@ చామర్తి గేయ శతకము - 3
(నేటి లోక రీతులు)
1.పంచదార కన్న, పటికబెల్లము కన్న
విరుల తేనె కన్న దార పల్కు;
పరుపుకునుకుకన్న పచ్చిపెదవిహెచ్చు!
మహిని నీతి బాట మర్తి మాట.
2సాటి మనిషి మీద సానుభూతిని చూపు,
చూపు మనము నేడు చూడబోము;
జాలి, కరుణ, దయ జనులకు లేవొకో!
మహిని.............
3.కష్ట పడ్డ సొమ్ము గంజినీళ్ళకెసరి
గుడ్డ, గూడు కూడ ఏడ వచ్చు?
దోచుకున్నవాడె దొరలాగబతుకునా?
మహిని............
4.బియ్యె, ఎమ్మె, “డిప్పు”, బీకాము, బీటెక్కు
లింగితంబు లేని యింగిలీషు;
విద్య ఉండి కూడ వికలాంగులీనాడు
మహిని......
5.ఎదుటివారిబాధఎదకునాటనివాడు
తుచ్చజీవికన్నతచ్చుగాదె
సకలజీవులందుసర్వేశ్వరునిచూడు
మహిని........
6.ఓర్వలేనితనము నేర్వలేనిగుణము
దొందు దొందె సుంత సందు లేదు;
నేర్వగలిగినంతఓర్వగలగవచ్చు
మహిని....
7.మంచితనములేక మనెడి మనుషులను
చూచి, చూచి, చూస్తూ చూడలేము;
ముందు ముందు చూడు
ముప్పులేమెండురా!
మహిని..........
8.ధనము లేనివాడు, దమ్ములు లేనోడు,
పనికిమాలినోడు, పరమశుంట-
దారముందుకూడ కొరగానివాడురా!
మహిని.........
9.విద్యఉండికూడ వికలాంగులీనాడు
చదువుకున్నవాళ్ళు చాల అరుదు;
వినయమబ్బలేని విద్దెలువిద్యలా?
మహిని...........
10.ఏశరీరమైన నాశమైతీరును;
దేనికయ్యమెరుగు మేనిమీద?
వాదమేల? మతవిభేదమేలరా?
మహిని........
11.కొమరికొరివిపెట్టకూడదా? శాస్త్రమా?
పుట్టగతులులేవె పుత్రులులేక?
లేనికొడుకుకన్న, కన్న కూతురు
మిన్న!
మహిని......
12.మేలుకొలుపు లేని మెళుకువ జీవితం
తళుకు బెళుకు లేని తల్లి జీవి;
జన్మలెన్నిచాలు జననిరుణము
దీర్ప?
మహిని.......
13.వేయవచ్చువల్లె వేదాలు, భాష్యాలు;
ఉపనిసించవచ్చు ఉపనిషత్తు!
తల్లిరుణముతీర్చు తర్కంబు
తెలుపుమా!
మహిని.....
14.ఆడపిల్లజన్మ పీడితజన్మరా!
పిల్ల, భార్య, తల్లి, పిదప
మామ్మ;
నిద్రముద్రలేని నిర్భాగ్య
మూర్తిరా!
మహిని......
15.పక్షిపిల్లతాను కుక్షి నింపనుపోవు
రెక్కలొచ్చినంతరివ్వుమనుచు;
మానవాళికెపుడు మర్మంబు
తెలియునో!
మహిని......
16.కన్నవారిసేవకసుగాయిగాచేయు
భార్యయగుచు చేయు భర్త సేవ;
తల్లియైనవెంట
తనయులు, మనుమలు
మహిని...........
17.నరులకొరకుజేసెనరకంబు దేవుడు
బాధలనుభవింప పరము నందు;
వసుధనరకమగును పశుగణ ముగమార!
మహిని......
18.ఎదిగివచ్చినసుతుడెదురాడనూవచ్చు;
కళ్ళు నెత్తికెక్కి కనగ
లేక,
పరుషభాషలాడి
తరిమికొట్టనువచ్చు
మహిని.......
19.తలకికొరివిపెట్టతనయులేవలయునా?
కోరబోకు డమ్మ కొడుకు
కొరకు
ఆడపిల్ల నీడ ఏడనూ దొరకదు!
మహిని.....
20.కొడుకు పుట్ట తల్లి కొనియాడు దేవుళ్ళ,
తలకికొరివిపెట్టు
తనయుడనుచు;
దుష్టుడైనకొడుకు దూరుచు
తన్నును!
మహిని......
21.“కర్మ” చేయు టన్న కన్న కొడుకు విధి
ఖర్మకాలినంత, కన్న కొడుకు
కన్నవారి బట్టి తన్నడే
దుష్టుడై!
మహిని.......
22.ఎదిగివచ్చి కొడుకు ఎదురాడనూ వచ్చు
పరుష భాష తోడ పల్క
వచ్చు;
కొడుకు కొడుకు లంద్రు
కొమరికి సాటియా?
మహిని.........
23.కొడుకు కొడుకు లనుచు కోరును తల్లులు
తరుణిరాగా తల్లి మరుగు
బడును
తల్లి కూతురుకూడ
తపియించు కొడుకుకై
మహిని......
24.బట్టలెన్నిఉన్న కట్టునా
ఒకసారి?
వగలమారి నగలు పగటి
భయము!
ఇల్లుముందుకట్టు
ఇల్లాలి రక్షకై!
మహిని.........
25.దేశ ద్రోహి కలడు దేశ దిమ్మరి యుండు;
తల్లిగొట్టు వాడు తార్స
పడడు
తార్స పడిన, వాని
తగురీతి శిక్షించు
మహిని........
26.జుట్టుపట్టిలాగి కొట్టెడి తనయులు(భర్తలు)
కలరుపురుషులందు
కలుషమతులు;
కట్టికుడుపువాని
పుట్టెడు జన్మలా!
మహిని......
27.సవతి తల్లి యైన చక్కగ సాకిన,
కన్న తల్లి కన్న
మిన్న గాదె!
రాగరంజితంబు రాధేయ
శబ్దంబు!
మహిని........
28.ముప్పదేండ్లు కాచి, ముప్పొద్దులాపెట్టి,
తీర్చి దిద్ది తల్లి
ధీరు జేయు;
కలదె కొలత ధరణి
కన్నతల్లిని కొలచ?
మహిని........
29.కన్నకొడుకు తాను కాపుర్షుడయ్యెను
తండ్రి కడుపు తీపి
దద్ద జేసె!
తల్లి మధ్య నలిగి
తపియించె కునుకుకై!
మహిని.........
30.కూర్మి, ఓర్మి, అమ్మ పేర్మిలోననుమిన్న
కన్నతల్లి ఎత్తు మిన్ను కన్న
జీవజాలమందు జీవమే
తల్లిరా!
మహిని.....
31.కన్న కొడుకు జాలి గొన్నను చాలును
తిట్టు లెన్ని
తిట్ట తీసి కట్టు!
కన్నకొడుకు కొట్ట
కన్నీరు మిన్నేరు
మహిని..........
32.కొడుకు దొంగయైన, కొరగాని వాడైన,
తల్లి నోట వినము
తగని పలుకు;
పేగు బంధమొకటి
పెంచిన తీపోటి!
మహిని..........
33.తండ్రి చేయు పనులు తనయుడు చేసిన,
తండ్రి తప్పు బట్టు తగని
వనుచు;
తనయుడెగ్గులాడు
తండ్రి తప్పులనెంచి
మహిని........
34.సైనికులకునీయ సహియింప జాలరు
ఐదు ఎకర భూమి ఏమి యైన
అంటరానివార
సైనికులిచ్చట?
మహిని........
35.చలువరాతి మెడ చక్కంగ కట్టినా,
సదనమెంత మనము
పదును చేయ,
అందు కనుపసందు
ఇందువదనగాదె?
మహిని........
కంట నీరు పెట్టు కపటిగాడు!
కారణంబులేక
వారి నగవులేడ్పు
లిలనుపుట్టబోవు
కలియుగమందున!
37.చదువుతూనె పదవి చవులను మరిగిన,
వారు పదవి
నసలు వదల లేరు;
పుట్టు
లోనెపండ్లు పెట్టుకు పడ్డట్టు!
మహిని........
38.పుడమిలేరెవరును పూర్ణదుష్టమతులు;
పూర్ణసత్పురుషులు పూజ్యమిలను;
మంచిచెడులనేత
మనుషలోకముచేత!
మహిని.........
39.అగ్గిచేతఅగ్గి ఆరి బూడిదకాదు
చల్లబడును నీరు చల్లగానె;
సృష్టిలోనివింత సృజనకుతరమౌనె?
మహిని......
40.కులము
కులముకొక్క కులవృత్తినెపమున
కులములిలనువెలయ కుమతులైరి;
భాషకన్నకులము
బహుచెడ్డ విత్తురా!
మహిని.......
41.వెనుకబడినవారు వెనుకబడినవారె!
వెనుకబడ్డజాటి యనుట ముప్పు;
అనుచితంబుగాదెమనుధర్మమునుదప్ప !
మహిని......
42.గుంపులందు మనిషి గుట్టుగా జీవించి
సాధుజనులనుంచె జోదుగాను;
వేటతప్పనాడు
ఏపాటులేదయా!
మహిని......
43.బలిమికండలున్న బలశాలులనెగాక,
మాటనేర్పు
మంచి మందినుంచె;
పురముహితముగోరు వారైరి పిమ్మట
మహిని.......
44. ఎదిగి ఎదిగి పల్లె ఏపైన పల్లెగా
మారె;
సంజ్ఞ, సడులు, మాట నేర్చె;
జనముగుణములెరిగి జనపదులుగ మారె!
మహిని.......
45.మాంసభక్షణంబుమరిగిన పల్లీలు
మొగముమొత్తిబహుశ చిగురుకొరికె;
కాలగతినివారు కాయ, పండ్లు తినిరి
మహిని........
46.ప్రకృతినమ్మి, కొలిచె ప్రాకృత మానవుల్
చెట్టు,
నదులు, నదము, పుట్టలనక;
నిలకడజలమందు జలకేళివలదనె!
మహిని........
47.గుహలవాసముండె, గుడిసెలలోనుండె;
క్రూరజంతుజాల బారి పడక
ప్రాణభయమె గాక పడ్దలకభయమై
మహిని.....
48.భీకరముగనాడు చెకుముకి రాళ్ళను
పగులగొట్టుచుండ,రగిలి అగ్గి,
గుడిసెమీద
పడగ బూడిదైమిగిలేను
మహిని......
49.గుడిసె లోని పంది ఘుమఘుమగాకాలి,
తంపటగుటచూసి లొట్టలేసి
ఆరగించెనంత వారాహ “తందూరి”
మహిని........
50.పందిపెంపకంబు పదునుగా జేయుచు
గుడిసెనందుబెట్టి, గుగ్గి పెట్టి,
వంటచేయసాగె వన్య మనిషినాడు!
మహిని.......
51.పచ్చికూర, కాయ, మెచ్చుకొని తినుచు,
జీర్ణమగుటకొరకు చిగురుతినెను;
పసరురాసుకొనెను పచ్చిపుండులమీద
మహిని.....
52.సిగ్గులజ్జలొచ్చి చిగురుకొమ్మలు గప్పి
తనువునెండనుండి
తాపమడచె;
తోళ్ళు
గుడ్డలయ్యె తొలినాళ్ళ జనులకు!
మహిని........
53.చిన్నవారిమనసు చిదిపిన పాపంబు
నొచ్చనివ్వరాదు పచ్చిమనసు;
సంతసముననుంచు సంతుజనములను!
మహిని.......
54. చిన్నమనసులెరిగి మన్ననగాచూడు
చిన్నమెత్తుకూడ
చివుకుమనక;
సగముబలముకాదె సంతోష మీయంగ!
మహిని........
55.కిందపడ్డవార్ని
కించగా చూడకు
పడ్డవారు కాదు చెడ్డ వారు;
ఎన్ని
సార్లు పడదు ఏటిలో కెరటంబు?
మహిని........
56.కనకదాసులొకరు
కాంతదాసులొకరు
దాసకన్యకూడదార అయ్యె!
దాసుకానివాడు
ధరలోనలేడయా!
మహిని.......
57.మాటమాటపెరిగి మారును తగవుగా
తగవు
తగవు పెరిగి ‘పగలు’గాను;
మాటపొందికైన, మసలునా తగవులు?
మహిని........
58.ఆహముపెరుగువసుధ అధికారమందిన
మోహబుద్ధిపెరిగి
మోసమబ్బు
ఆశ, మోహములిల పాశములురబాబు!
మహిని......
59.దుంగలన్ని నేడు దొంగల పాలయ్యె;
టేకుగిట్టుబాటు లేకపోయి,
ఎర్ర
చందనంబు నర్రగా మారెనా?
మహిని........
60.తండ్రితప్పు లెంచు తనయులు ఈనాడు
ఔర! ఏమి అయ్యె గౌరవంబు?
కన్నతండ్రి విలువ కన్నుమూయ తెలియు!
మహిని...........
61. చెల్లు చీటి అయ్యె చేనేతబట్టకు
పట్టు బట్ట పోయె కట్టలేక
సిసలు బట్ట పోయి సిల్కులు వచ్చెరా!
మహిని.....
62.అన్నమాటకిలను మన్నన లేదాయె!
నిలుచు లబ్ధి మీద నేటి మనిషి;
నోటి మాట పోయె; నోటుకీ సెలవాయె;
మహిని.......
63.రాజకీయ రొచ్చు రాష్ట్రాలనిండుగా
కులము, మతము, భాష, కుటిల నీతి
నరనరములనిండె భారతావనిలోన!
మహిని........
64.రోజుకొక్క జెండ రోతగామారెను;
పదవిదొరకు వరకు వలస బాట!
పంచుకొనుట
వరకె పాలన ఏదయ్య?
మహిని....
65.ఎలుగు గొడ్డు జాతి వెలుగులో తిరుగదు;
ప్రజల
వోట్లు మెక్కి, ప్రజల నడుమ
తిరుగ లేని జాతి వీరిదీదేశాన!
మహిని.....
66.బోరు బావి ఇంకె బోలెడు అప్పులు;
మరల
సాగు చేయ మదుపు లేదు;
కలదొ? లేదొ? “మాఫి” ఖచ్చితముగచెప్పు!
మహిని.......
67. రాజధాని మార్పు రోజు రోజుకు మారి,
రేట్లు “రాజుకొనెను” రేసులోన;
తుళ్ళి పడెను ఊరు తుళ్ళూరు తుగ్లకై!
మహిని.....
68.భాగ్యనగరు పోవ భాగ్యమబ్బెను మాకు;
తుళ్ళి తుళ్ళి పడెను పల్లె పల్లె;
స్వంత లాభ మాయె పొంతన లేకుండ!
మహిని......
69. సకల జనుల నెంచి సమముగా వాడుము
పంచభూతములను పదిలముగను
నీరు, నోరు వాడు ఊరివారినెరిగి;
మహిని......
70.జడుపు లేని వాడు పుడమిని పుట్టడు;
కొంతమంది చెప్పు గొప్ప కొరకు
కలడె జడుపు లేక కాటికి, నోటికి!
మహిని........
71.బాధ జీవి లోని బహుముఖ ప్రళయమై
నోరుదాటిపడును హోరు
గాను
చేపలంగడందు చేపలే మాట్లాడు;
మహిని.....
72. రాగమధికమైన రోగమైతీరును
పెరుగుటెల్లవేళ పెద్దముప్పు;
వానలధికమైన
వరదలై ముంచవో!
మహిని......
73.సంకురేత్రి వచ్చి శంకలు పోయెను
సంబరాలజల్లు అంబరాన
తుళ్ళిపడ్డ ఊరు తుళ్ళూరు తులతూగె;
మహిని
74.వచ్చినట్లు వచ్చి తచ్చాడకుండనే
సంకురేత్రి లచ్మి చక్క పోయె
ముగ్గుముగ్గులంద్రు ముంగిటనిలచునా?
మహిని......
75.ముగ్గుపండగనుచుముగ్గుల్లువేయంగ
ముగ్గు తొక్కి వేసె మూక పిల్ల;
మనసులోని ముగ్గు మంది తొక్కగలరె?
మహిని........
76.రోడ్డుమూసివేసి రోడ్లపైముగ్గుల్లు
వేయువారి బుద్ధి కాయు నెవడు?
మదికానిచోటు తందానతానరా!
మహిని.......
77 వారి ఇంటి ముందు వేయరు ముగ్గులు
ఇంటిముందు ముగ్గు కంటికింపు;
రోడ్లమీద ముగ్గు రోతను పుట్టించు
మహిని.......
78.లక్ష్మి తనకుతాను లగెత్తి వచ్చును
లేదు లక్ష్మికసలు భేద బుద్ధి;
ఎట్లు వచ్చి పడునొ అట్లనే పోవురా!
మహిని....
79.రంగుకోక కట్టి రవ్వలసరులిచ్చి,
బొట్టుపెట్టపోదు బోడి
తీరు;
ముండ ముండె ఎంత ముస్తాబుచేసినా!
మహిని.....
80.విలువ లేని చోట విద్యలు చూపినా,
మెచ్చుకొనరు; మీద మేల మాడు
ఎద్దు కేమి తెలియు విద్దెల విలువరా?
మహిని..........
81.బాధ ఉన్న గాని బయటకు రానీకు
చిరునగవు చూపు చిద్విలాస!
పంచు సంతసంబు పరమాత్మరూపువై!
మహిని...........
82. ఉన్నలోభి పట్టి ఊరించి పైకమున్
పొందవచ్చు భువిని బొంకియైన
లేనిదాతనడుగ లాభంబు లేదయా!
మహిని.....
83.రాచలీలలాడె రాయబారము చేసె
గీతసారమిచ్చి గీత గీసె
ఇంతచేసిగూడ నిందలపాలాయె!
మహిని.....
84.చెడ్డమాటలెపుడు చెవులకింపుగనుండు
సత్యభాషణంబు చవుల నింపు;
మనసుబుద్ధి నెరిగి మసిలిన చెడుగాదు!
మహిని............
85.మానవత్వమిలను మంటలోకలిసెను
మనిషి గాడి తప్పి మన్ను కరిచె;
మానుకున్న విలువ మనిషిలో కొరవడె!
మహిని....
86.బ్రాహ్మణత్వముడిగి
భ్రష్టుత్వమేతెంచె’
అనెడివారె; కాని, ఘనత కొరకు
కులము మార్చు వారు కుటిలమతులుకారె?
మహిని......
87.మతముమార్పిడిలను మామూలుగామారె
కులము మార్చువారి కొలుచు టెట్లు?
పుట్టుకులము మార్చ పుట్టగతులునిండు
మహిని...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి