25, ఫిబ్రవరి 2014, మంగళవారం

*
                      22.నేరస్థులెవరు ? (22-26)               12-5-2004

"దొరికిన దొంగలు "నేరస్థులు 
మరి,దొరకని దొంగలో?
దొరకని దొంగలందరూ దొరలేనా ?
అందుకే ,దొరలే దొంగలు,దొంగలే దొరలు !

 దొంగతనాల్ ,దోపిడీల్
లంచగొండి తనాల్ ,"లా"ధిక్కారాల్
నేరాల్ -పన్నేరాల్ ,
ధనస్వామ్య ప్రతిరూపాల్

నాయకులు నేరచరిత్రులైతే,
"నేరచరిత్రతో నాయకులైనవాళ్లు
చరిత్రకందని మహాపురుషులోయ్!
చట్టం చట్రంలో ఇమిడిపోయిన
చట్టాని కందని నేరస్థులోయ్ 

వృత్తులు పోయాయోయ్ 
నేరప్రవుత్తులు పెరిగాయోయ్
నేరం-ప్రన్నేరం
నేరం నెగ్గిన నేపధ్యంలో న్యాయస్థానాల్ తడబడి పోయాయోయ్
నేరస్తానంలో న్యాయం వెదికినా లాభంలేదోయ్

నా నేరస్థుల జాభితాలో _
మన ధనస్వామ్యంలో _
"పని"దొంగలు  పెద్ద నేరస్థులోయ్
చదువుకొని, ఓటేయ్యని వాళ్ళు,
"ఓటరు జాబితాలు"నడిపించేవాళ్ళూ ,
ఓటు లేకుండా చేసినవాళ్ళూ
పరమ ప్రజాస్వామ్య మహా నేరస్థులు
నేరం జరుగుతుంటే గుడ్లప్పగించి
చూసే వాళ్ళు పచ్చినేరస్థులోయ్ 

"దేశరక్షణ "మిలట్రికే పరిమితమన్న 
ప్రతీపౌరుడూ "క్షమాబిక్ష"కు 
అర్హతలేని అసలు నేరస్థులోయ్ 
వాతావరణం కాలుష్యం చేసేవాళ్ళూ 
నేరస్థులోయ్  -అపరాధులోయ్ !

ఒక్క సంతానంకు మించి కన్నవాళ్ళు:
కృత్రిమంగా "భూధరలు"పెంచే వాళ్ళు ;
ఆదాయపన్నెగేసే వాళ్ళు ;
అవినీతిపరులై నీతోపన్యాసలిచ్చేవాళ్ళూ ;
వీళ్లోయ్ అసలు -సిసలు నేరస్థులోయ్  

నేరస్థుడు చచ్చాక, నేరం లేనట్లే 
నేరం వేలెత్తి చూపని వాళ్ళంతా 
చచ్చినవాళ్ళతో సమానమోయ్ !
మనమంతా కారణభూతులమోయ్ !
మనమంతా నేరస్థులమోయ్ !



*                                                      23. "అతి" సర్వత్రా వర్జయేత్ 
జీవితంలో  అతి తియ్యనైంది స్నేహమంటే 
నిజమని నమ్మాను అందరికంటే  
"ఆమహాకవి హృదయంలో నిదురించే చెలి 
ఎలాని చెప్పను ? కమ్మ్యునిజం కాదని !"

"నాహృదయంలో  నిదురించే " చెలి (మి)
అక్షరాలా స్నేహ(o )
సమానత్వాన్ని ,స్నేహభావాన్ని ,
కించెత్తు మైలలేని మేలిమి స్నేహంకోసం 
ధారబోసాను నాసర్వం -సహాయం 

నిత్యం గుర్తుకొస్తారు స్నేహితులు 
అను నిత్యం ఆలోచిస్తాను _
వేనవేల సంఘటనలు -మరిచిపోదు మనసు 
దేవుడు నాకా వరం ఇవ్వడం మర్చిపోయాడు !

స్వయం క్రుతాపరాధం 
"స్వయం శిక్ష విధించుకోలేను 
క్షమించలేను -మర్చిపోలేను 
మారిపోలేను -మార్చుకోలేను 

"వ్యసనం అన్నారుకొందరు;
"అవ్యయ"మన్నారు మరికొందరు ;
వాడేతెల్సుకుంటాడన్నారు ఇంకొందరు ;
"వాజమ్మ"న్నారు మరి తెలివైనవాళ్లు !

వస్తాడు ,వెడతాడు 
మనకేం ?
వాడే కల్సుకుంటాడు 
మనకేం?మనకేం?
అన్నారు పొ (o )దు పరులు 

కుడి యెడమలు చూళ్ళేదు 
ఎల్లలు గీసుకోలేదు 
పంచభూతాలు అడ్డురాలేదు 
ప్రకృతి వైపరీత్యాలు అడ్డురానివ్వలేదు 
"స్నేహమే "పరమావధి అయ్యింది       

"హోదా "పెరిగింది -పక్కకునెట్టాను ,
 నాకంటే,నావాళ్ళకంటే 
బాగా చూసుకొన్నాను 
"ఓహో !అన్నారు ."ఆహా"న్నారు 
కొండమీద ఉంచాను 
నేలమీద కూర్చున్నాను 

"మంచితనం" కంటే"తెలివితక్కువ తనమే"
మంచిదేమో ?
"కంటిలోనలకనై"పోయాను 
"సింప్లిసిటీ "ఓడింది -మంచితనం ఓడింది 

నిన్న వెక్కిరించింది 
నేడు వెలవెల బోతుంది 
"రేపంటే భయం !భయం!"
"మారిపొతానేమోనని !"
"వాడుమారడులే"అన్నారు 
"వాడు "వ్యసనపరుడన్నారు 
"అది"సర్వత్రా వర్జయేతా ?
"అతి"సర్వత్రా వర్జయేతా?


@                                           24.డబ్బు ,డబ్బు ,డబ్బు                2004 

డబ్బును సృష్టించాడు మానవుడు  

అయ్యాడు డబ్బుకే దాసుడు 

డబ్బుకే విలువ ధారుణిలో

కాసు లేనివాడు పోటీకే పనికిరాడు

 

ఎలా సంపాదించాడో అప్రస్తుతం !

ఎంత సంపాదించాడో ప్రస్తుతం!

శతకోటి సంపాదనలకు వందనాలు

అనంతకోటి ఉపాయాలు  


సమాజంలో డబ్బుకి కులం లేదు

డబ్బుకి ,చిన్నా-పెద్దా లేదు

డబ్బున్నవాడు ఎక్కడైనా పెద్దే!

డబ్బుకి ఉచ్చం,నీచం లేదు

డబ్బుకున్న "డాబే" వేరు

డబ్బుకున్న" అంతస్తే" వేరు


డబ్బుజబ్బుకన్న మించిన జబ్బు

డాలరు జబ్బు ;

"అమెరికాలో "ఏం చేస్తున్నాడన్నది కాదు;

ఎంత పంపిస్తున్నాడు?

ఎన్ని ఆస్తులు కొన్నారు?

బంగారం ఎంతుంది?

ఎన్నెకరాలున్నాయి?

పోష్ లోకాలిటిలో "బంగ్లా " ఉందా ?

"స్టేట్స్లో" లో ఉంటేనే "స్టేటస్"1

అది ఓ "స్టేటస్ "సింబల్ !

NRI(యన్నారై )అంటే విలవలే వేరు 

ఇంకోటుందండోయ్!

అదే!అదే గ్రీన్ కార్డ్ !గ్రీడీ కార్డ్ !


మాతృ దేశాన్ని మాతృ దేశంగా ఒదిలేస్తే?

ఎవరు చేస్తారు మాత్రు సేవ? 

దేశ  రక్షణ?

చేసే వాళ్ళు వేరే ఉన్నారా?

ఎంత ధీమా!

మాతృ దేశ సేవా,రక్షణ

వేరే వాళ్ళ మీద వేసే వాళ్ళని (వీళ్ళని )

ఏమనాలిపరాన్నబుక్కులనా?

దేశ ద్రోహులనా?ప్రజా ద్రోహులనా?

వీరు నేరస్థులు !దేశద్రోహ నేరస్థులు !


ఎన్ని అగచాట్లు అమెరికా వెళ్ళాలంటే!

"దొంగబ్యాంకు "పాసు బుక్కులు 

"దొంగబ్యాంకు" ఎకౌంటులు

"ఆస్తుల "దొంగ"అంచనాలు 

కేవలం డబ్బుకే విలువ ఇస్తున్నారు 

మీదేం తప్పు లేదూ?

ఊడిగం చేసి పోగేసుకొంటున్నారు 

రుపాయిల్లో  గుణించి పొదుపు చేసిన

పిసినారి డబ్బు !


ధనికులు,రాజకీయనాయకులు ,

ప్రజా(నిధుల) ప్రతినిధులు ,

ప్రభుద్దులు; వీరి ఠీవే వేరు;

వీరి రూటే సెపరేటు !

వీరికి క్రమశిక్షణ ఖాతర్లేదు 

"క్యూ" ని పాటించనక్కర్లేదు

దేవాలయాల్లో "స్పెషల్"దర్శనం

 ప్రజల ఓట్లకోసం "దేహీ! దేహీ!"

ప్రజలకు జవాబుదారీ "నహీ !నహీ!"

ఇంతకన్న హీనం ,నీచం, మరెక్కడ  వెతికినా లేదు-లేదు


యస్.పీ. సలాం-కలెక్టరు సలాం

M.L.A,M.P.,మంత్రులంటే

రూల్సన్నీ "బలాదూర్-బడాదూర్ "

పరమాత్మాహై !పైసామే !

క్యోంకీ కానూన్ హై ఉన్ కీ హాత్ మే!


బడా గూండా నాయకుల్ని

కాపాడుతోంది డబ్బు 

హంతకుల్ని ,అత్యాచారుల్ని 

కావలి కాస్తోంది డబ్బు !


మనీ చేసే ఈ బెయిమానీ !

కహా హై ఈమాన్? కహా హై ఈమాన్  ?

కాపాడే వాడొక్కడే హీ-మాన్ 

కమాన్ !ఈమాన్ !హీమాన్ ! 

@                                                   25. రిపీట్ ద వోట్ !                                                                                                         (టిల్ ద కరప్షన్ డైజ్ )

ఓటరులారా వర్దిల్లండి !
ఓటరులారా వర్దిల్లండి !
"మీతీర్పు" అంతిమ తీర్పు ;
ఏ న్యాయస్థానంలోనూ 
"అప్పీలు"లేని తీర్పు !

మీ"బేల్లట్టు"గురితప్పని "బుల్లెట్టు"
"ఆంద్రుల కాలోచన లేదనుకున్న",
"ఆ" రాజకీయ కీచకులకు 
"శాస్తి"చేసి,స్వస్తి పలికిన 
మీకివే నా జోహార్లు !

"చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్ ."
మార్పు కోరుకోవడం  "మా జన్మ హక్కు ;
"హైటెక్ "జిమ్మిక్కుల "కనికట్టుకూ ,
"మీడియా"ట్రిక్కులకూ,
కాలేదు "బలి"మీరు మట్టుకు !

"అవిశ్వాస"తీర్మానాలకు,ధర్నాలకూ ,
"జైలుభరో" ఉద్యమాలకూ,
భయపడకండి !ఓ "భేల్లట్టు"అస్త్రధారుల్లారా !
జహా నాష్ హై ,వహా సత్య నాష్  హై !
జహా సత్త్య నాష్ హై ,వహా సవా సత్త్య నాష్ హై !
అందుకే ,
"రిపీట్ ద ఓట్ టిల్ ద కరప్షన్ డై జ్ !"

ప్రజాస్వామ్య చీడపురుగుల్ని ,
సామాజిక,దేశ,ద్రోహుల్ని ,
ప్రజాహిత కార్య వ్యతిరేక శక్తుల్ని;
"విచేక్షణా "జ్ఞానంతో 
ఏరిపారేయ్యండోయ్ !
మళ్ళీ ఏన్నికల్లో విసిరికోట్టందడోయ్ 
"రిపీట్ ద ఓట్ టిల్ ద కరప్షన్ డై జ్ ! 

"విద్య మీకు అందకుండా "చేసినా ,
"విచక్షణా జ్ఞానంతో",విద్యావంతులని ,
"నిరూపించుకున్న"ఓటరులారా !వర్ధిల్లండి !
"మార్పు" మీ జన్మహక్కని 
"తీర్పు"చాటి చెప్పండోయ్!
 "రిపీట్ ద ఓట్ టిల్ ద కరప్షన్ డై జ్ !"

"ఎన్ని కలలోయ్ " ప్రజాస్వామ్యమంటే ?
ప్రజాస్వామ్యo " అంటే ఎన్నికలు కాదోయ్ !
మీకా జడుపు ఎందుకోయ్ ?
"నోటుకి,ఓటు బదులు "కాదని 
మత్తుకి ,జిమ్మిక్కులకీ మోసపోకండోయ్ 
ఓటరులార వర్ధిల్లండి !ఓటరులార వర్ధిల్లండి !
రిపీట్ ద ఓట్ టిల్ అవేర్నెస్ కమ్స్ !"
"రిపీట్ ద ఓట్ టిల్ ద డిసీజ్  డై జ్ !"
"రిపీట్ ద ఓట్ టిల్ ద కరప్షన్ డై జ్ !"


@                                   26.అసలైన సూపర్ పవర్                1-5-2004

సమాజం అంటే సమస్యలమయం 
నీటి ఎద్దడి -విద్యుత్ కొఱత ,
వాతావరణ కాలుష్యం 
అనిష్టమైన "అర్బనైజేషన్ ". 

నిరుద్యోగ బడబాలనం 
పౌరుల ఆర్తనాదం 
శ్రామికుల బడుగుతనం 
ధనికుల ధనోన్మాదం 
పాలకుల నిరంకుశత్వం 

యువత భవిష్యత్తు అగమ్య గోచరం 
ప్రభుత్వోద్యోగుల కోర్కెల సమ్మెలు 
ప్రైవేటోద్యోగుల అరవచాకిరీ 
బాలకార్మికుల చీకటి బ్రతుకులు 

స్త్రీల ఆర్ధిక దౌర్బల్యం 
స్త్రీలకూ సమాన హక్కుల వాగ్దానాలు 
స్త్రీలపై అత్యాచారాలు 
మార్మూల గ్రామాల్లో మూఢాచారాలు 

ఆర్ధిక  యంత్రాంగంలో అవకతవకలు 
"ఆర్ధిక సంస్థల" కుంభకోణాలు 
"ద్రవ్యోల్బణం"తగ్గిందంటూ తప్పుడు లెక్కలు 
ధనికులు,పాలకులూ కుమ్మక్కై 
కాజేసిన వైనాలు 

స్కాముల్లేని రంగం లేదు 
లోసుసుగుల్లేని డిపార్టుమెంటు లేదు 
శిలలై మిగిలిన ప్రాజెక్టులు 
శిధిలావస్తలో ఉన్న పాఠశాలలు 

అరవైఆరేళ్ళ స్వపరిపాలనట 
అరవై శాతం లేని "అక్షరాస్యత"
అంతమొందింది "పరిపాలన"
పునాదులేశాం "పీడిత పాలన "              

మన ప్రజాపాలనలో -
మైనారిటీ శాతంపోలైన 
"పార్టీలు" పాలిస్తున్నాయి 
ఇష్టారాజ్యం -స్వయంపాకం 

కేంద్రంలో నానా రాజకీయ పార్టీల సంకీర్ణం 
రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆర్ణవం 
"పుట్టకుక్కుల్లా"పుట్టుకొచ్చిన పార్టీలు 
స్వప్రయోజనాలకే పరిమితాలు 
మద్యలో "విభజన" విష శ్శక్తులు 

సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంభీర సమస్య ,
"జనాభా" పెరుగుదల ;
అరికట్టలేని అరాచక ప్రభుత్వ విధానం 
నాయకులకేం ? ఎంత పెరిగితే,
అంతమంది "ఓటర్లు"
ఆపై నిరక్షరాస్యత ఆలోచనారాహిత్యం 
నాయకులు ఆడిందే ఆట-పాడిందే పాట 

"లంచగొండితనం", నిత్యక్రుత్యంలో 
ఓ అంగమై ,అలవాటై ,పరిపాటై 
జీర్ణించుకు పోయిన "జీవన విధానం "
నీతి మంతుల్ని వెలివేస్తున్న వైనం !

పై సమస్యలన్నింటికీ నివారణం :
ఎలక్షన్లలో 50%+1 ఓట్లు పోలై వచ్చేదాకా ,
అభ్యర్దులకు పోలింగు -రీపోలింగు 
దాంతో ,మెజారిటీ శాతం పోలైన 
రాజకీయ పార్టీ రిప్రెజెంటేటివ్స్తోతో 
ప్రభుత్వాలేర్పడతాయి 

విధిగా విద్యని అభ్యసించేలా చేస్తే 
ప్రజల్లో ఆలోచనా సరళి మారి 
విచేక్షణతో ఎన్నుకుంటారు 
తమ తమ  ప్రతినిధుల్ని 
అప్పుడే -
సిసలైన-అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వం 
దేశం సుసంపన్నం-ఇండియా సూపర్ పవర్

 

 









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి