౌలురైతు చావ, మైలు దూరము
“మైలు”!
మహిని నీతి బాట మర్తి మాట.
18. “మైలు” పట్టు వారు “మైలు దూరము” లోన
లేరు; కారణంబు “లేనిరైతు”
బతికి “బక్కరైతు”; చితిలోన
పేరేమి?
మహిని నీతి బాట మర్తి మాట.
19. రక్షితమగు నీరు, అక్షయమగు గాలి
ఉండ ఇల్లు ఒకటి మెండు గాదె?
కాంచనమయమేల? కరవులు
తేకున్న!
మహిని నీతి బాట మర్తి మాట.
20. చంద్రబాబు
కలలు చక్కని సీమాంధ్ర
తలకు మించి బరువు వలదు
వలదు
బాబు మరువకండి జాబుల
ప్రతినలు!
మహిని నీతి బాట మర్తి మాట.
87 చిన్నదివ్వెచాలు చీకటితొలగింప;
21. స్వావలంబనంబు స్వర్ణాంధ్ర మంత్రంబు
ధిల్లి చుట్టు తిరుగ డొల్ల డొల్ల
రోము నగరు కూడ రోజులో
కట్టిరా?
మహిని...........
22. నీరు ముందు సాగునీరటుపైన
భవనకట్టడములు, బడులు:
పిదప
రోడ్డు, రైలు, నుక,
రోదసిమార్గముల్
మహిని.........
23. బక్క “కేసియారు” బంగరు తెలగాణ
పసిడి ఆంద్ర అంటు పలుకు
బాబు
సాము నేల విడిచి సాధ్యము
కాదురా!
మహిని ..........
24. చంద్ర శేఖరుడిట చంద్రబాబచ్చట
భాష ఒకటెగాని
బాసలెన్నొ!
వేచిచూడుడయ్య
పాచికలాటలు
మహిని...........
25. తలకు మించి బరువు తలపైన పెట్టకు
మజ్జమోయలేక నుజ్జు
నుజ్జు
ఆశ ఉండ వచ్చు అత్యాశ
వలదురా!
మహిని........
26. బాలకార్మికులకు బడులు దూరము లాయె
చేరువయ్యి కూడ
భారమయ్యె
చిత్తశుద్ధిలేక
చేరువకావేవి!
మహిని..............
27. శ్వేతపదము వాడి చేతకానితనము
చాటుకుంటివయ్య
చంద్ర బాబు
పద్దురాసి చూపు
ప్రతి ఒక్క అంశము
మహిని......
28. అరువది దివసములు అలసట లేకుండ
కష్టపడితిననుట
ఖలునిమాట
తుమ్ముకొనుట నీవె
తుంబురాయువు నీదె
మహిని..........
29. అంటరానితనము అందలమెక్కెను
స్థిరములన్న ఆస్తి
చరములయ్యె
దవ్వునుంచి నోళ్ళు
దర్జాగ ఉన్నారు
మహిని........
30. బ్రహ్మపధముగోరు సింమ్హబలులు వారు
ఇహము లోన వారు
సహనపరులు
వారి సహనబుద్ధి
పరిహసించుట ముప్పు
మహిని........
మహిని........
@31.మారుటమ్మలనుచు మహిలోనివారెల్ల
ఆడిపోసుకొనుట
పాడికాదు
రాగరంజితంబు రాధేయశబ్దంబు
మహిని........
32. కర్ణహితముగోరి కర్రివాడు తనకు
హితముచెప్పినంత
విధము చెడెనె?
సొంతలాభబుద్ధిచింతన
చేటురా!
మహిని......
33. నేలకొరిగె రధము నేలమ్మ పుణ్యంబు
శస్త్రవిద్య
కూడశాపమయ్యె
దైవవంచితునకు
దైన్యమే ధైర్యంబు
మహిని............
34. కుంతితానువచ్చి గొంతెమ్మ కోర్కెలు
కోరినంత, తల్లి
కోర్కె మీర
ఎవురమ్మనీకు
ఏటినుంచిననుండి
మహిని....
35. మారుటమ్మలనుచు మహిలోనివారెల్ల
ఆడిపోసుకొనుట
పాడికాదు
రాధ లోటు జేసె
రాధేయరాజుకు?
మహిని.......
36. కుంతితానువచ్చి గొంతెమ్మ కోర్కెలు
కోరినంత, తల్లి
కోర్కె తీర్చి
ఏవురమ్మ నీకు ఏటిముంచిన నాడే
మహిని......
37. కన్నతల్లికన్న, కన్నుల్లపెంచిన
తల్లి కన్న
వేరె తల్లి కలదె!
తక్కువేమిచేసె
తారాధ కర్ణకున్?
మహిని......
38. తెరుచుకున్న కళ్ళు తెరమరుగగుదాక
కొట్టుమిట్టు
లాడు పొట్ట కొరకు
కళ్ళు మూసుకున్న
కవ్వింపులాగునా?
మహిని........
39. అమిత మిత్రుడు వాడు అభిమానగనిసుయో
ధనుడు మానధనుడు
అనగ చెల్లు;
మైత్రికున్నవిలువ
ధాత్రిలో వెలిగించె
మహిని.............
40. సూతుడన్నపదము సుతరాము నచ్చక
మైత్రివిలువ
నాటి ధాత్రి లోన,
అంగరాజ్యమిచ్చి అధిపతిజేసేరా!
మహిని...........
@
41. ప్రేమకన్నవేరు పెన్నిధి ధరణిలో
లేదు; లేనె
లేదు: చేదు నిజము
ప్రేమకుసరిదీటు ప్రేమయే ఇలలోన
మహిని.......
42. మహిళలన్నవారు బహుళమైన పనులు
చేయుటెల్లమంచి చేత గాదె?
గీత దాటకండి
సీతయే బలిఅయ్యె!
మహిని.......
43. తల్లి, తండ్రి, గురువు తదుపరి పౌరులు
బాలబాలికలను బాగు చేయ!
చట్టబద్ధమైన సమరీతిపాలన
రాజ్య
బాధ్యతయ్య రాజ రాజ!
44. ద్వేషగుణముకన్న హేయమైన గుణము
వెదకిపట్టి
చూడలేదు; కనము:
ద్వేషబుద్ధితోనె ద్వాపరంబు ముగిసె!
మహిని........
45. హీనుడన్నవాడు
ధనమెంత కూర్చినా
దానబుద్ధి
వాడి దరికి రాదు
పుట్టుబుద్ధులెట్లు
పుడమిని బోవురా?
మహిని...........
46. హీనుడన్నవాడు ఈవి పొందగ లేడు
హీన గుణము వాడు మాన లేడు
తీపి ఊట పోయ
వేప తీపియగునె?
మహిని............
47. గుడికిపోవునపుడు కుడిచి పోవగ రాదు
శుచిగపోవుటెల్ల శుభము శుభము
వాయు
కలుషితంబు ఆయువు చేటురా!
మహిని.........
48. దొంగతనము నేడు దొరతనముగమారె
దొరలుకూడ
నేడు దొంగలైరి
దొరలునాడే మనకు దోపిడీ
నేర్పిరి!
మహిని........
49. చట్టసభలలోన కట్టుబాట్లు కరువు
శాశనాలరీతి శాపమయ్యె
ప్రజల
గోడు వినెడి ప్రభుతయే కరువాయె!
మహిని..........
50. నాల్గు పదులు దాట నవ హేళన మిగులు
మెచ్చుకోరు పైన మేల మాడు
జవము,
కళలు పోవ జవరాండ్ర గతి ఇంత!
మహిని.........@
51 పోరుగుదేశమందు
పొదుపు చేసెడి వారు
దేశద్రోహులనుచు శాశనంబు
చేసి,
వెలికి దీత చేయుడయ్య ధనము
మహిని.....
52 పోరుగుదేశమందు పొదుపు చేసెడి డబ్బు
నల్ల ధనమె; కాదు తెల్ల
ధనము;
నాన్పుడెందుకయ్య నగదు వేగమె తెండు
మహిని........
53 వందమంది లోన అందరూ దొంగలే
లేడు
ఒక్కడైన లెస్స గాడు;
దొరలు
పోగ మిగిలె దొంగల రాజ్యంబు
మహిని........
5 4టాట బిర్లలసలు తస్కరులైనచో
వెళ్ళ
బోరు దొరలు వాళ్ళ ఊరు
దేశభక్తిలేక దేశము నిల్చునా?
మహిని........
55 చెరువు పూడ్చి ఒకరు చేలు దొబ్బి ఒకరు
“రియలు”
దొంగ లైరి రీతి తప్పి
మిగులు
భూమికొచ్చె మిక్కిలి రెక్కలు
మహిని..........
56పులిని చూసి నక్క నిలువెల్ల కాలినా,
మారబోదు పులిగ మర్మ మిదియె;
అనుకరించినంత తనువులు మారునా?
మహిని...........
57నాడు అవనిగడ్డ, నేడు కాష్మీర్జమ్ము
మొన్న చారు ధాము; మోహరింపు
వారి
అసలు విధులు; వారింపగలమయా?
మహిని.........
58 నిన్నమొన్న హుధుధు నిలువునా ముంచెను;
విలయతాండవంబు మలయ పవను;
అపుడు నౌక బలము, “ఆర్మీ”లె
గతిఅయ్యె
మహిని.......
59ఋణము చేయువారి ఋణములు మాఫీలు
రణము
చేయు వారి రుణముదీర్చు
మాట
ప్రభుత కెపుడు మనసుకు పుట్టదా?
మహిని.......
60ముప్పులందు
సేన ముడుపులకు కిసాను
మెప్పుకూడ లేదు ముప్పు తప్ప;
భూమి
దున్ని రైతు భూరి పుణ్యము చేసె!
మహిని.........
61ఎంత సేపు చూడ ఎన్ని పొగడ్తలో?
సోదిలోకిరారు సైనికులిట
కళ్ళతుడుపుసేవ కష్టాలు తీర్చునా?
మహిని......
62కృష్ణరాయవిభుడు కృపతోడ చూసేను
పతులుపోవ భూమి సతులకిచ్చి;
కీర్తిపొగుడువారు క్రియలెట్లు మరతురో!
మహిని......
63గోడకేసినసున్నము, గోరు రంగు,
వేశ్యకెట్టిన సొమ్ములు, వెధవరాలి
కెట్టు భరణపు డబ్బులు, పెట్టుబడికి
చేటు; తిరిగి రావు వసుధ చేదు నిజము!
64సరససల్లాపములు విరసమగు వెంట;
పూర్ణసుఖములెల్లనుపరిపూర్ణ దుఃఖ
ములగు; కష్టపడనివారు కలత నిద్రకు
గూడ
నోచుకోరునిజము
65చిడతలెన్ని తెచ్చి చితక బాదుచు, దేవ
కీర్తనంబు చేయ కీర్తి రాదు;
భక్తితత్వమరయ భజనలు కావయా!
మహిని...............
66ఎల్లతీర్తమాడి ఏమేమి చేసినా,
కట్టి
కుడుపునోయి ఖర్మ ఫలము;
చేసుకున్నదంత చేజేత కుడువుమా!
మహిని.......
67మనసునందు కల్గు మన్నన మన్నన
బాహ్యచేష్టలసలు భక్తి కావు
మనసుమించివేరు
మానంబు లేదయా!
మహిని......
68కలిమికిలనులేవు
కులగోత్రములమాట
లేనివాడు ధరణి కాని వాడు
లేనితనముకన్న లేదు ధరణి వైరి
మహిని.........
69మానమమ్మి ఒకరు ప్రాణమమ్మి ఒకరు
పొట్ట
కొరకు జనులు పోరు సలుపు
పుస్తెలమ్మియైన పులసతినిన రీతి!
మహిని.......
70 పులిని చూసి పులికి కలుగదు భయభ్రాంతి
మాయరోగమేమొ! మనిషి మనిషి
కసలు పడదు పుడమి, ఖర్మరా బ్రహ్మయ్య!
మహిని.......
@
@
71 వర్గవైరములిల మార్గములయ్యెను
వ్యక్తికున్నవిలువ వ్యస్తమయ్యె;
వసుధనెందుచూడ వర్గంపు వైరమే!
మహిని........
72 మతమువలనవచ్చె మతకలహమునాడు
కులమువలనవచ్చె కుటిల బుద్ధి;
భాషపిచ్చిపతట్టి భారతము చెడెరా!
మహిని.........
73 రాజకీయ
రచ్చ రాష్ట్రములందెల్ల
మోసపూరితంబు దేశ మెల్ల;
సమసిపోయె నేడు సామాజిక విలువ!
మహిని........
74 లంచగొండితనము సంచరించినచోట
పరకగడ్డియైన పచ్చబడదు;
నీతిలేనివారు నీదేశనాయకుల్!
మహిని........
75 తండ్రి
తురక మతము తల్లి యేసును నమ్ము
వారి
సుతుల మతము వివరమేమి?
తల్లి
చేను మేయ తనపిల్ల గట్టునా?
మహిని.............
76 బలముకలిగినోడు బలహీనుడయ్యెను
కండ బలము నేడు దండగయ్యె
వర్గ
బలము వచ్చి వసుధ నరకమయ్యె!
మహిని.......
77 కవితలల్లువాడు కాలేడు ధనికుండు
జీవమంత్రమెట్లు కవనమగును
కవుల
కాగితాలు కర్రెంసి నోట్లౌనె?
మహిని......
78 జీవనాలుగొట్టి జీవించు జాలరి
ధనమునిలుపలేడు ధరణిలోన
గొల్లుమన్నచేప కల్లుపాకవరకె
మహిని......
79 జాల రెంత చేప వలనిండ పట్టినా,
పాకుకుంటుపోవు పాక వరకు
జెల్ల
జలమువీడి కల్లు తాగిన రీతి
మహిని.........
80 వయసు మీరినంత వంగిపోవు తనువు
సానుకూలపడదు తనువు ముదిరి
వయసుకాలమెరిగి వసియింప వలెనయా!
మహిని.....
81. మతమువీడరాదు మత్తునబడినను
మనిషి మాటమీద, మహిషి దెబ్బ;
విధముచెడగరాదు వివరము తెలిసినా!
మహిని.........
82 కాలుసేతులాడ కనరావుకష్టముల్
ఒక్కకాలుపోవకుక్కబతుకు
సేవచేయుకాలుసేతులమరువకు
మహిని.........
83. కోతిగెంతునపుడు గోకునుపిల్లను
చూడమనుచు తాను వొడుపు చూపు
తల్లివిద్యలేని తనయులు నేడయా!
మహిని..........
84 తీర్థయాత్రలనుచు తీరుబడిగపోవు
నడిమివయసు
ముందె నాకమంద
ముందుముదిమివయసు ముచ్చటలాడనా?
మహిని........
85 సంతుయోగులనుచు సన్యాసమునుపొంది
రంగుబట్టతొడగ హంగు పోదు
వేషభాషలెట్లు వైరులదోలునో?
మహిని.........
86 రానిపనినిగూర్చి రాపాడి చచ్చినా
వివరమింతయైనవిశదపడదు;
సర్వపనులు రావు సర్వేశ్వరునికైన!
మహిని......
87 చిన్నదివ్వెచాలు చీకటితొలగింప;
పదులమంది దివ్వె పట్టినంత,
పట్టపగలెరాత్రి పట్టనమంతయు
మహిని........
88 చేతసెల్లుఫోను చెల్లని చెక్కులు
నల్లనైనమేను తెల్ల బట్ట
భూమి కబ్జచేయు “భూమి సురులు” వారు
మహిని.......
89 సిండికేటలంటు దండుకొనుటపని
వారిదొక్కదండు
వసుధలోన
మొండివాడురాచదండనవెరచునా?
మహిని.........
90. “రియలు” బిజ్జి నెస్సు
రీజనింగులు ఫుల్లు
పేడిరూపుతీరు పైడితొడుగు
డబ్బు
డాంబికాలు డచ్చాల కబురులు
మహిని........
91 దొంగలంజ లెపుడు
దొరసానితామంద్రు
లంజలంజనడుమలజ్జచేత
దొంగదొంగనన్న
దొంగకునచ్చునా?
మహిని.......
92 మత్తు సార కన్న మత్తుమందులు హెచ్చు;
మర్దనాలకన్న మత్సరంబు;
మగువమించిమత్తు
మహిలోనలేదయా!
మహిని.......
93. మంటలార్పవచ్చు మనుషులు నీళ్ళతో
మత్సరంబుమాపిమనగవచ్చు:
పగలసెగలనార్పపరమేశువశమౌనె?
మహిని.........
94 పగనుపెంచునుపగ; పగతురపెంచును;
పగకులేదుపక్షపాతబుద్ధి!
ఆకురాయుపెంచు
చాకునుపదునుగా
మహిని.......
95 పువ్వురాలిపోయి పుడమిలోకలియును
పూజపూలుకూడ పుడమికలియు
పుట్టువాడుకడకు పుడమిని
కలవడో!
మహిని.........
96. పేదవానికెన్ని బాధలు
కలిగినా,
పోరుగుమనసుకూడ
కరుగబోదు;
ధనముకలిగెనేని జనములు
కొదవౌనె?
మహిని......
97. ధనహీనుడొకడు జనులహితముగోరి
జనులకుపకరించు పనులు
చేయ,
ధనము చుట్టె తిరుగు
దనుజులు మనుషులా?
మహిని.........
98. కోతిమూకకైన ఈతి బాధలుకల్గు
వాటిసంతుగాదె
నేటిమనిషి?
కోతికున్న బుద్ధి
కొరవడె మనిషిలో!
మహిని......
99 పులినిచేరదీసి చెలిమిచేయగవచ్చు;
వాడదగువిరుగుడు
పామువిషము
చేరదీసిచూడు
చెడ్డవానినినువ్వు?
మహిని..........
100 కొండమీదనుంచి కోతినితెచ్చినా,
మర్కటంపుచేతమరిచిపోదు;
జాతిలక్షణములు
జాములో పోవునా?
మహిని......
101 చేతకానితనము చేమంచికేసరి
ప్రతిఫలమునుకోరచేతకాక;
చేతకానివాడు గీతరాతకు చెల్లు
మహిని.......
102హరితవనముసాటి సరితూగలేవేమి!
చెట్లు నాకమునకు
మెట్లు కావె?
నరులుచెట్లునరికి
నట్టేటముంచిరి!
మహిని......
103చెట్టుపుట్టములను
సేవించెనార్యులు
నది,నదము,గిరులనాదరించె;
నరులు నాశ పరిచి
నట్టేట ముంచిరి
మహిని.....
104 స్నేహమునకుసాటి యిహమునలేదయా!
లేదు మైత్రికన్నా
లెస్స సుమ్మి;
చెలిమిముందు దాహ
బలిమియే సున్నరా!
మహిని........
105చెలిమికన్నలేదు కలిమి వసుధలోన
ధరణి, చెలిమి
మించు ధనము లేదు;
ధనమువిలువపెంచి
ధరహీనులయ్యిరి
మహిని......
106 గీతలోని నీతి చేతల్లో చూపిన,
భువియె అగును
పెద్ద పుణ్య భూమి;
భీతిలేకనేడు
నీతియే కొరవడె!
మహిని.........
107 క్రూర మానవాళి ఊరపిచ్చుకలను
తరిమిచంపినారు
తగనిరీతి
పక్షితతులులేక
పరిసరములుపోయె!
మహిని......
108 కాలకూటవిషము కులములు వసుధలో
మతము “మందు”
లాంటి మత్తు మందు;
ప్రాంతభేదమిపుడు ప్రాణాంతకములయ్యె !
మహిని నీతి బాట
మర్తి మాట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి