@ 77. నీరమే సర్వమూ (77-85)
సాకి:
జల హీ జీవన్ హై : పానీ హీ ప్రాణ్ హై
జల హీ జీవన్ హై : పానీ హీ ప్రాణ్ హై
పల్లవి:
జలమే జీవనమూ
జలమే జీవనమూ
నీరమే జీవానాధారమూ
జలములే జీవనరేఖలూ
నదీ నడములే జీవనాదములూ
చరణం:
వాడిగా, వాడి వాడిగా,
వాడిగా, వాడి వాడిగా,
మాట కారిగా
ప్రవహించే పెన్నావాణీ
అచ్చ తెనుగు జాణరా
మగని మగవానిగా
మలచిన తెగువారా
అది నీటి లోని మేటి గుణమూ
మనుమసిద్ధి ఏలిన
నెల్లూరు పట్టణమూ
పెద్ద పట్టణము-పెన్నాపట్టణమూ :జలమే:
చరణం:
క్రిష్ణమ్మ మహోగ్ర ధాటి
క్రిష్ణమ్మ మహోగ్ర ధాటి
సరియా నిటలాక్షు ధాటి?
వాగులూ, వంకలూ
అవలీలగా దాటి
కొండ, కోనలు దాటి
దివి సీమ దాటి
మధ్యలో, మన్నులో
కోహినీరులు గన్న
వజ్ర మాత-బెజవాడ
నగరు మాత
కాలు మోపిన చాలు
తలలెత్తు పౌరుషము
అది నీతి మహిమరా
అదిఏను నీటికి దీటైన గుణమూ :జలమే:
గోదారి గలగలలూ
పలికెను సరిగమలూ
మాటలా అవి ముత్యాల మూటలూ
మాటలా అవి ముత్యాల మూటలూ
పారేటి ఏడేటి పాయలూ
సప్త ఋషుల సప్త వర్ణాలూ
తోడుగా నడిచేటి ఏడడుగులూ
రాజసబోలుకు రాజమహేంద్రి
తెలుగు తోబుట్టువమ్మ గోదారి తల్లికి :జలమే:
78.మన నాయకులా వీళ్ళు?
సిగ్గు చేటు, సిగ్గు చేటు మన నాయకుల తీరు
సభలను రభసలుగ జేసిరి మన ప్రతినిధులు
ఘనమైన గణతంత్రం హీనమైన వైనం
సిగ్గు చేటు, సిగ్గు చేటు ప్రతినిధుల దిగ జారుడు! :సిగ్గుచేటు:
ప్రపంచాన పెద్దదైన భారత గణతంత్రం
చట్టాలకే పరిమితమైన తూ తూ మంత్రం
సిగ్గు చేటు, బడికి చేటు, గుడికి చేటు
టోటల్గా మన ప్రజా తంత్రానికే చేటు :సిగ్గు చేటు:
భజన కోద్దీ లబ్ధి ఒక నాడు
విభజన కొద్దీ లబ్ధి ఈ నాడు
విభజించి పాలించిన తెల్ల వాడు
విభజించిన తీరు చూసి తెల్ల మొఖం వేశాడు :సిగ్గు చేటు:
మరిగే నీళ్ళల్లో ముఖం చూసుకో గలమా?
మన శబ్దం లేక పొతే మనుగడ సాధ్యమా?
స్వార్ధమే వేదమైన “స్వాహా” పరిపాలనలో
“ఆత్మా శోధన కన్నా తరుణోపాయము లేదన్న :సిగ్గు చేటు:
79. ఇంక ఊరుకోం
పల్లవి:
చూసీ చూడకుండ పోయామింత వరకూ
చూసీ చూడకుండ పోయామింత వరకూ
చూసీ, చూసీ, మేం చూస్తూ చావాలా ఇంకానూ? :చూసీ:
చరణం:
పటా పంచలుగా తెంపేస్తాం సంకెళ్ళను
పటా పంచలుగా తెంపేస్తాం సంకెళ్ళను
ప్రజాస్వామ్య సంకెళ్ళనూ
ధన స్వామ్య కోట గోళ్ళనూ
నేర స్వామ్య బలవంతులనూ
మేం పటా పంచాలుగా తెంపేస్తాం సంకెళ్ళనూ
చరణం:
భాగో- భాగో ధన స్వామ్యమా!
భాగో- భాగో ధన స్వామ్యమా!
భాగో-భాగో నేర స్వామ్యమా!
జాగో-జాగో యువ భారతమా!
జాగో-జాగో- నవ చైతన్యమా! : చూసీ:
చరణం:
భారత దేశంలో పుట్టడమే నేరంమ?
భారత దేశంలో పుట్టడమే నేరంమ?
పుట్టించిన ఆ భగవంతుడిదా నేరం?
అవినీతి ప్రదేశము అతి నీచమూ
ఎన్ని వేల కోరుటులున్నా,
ఎన్నేళ్ళకో న్యాయమూ! :చూసీ:
చరణం:
నాలుగు స్తంభాలాట ప్రజాస్వామ్యమూ
నాలుగు స్తంభాలాట ప్రజాస్వామ్యమూ
న్యాయ స్తంభము దిగ జారి పోయేనూ
తల్లి గుండెల్లో గుచ్చుకు పోయేనూ
ఆపేక్షించరా ఆపద్ధర్మ సూత్రమూ
ఉపేక్షించకూ న్యాయ సూక్ష్మమూ
అవినీతి ప్రదేశము అతి నీచమూ :భాగావో: :చూసీ:
చరణం:
ప్రజకో నీతి, నేతలకు వేరే నీతులా?
ప్రజకో నీతి, నేతలకు వేరే నీతులా?
ప్రవృత్తుల నిగ్గు తేల్చక పోటీ ఇక చెల్లదు
గణించి, గుణించి ఎరుకుంటాం నేతలనూ
జవాబుదారీకే ఇక పట్టం
సన్నాసులకిక కట్టం పట్టం
కానియ్యం గణతంత్రం తూ తూ మంత్రం
చరణం:
ఆరంభం మాత్రమె అంతం లేనిదీపోరూ
ఆరంభం మాత్రమె అంతం లేనిదీపోరూ
జనబాహుళ్యం పిలుపు మేరకూ
జన స్వామ్యం నెగ్గే వరకూ తుది దాకా పోరాటం చేస్తాం
భారతమాతకి పట్టం కడతాం ప్రజా పట్టం కడతాం :చూసీ:
80. ఓ డ్యూయెట్
పల్లవి:
నీ నీడ నా నీడ తారుడుతున్నాయి యారాడ కొండ మీదా
నీ నీడ నా నీడ తారుడుతున్నాయి యారాడ కొండ మీదా
నీ చూపు, నా చూపు దోబూచులడాయి నీలాల నీళ్ళ లోనా :నీ:
చరణం:
నీ చూపు నా గుండె గోడల్లో గుచ్చుకుని
నీ చూపు నా గుండె గోడల్లో గుచ్చుకుని
నీలాల నీళ్ళల్లో చప్పుళ్ళు చేస్తుంటే...
ఆ మాటా – ఈ మాటా – ఏ మాటా
వినవాయే మనసు చెవులూ
వలపు మాటలే వినబడతాయని
ఎన్ని సార్లు చెప్పనే? నీకెన్ని సార్లు చెప్పనే?
చెప్పకనే చేపుతుందే ప్రేమ చప్పుడూ
ఆ మనసుంటే చాలునే ప్రేమ సాగును
నూరేళ్ళ పాట పాడును నూరేళ్ళు ప్రేమ సాగును
పదిలంగా వెయ్యేళ్ళు
ప్రేమ గోరింట పండును :నీ నీడ:
చరణం:
శృతి తప్పి కోరికలు గతి తప్పుతుంటే
శృతి తప్పి కోరికలు గతి తప్పుతుంటే
గది మదిలో గమకాలూ గుమిగూడి
ప్రేమ కమటాలే పెట్టేసి
తమకాలే ఉసికొలుపుతుంటే
కట్టు తప్పి, గుట్టు విప్పి
చెలరేగి అలలెగిసి పడుతుంటే
చరణం(హీరోయిన్):
స్త్రీ హృదయం రత్నగర్భ యని
స్త్రీ హృదయం రత్నగర్భ యని
తెలియదో! వేర్రోడా!
చెరువంత కన్నుల్లో
చెలి కోరికలు చెలరేగి పోతుంటే
జాలమేలనో? జారిన నిమిషంలో
జరుగుతున్నా కవనాలు
ఆగి, ఆగి మూగిన, గుమిగూడిన కధనాలు
చాలవో! చెలిని చేర, చెంత చేర్చ
చప్పుళ్ళు వినలేవో?
యెంత సేపూ, నీకెంత సేపూ
చేక్షువాటలే గాననీ, ఛాయలు లేవోకో
చర్చలకిది ఏమైనా ప్రజాతంత్రమా?
ఇది ప్రణయ తంత్రమూ
చర్యల ప్రణయ తంత్రమూ :నీ నీడా :
@
@
81. అన్నుల మిన్న
పల్లవి:
మల్లెల వేళ మనసు లాగు చున్నది
మల్లెల వేళ మనసు లాగు చున్నది
వెన్నెల వేళ మమత రేగు చున్నది
దూరమదేల? అనువైన వేళ? :మల్లెల:
చరణం:
పువ్వులు పూచే పున్నమి రోజు
పువ్వులు పూచే పున్నమి రోజు
నందన వనమై విరిసే నవ్వులు
మంచే పువ్వై మించిన సొంపా
బింక మదేల? ఒంపుల కెంపా! :మంచే:
చరణం:
సన్నగ వీచే చల్లని గాలి
సన్నగ వీచే చల్లని గాలి
ఎన్నగ నీవే అన్నుల మిన్న
ఎచటో తాకే మన్మధ శరమూ
ఎటకో పోయే ఎదపై స్వప్నం :ఎన్నగ:
చరణం:
అందెల రవళి గుండెలు తాకి
అందెల రవళి గుండెలు తాకి
మోహన రాగం వీణై పాడే
చనువున రావే చలుముల రాణీ
బిరా బిరా రావే బిడియము మాని :మల్లెల:
82. ఎక్కడ? నీవెక్కడ?
పల్లవి:
ఎటు పోయావు స్నేహమా?
ఎటు పోయావు స్నేహమా?
ఏమైనావు స్నేహమా?
చిరునామా లేకుండా
కంటి కసలు కనబడకుండా :ఎటు:
చరణం:
చెవి లోన జోరీగై
చెవి లోన జోరీగై
ఎవరో పిలిచినట్లు
వెన్ను తట్టి లేపినట్టు
కలత నిద్రలో తట్టి
నన్ను లేపినట్టు
నీ పేరే తలపుల ధ్యానం
దీని పెరేనేమో వ్యసనం! :నీ పేరే:
చరణం:
మితి మీరి చేశా స్నేహం
మితి మీరి చేశా స్నేహం
కొని తెచ్చు కున్నా రోగం
వ్యసనమని తెలుసుకునే లోగా
బతుకే తెల్ల వారేగా
నేవ్వేతైనా పోవే స్నేహమా
చిరునామా చేరిపేస్తా
హద్దు రేఖ గీసేస్తా
మితి మీరిన స్నేహం చేస్తే
83.స్నేహం
పల్లవి:
మాయావి లోకంలో
మాయావి లోకంలో
ఎండమావి స్నేహం :మా:
చరణం:
మేలు కోరినా
మేలు కోరినా
మేలుకొలిపినా
కాపాడినా, కబళించినా
స్నేహమే, అది స్నేహమే! :కాపాడినా:
చరణం:
తియాదనానికి చిరునామా
తియాదనానికి చిరునామా
కలతలు బాపే ఔషధమూ
సృష్టికే మూలమూ
సృజనధారమూ
స్నేహమే ముమ్మాటికీ స్నేహమే :
చరణం:
మితి మీరిన స్నేహమూ
మితి మీరిన స్నేహమూ
దేహానికి రోగమూ
తన్ను మాలిన స్నేహమూ
మొదటికే మోసమూ
అది వ్యసనమూ
మితి మీరిన స్నేహం
హద్దు మీరిన స్నేహం
ముమ్మాటికీ వ్యసనం :మా:
84. నిజాయితీ! ఓ నిజాయితీ!
పల్లవి:
తావెక్కడమ్మా? నీ నెలవెక్కడమ్మా
తావెక్కడమ్మా? నీ నెలవెక్కడమ్మా
చోటెక్కడమ్మా? ఎక్కడమ్మ నీ చిరునామా?
తావెక్కడమ్మా? నీ తావెక్కడమ్మా?
చోటెక్కడమ్మా? నీ చోటెక్కడమ్మా? :తావె:
చరణం:
గగనంలో కుసుమానీవా?
గగనంలో కుసుమానీవా?
కంటిలోని నలుసువా?
విసుగు చెందనమ్మా
వెతుకుతానమ్మా
నిజాయితీ! నిన్ను వెతికి తీరుతానమ్మా
నిజాయితీ! ఓ నిజాయితీ!
నీ చోటెక్కడమ్మా?
చరణం:
ఎదుటి వాళ్లకి చెప్పేవాళ్ళే
ఎదుటి వాళ్లకి చెప్పేవాళ్ళే
అంతా ఎదుటి వాళ్లకి చెప్పే వాళ్ళే!
ఆచరించే వాళ్ళు లేరనా?
వెళ్లి పోయావు ఎటు వెళ్లి పోయావు?
ఎల్లలన్నీ దాటీ, మా కళ్ళను కప్పి
నేలపై లేకుండా ఎవ్వరికీ తోచకుండా
ఎటు పోయావమ్మా?
ఏమై నావమ్మా? నిజాయితీ!
ఓ నిజాయితీ!
చరణం:
నీకు కూడు లేదు-గూడు లేదు
నీకు కూడు లేదు-గూడు లేదు
నేలవే లేదు-విలవే లేదు
గ్రహించి మాపై
ఎటు పోయావమ్మా?
నిన్నే నువ్వు వెతుక్కుంటూ
మాపై జాలి పడుతూ రావమ్మా! :తావె:
చరణం:
ఒక నాటికి వస్తావని ఆశతో ఉన్నావమ్మా!
ఒక నాటికి వస్తావని ఆశతో ఉన్నావమ్మా!
నీ వారసులం ఇంత మందైనా ఉన్నామమ్మా!
నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నావమ్మా
“అవి” ఆవిరై పోతాయే!! నీతి మాత్రమే మిగిలి
నీతి, నిజాయితీ జగతి నిండునమ్మ
నీ నెలవు జగతంతా నిండిన నిండు జగతమ్మా
నీకు తప్ప వేరేవారికి చోటే లేదమ్మా!
నా మాట నమ్మవే మాయమ్మ!
85. ఆటల పాఠాలు
పల్లవి:
బాలలు గాలి పటాలు
బాలలు గాలి పటాలు
ఉరుకుతు పరుగుతు
ఊయలలూగే పరువాలు
చదువుకు పరాయాలు
ఆట పాటలకు నిలయాలు :బాలలు:
చరణం:
ఆటలు ఆడక విలవిల మైదానాలు
ఆటలు ఆడక విలవిల మైదానాలు
ఆట పాటల ఊసే లేని పాఠశాలలు
పసి మనసుల పాలిట చెరసాలలు :బాలలు:
చరణం:
విజ్ఞానం పెరిగిందంటూ వితండ వాదం
విజ్ఞానం పెరిగిందంటూ వితండ వాదం
జ్ఞానం దిగ జారిన వైనం
ఈనాటి విద్యా విధానం
రేపటి పౌరుల నెత్తురు తాగే
విద్యా సంస్థలూ ఖబడ్ దార్!
చరణం:
క్రీడల్లేక క్రీడా స్ఫూర్తి అబ్బెదెలా?
క్రీడల్లేక క్రీడా స్ఫూర్తి అబ్బెదెలా?
గెలుపు-ఓటమి, ఆటు-పోట్లు
తట్టు కునేదెల్లా?
బాలలు తట్టు కునే దెలా?
ఆటా-పాటా ఊసే లేని పాఠశాలలు
పసి పాపల పాలిట చెరసాలలు :బాలలు:
చరణం:
చొరవ, చురుకు అలవడేది
చొరవ, చురుకు అలవడేది
బహిరంగపు మైదానాల్లోనే
కర్రపెత్తనం, గుంపు జీవనం
అలవడేది ఆటల్లోనే
ఆటల్లేని, ఆ ఊసేలేని బళ్ళు
పసి మనసుల పాలిట జైళ్ళు :బాలలు:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి