1 . చామర్తి గేయాలు,వచనాలు (1 to 13)
గీత సారం ఆగష్టు 87 ఏటి ఒడ్డున నీటి పూలు
ఎవరి కోసం పూయునో !
ఆకశాన వెండి మబ్బులు
ఎంత దూరం సాగునో! ll ఏటి ll
ఎదురు చూడదు చందమామ
వెన్నెలారగ బోయను
ఎదురు చూడదు కడలి కెరటం
దూర తీరం తాకను ll ఏటి ll
ఫలితమించుక ఎదురు చూడక
కర్మ చేయుటె గీత సారం
ఆ సార మెరిగి నడచుకొనుటే
సర్వ జనులకు మంగళం ll ఏటి ll
2 మన దేశం ఏప్రిల్ 2004
యువతంటే భవితం
భవితంటే భారతం
భారతం అంటే నీదేశం
పేరెన్నిక గన్న దేశం ll భవితంటే ll
ఆర్ధిక మాంద్యంలో
ఆధిక్యం చాటుకుంది
పగబట్టిన టెర్రరిజాన్ని
పెకలించి వేసింది ll భారతం ll
ప్రపంచమంతా ఓ గ్రామం
తావేలేదు ప్రపంచ సంగ్రామం
విశ్వనేత(ల) ఆధిపత్యం
అంతరించి పోతుంది ll యువతంటే ll
ఎల్లలన్నీ చెరిగిపోయి
ఖండాలన్నీ కలిసిపోయి
నీధాటికి ఒక్కటై ,నీదేశం
కేంద్ర బిందువై పోతుంది ll భవితంటే ll
నాయకులూ !నిద్రలెండి
నిజంతెల్సి మసులుకోండి
స్వార్ధం విడనాడండి
భారతాన్ని నిలపండి
భారతం నీదేశం
పేరెన్నిక గన్నదేశం + 3.మనిషీ !వనరుల ఒరవడీ ! 08-01-2011
ఉత్పత్తి శక్తుల్లో మహాశక్తి మనిషి
సంపదల సృజనామూర్తి మనిషి
వృత్తి నైపుణ్యంలో నేర్పుంది
కళాత్మకా ప్రవృత్తిలో ఓర్పుంది
నైతిక స్ఫూర్తి ఉంది అతడిలో
సాహసికత ఉంది అతనిలో
పనివంటి వస్తువు లేదనీ
పనిలోనే పూజ ఉందనీ
విశ్వసించిన విశ్వరూపం
వినీల గగనాల కెగసిన
విశ్వ జ్ఞానం
శాస్త్ర జ్ఞానం
గగనమెత్తు
అతడు గగనమెత్తు !
మనిషి నిలువెల్లా మేధస్సే
మనిషి శరీర మెల్ల యశస్సే
మనిషి ఓ విలక్షణం
మరకు లేని విచక్షణం
అందుకే _
మనిషీ !ఓ మనిషీ !
నువ్వు వనరులకే ఒరవడి !
+ 4. అందరిది - మనందరిదీ 7,జనవరి ,2011
జాబిలి కోసమా?
జాతి కోసమా ?
వెన్నెలా ? ఓ వెన్నెలా !
మబ్బుల కోసమా ?
మనుషుల కోసమా?
వానా ?ఓ వానా !
గగనం కోసమా ?
గమనం కోసమా ?
గాలీ !ఓ గాలీ ! ll జాబిలి ll
ఏదీ నీ సొంతానికి కాదనీ
ప్రకృతి జగతికి సంకేతం
పంచే గుణమే లేకుంటే
ప్రపంచమే కాదా శూన్యం ?
ఏదీ నీ సొంతానికి కాదని
ప్రకృతి జగతికి సంకేతం
పరోపకార మిదం శరీరం
పరోపకారమే లోక కళ్యాణం
పరపీడనమే ప్రగతికి అంతం
పరపీడనమే ప్రళయం -ప్రళయం ll ఏది నీ ll
అన్యాయం ఎదిరిస్తేనే చైతన్యం
దోపిడీ వల్లనే తిరోగమనం
దోపిడీ ఆపితేనే పురోగమనం
దిద్దు బాటే తిరుగు లేని బాట
తిరుగు బాటే దీ టైన బాట
అన్యాయం ఎదిరిస్తేనే చైతన్యం
దోపిడీ ఛేదిస్తేనే పురోగమనం
@ 5.రజనీ గంధా 8 నవంబర్ ,2010
తరుణులు మెచ్చే రజని గంధా
మరట్టులు మెచ్చే నిషీ గంధా
టాబూలు మెచ్చే ట్యూబు రోజా
మనమగువలు మెచ్చే లిల్లీగా ll తరుణులు ll
రమణులు రసరమ్యలు
రమణులు రసరాణులు
వాసనల సుగంధ రాజములు
వాసికెక్కిన సువాసనా గంధములు
రజని గంధాలు -నిషీ గంధాలు
వెదజల్లే వాసనల లిల్లీలు
అత్తరువుకే చిరునామాలు ll తరుణులు ll
హుషారుకి మజిలీలు
ధారులు ,క్రియాశూరులు
ప్రాపంచిక సుఖ రూపులు
వర్తమాన విహంగులు
ప్రేమికులు -లిల్లీ ప్రేమికులు
రమణులు -రస రమ్యలు
రమణులు-రసరాణులు
తొలి ప్రేమకు సంకేతం
వధూ కన్యకే సంతకం
రమణుల చిత్తహారిణి
రసరాణుల మనోహారిణి ll తరుణులు ll
రస రజని గంధా
టాబూల ట్యూబు రోజా
మన మగువల లిల్లీ రోజా ll తరుణులు ll
+ 6. కాకోపనిషత్తు 2,నవంబరు ,2010
నేనేకాకినని
కాకితో మొరపెట్టుకున్నా
నువ్వ్వే కాకివని
నన్నా కాకి ప్రశ్నించింది
కాకులెన్నిరకాలని
నే యెదురు ప్రశ్నవేశాను ?
అందుకా కాకి నవ్వింది
మీ మనుషులే మాకెన్నో
పేర్లు పెట్టారని
నిట్టూర్చింది
మా కుల గురువు
చాణక్యుడంది
మమ్మల్ని చూసి
మీరు నాల్గు నీతుల్ని
నేర్చుకోవాలంది
నిర్దేశించాడంది
ఒకటి -
మేం సాముహిక జీవులం
సమిష్టి విహంగాలం
రెండు -
మాకు దొరికిన ఆహారాన్ని
అరిచి,ఆహ్వానించి పంచుకు తింటాం
మూడు -
మేం శోకాన్ని కూడా
అందరిని పిలిచి,విలపించి
సాముహిక శోక ,సంతాపాల్ని
వెలిబుచ్చుతాం
నాలుగు -
మాకు,మీలా కుల ,మత భేదాల్లేవంది
మాలో ,తెలుపూ -నలుపూ
రెండే జాతులంది
తెల్లని గుడ్లని పొదుగుతాం
నల్లని స్వఛమైన పిల్లల్నిచేస్తాం
కాకి కోకిలౌతుందాని
మీలోకులు ప్రశ్నిస్తారు
మేం పొదిగితేనే
కిల -కిల ,కుహు-కుహూ
కోకిల్లవుతాయ్ !
మనిషీ ! ఓ పాపీ !
మేంచిరాయువులం ఎందుకంటే
మాకు సహజ మరణం లేదు
+ 7. ప్రజాఘోష 08-10-2010
చినుకు కాదిది కడలి చివరికి
వేళ్ళు కావివి బిగిసి పిడికిలి
ఓట్లు కావివి ప్రజల హక్కులు
జేజేలు కావివి జనుల ఘోషలు :చినుకు:
అణచి వేతకు గురియై
కూడు-గూడు కారవై
పనులు, పాటుకు దూరమై;
ప్రజాధనం మాయమై పోతుంటే -
సహనముండదు
చట్టముండదు
మిమ్మాలకించె స్థానముండదు
ప్రజల సయం అస్సలుండదు
ప్రజాస్వామ్యం నీడ ఇవ్వదు :చినుకు:
ప్రజా ప్రతినిధి ఎవడురా?
పేరోలగాన పెద్ద ఎవ్వడురా?
గద్దె నెక్కి-మిద్దె కట్టి
స్విస్సు బ్యాంకుల సొమ్ము బెట్టి
స్కీములెల్లా స్కాముల్జేసిన
మీరా? ప్రజా ప్రతినిధులూ ? :చినుకు:
ఇది ఓటు చేసిన చేటనీ
ఇది ఓటు వేసిన కాటనీ
ఒటు కింక చోటే లేదనీ
పోటెక్కిన ప్రజా పోరై
పిక్కటిల్లే పాంచజన్యం
యుద్ధభేరి మ్రోగిస్తుంది
మీ ఆగడాలు కూల్చి వేస్తుంది
ప్రతి ఫలాల్ పంచి ఇస్తుంది :చినుకు:
8. ఆలోచించేరా?
09-10 -2010
ఇది గాంధీ పుట్టిన దేశం
ఇది నెహ్రూ ఏలిన దేశం
ఇది బోసు స్ఫూర్తి నింపిన దేశం
ఇది శాస్త్రీజీ సుస్థిరపరచిన దేశం :ఇది:
స్వాతంత్రం వచ్చి ఇన్నేల్లైనా
సామాన్యుడికి ఒరిగిందేoటని?
ఆలోచిoచారా?
మీలో ఎవరైనా? :ఇది:
పరులు దోచుకున్న నాడు
నిరాకరించి, నిరసించి
ఉద్యమాల్జేసిన
మీ తాతల ముత్తాతల
వారసులెనా మీరు? :ఇది:
ఆలోచిoచారా?
మీలో ఎవరైనా?
నేటి భారతం చూసేరా?
కళ్ళు తెరిచి చూసారా?
భవితవ్యం భాగోతం
మన వాళ్ళే దోచుకుని
దాచుకుంటుంటే
తమాషా చూస్తున్నారా?
:ఆలోచిoచారా:
ఆ అమర వీరుల
వారసులేనా మీరు ?
భద్ర మేనా మీ భవితవ్యాలు?
సాలోచన చెయ్యండి
సమిధలు సిద్ధం చెయ్యండి
సమర గీతికలు పాడండి
మళ్ళీ సమరం చెయ్యండి
సుస్వరాజ్య సమరం నెరపండి :ఆలోచిoచారా:
వినాయకులేదో చేస్తారని
ఏదోపార్టీ చేస్తుందని
ఎన్నాళ్ళీ నిరీక్షణ?
ఈ నిర్లిప్త వీక్షణ?
నిటలాక్షులై కదలండోయ్
కదం తొక్కి, కదం కలిపి
శ్రీ గణేశు పాడండోయ్ : ఆలోచిoచారా:
అరవైఆరేళ్ళ కొలమానం
భారత మాతకే అవమానం
లేవండోయ్! లేవండి!
రొమ్ములొడ్డి పోరాడండి
ప్రతి ఒక్కడు నాయకుడై
ప్రతిఘటించండోయ్
ప్రతి ఒక్కడు సైనికుడై
నరుక్కురండోయ్!
అప్పుడే వచ్చేనోయ్
అసలు- సిసలు
స్వచ్ఛమైన - మచ్చలేని
నిజమైన, నిర్వాకమైన
ప్రజాస్వామ్యం!
ఆలోచించారా?
మీలో ఎవరైనా?
ఆలొకించెరా?
మీలో ఎవరైనా? :ఇది:
@ 9. అను 'మత్తు'చాలీసా 10,అక్టోబరు 2010
రాజులే పొయ్యేరు! రాజ్యాలు పొయ్యాయ్!
గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఖరుసై పొయ్యేరు. నిఖార్సైన
నీతిపరులు సోదిలోకి లేకుండా పొయ్యారు. నీతి,నియమాలు
నీ్ళ్ళు* అయిపోయినాయ్ . బలాత్కారాలు , మానభంగాలు
పెరిగిపొయినయ్ .కట్నాల వేధింపులు,ఆడపడుచుల
ఆత్మహత్యలు ,లంచాలు,నేరాలు-ఘోరాలు
పెచ్చు పెరిగిపోనాయ్! శోధించి , పరిశోధించి ఈటన్నిoటికీ
'రీజనింగు ' ఒక్కటేనని నిర్ధారణ కోచ్చేసేను.ఇదేదో ,
మీకేమో చిన్న విషయంలా కాపడద్ది . కాని ,ఇది పేద్ద జాడ్యం .
సూది మందు లేని అతి పెద్ద జాడ్యం. రోగం
పోవాలంటే "మందు"డోసు పుచ్చుకోవాల ! మరీ జాడ్యం
పోవాలంటె మందుని మందుగా పుచ్చు కోవాల!అప్పుడే
తాగుబోతులుండరు. సమాజంలో కస్మలం ఉండదు.
మీకు మాటలు అర్ధం కావు. అందుకే "అను'మత్తు'చాలీసా"
పాటయేత్తాను . పాడుకొండెహే ! దరువేసుకోరా!సూత్తా ఉండి
పోతావేరా? ఊగుతా వాయించకు !తాగుబోతనుకునేరు !!!
పల్లవి :
ఇంటికి ఇద్దరు పిల్లలు ముద్దు
ఒంటికి రెండే పెగ్గులు హద్దు
మత్తుకు చిత్తయి పోవద్దు
చేయరా! మత్తును చిత్తు :ఇంటికి:
మత్తుకు బానిసలై
ఆపై సోమరిపోతులై
ఆలోచనా హీనులై
దారులు తప్పి
రహదారులు తప్పి
గమ్యహీనులై పోతారు
ఆస్తులు,పుస్తులు హరీ! హరీ !
పరువు ప్రతిష్టలు సరే! సరి!
మత్తుకు చిత్తై పొవద్దురా !
చెయ్ రా! మత్తును చిత్తుగా ! :ఇంటికి:
జనని జనకులు శోకతప్తులై
పిల్లా పాపలు పస్తుల పాలై
నారీమణులు ఆకలి పాలై
పోతుంటే ........
తాగుబోతులార !
తాగేదేంటో తెలుసుకోండిరా !
సారా కాదురా,అది సార కాదురా!
సార కాదని తెలుసుకోండిరా
కన్నకడుపుల రక్తంరా!
మత్తుకుచిత్తై పోవద్దురా !
చెయ్ రా! మత్తును చిత్తుగా ! :ఇంటికి :
శీలం పోతే పోనీ
సౌశీల్యంగా మారొచ్చు
మానం పోనీ,పోతే పోనీ
రోగం వచ్చి ఆరోగ్యం చెడితే ?
మరెక్కడికెళ్లినా
మందులేదురా
అందుకే ;
మత్తుకు బానిస కాకురా
"మహ "రాజులకే చెల్లనిదీ
నువ్వో లెక్ఖా?
"ఇంచక్కా "వినుకోరా
"మందుని","మందు"గ వాడరా
బతికి నీవాళ్ళను
బతకనివ్వరా!
ఇంటికి ఇద్దరు పిల్లలు ముద్దు
ఒంటికి రెండే పెగ్గులు హద్దు
మత్తుకు చిత్తై పోవద్దు
చెయ్ రా మత్తును చిత్తు చిత్తు
10-10-2010
@ 10. మత్తు మనుగడకు చేటు
పల్లవి :
తప్పటడుగులు "మొదటి" పెగ్గులు
తప్పుడడుగులు "బానిస" పెదవులు
చట్టం "హెచ్చరిక" సీసాపై
పతనం పతనం ఆపై
ఆలకించరా! నిజం తెలియరా!
మనుగడకే పెను చేటురా :ఆలకించరా:
చరణం:
తాగిన తొందర మరణం
తాగిన రోజున నరకం
చచ్చాక నరకముండగా,
తెచ్చుకోకు బ్రతికుండగా
నిలబడి ఆలొకించరా
నూరేళ్ళు పండించరా :నిలబడి:
:చరణం:
పుట్టుక తొదివి సుఖ దుఃఖాలు
(తోడ బుట్టినవి సుఖ దుఃఖాలు)
(తోడ బుత్తువులు సుఖ దుఖాలు)
క్షణి కానన్దమ్ క్షమించని నేరం
అడుగెయ్యక ఆలోచించరా!
ఆలసించక ఆలోచించరా! :అడుగెయ్యక:
:చరణం:
ఆత్మ వంచన మహాపరాధం
నరజాతికే అది అవరోధం
ఆత్మా శోధన మహోపకారం
నిన్ను నువ్వే నిల్వ రించరా
అది మానవాళికే నీరాజనం
నిన్ను నువ్వే నిల్వ రించరా
నీకై నీవే తెలుసుకోరా :నిన్ను నువ్వే:
:చరణం:
మనిషి చావకూడదు
మనుగడ ఆగ కూడదు
చిత్తుగా చెయ్యర మత్తును
నిషేధించరా మత్తును :తప్పటడుగులు:
@ 11.హోళీ జెండా! ఎజెండా ! 26-2-2010
సాకి :
అది మాసం ఫాల్గుణం
తిధి పేరేమో పౌర్ణం
కృష్ణుడు పెట్టే ముహూర్తం
నాడే పూతన సంహారం
ఆనందానికి సంకేతం
మధురాప్రాంత ఉత్సవం
వసంతోత్సవం
అదే , ఈ ఆనంద కేళీ
రంగులపండుగ హోళీ
పల్లవి :
ఇదే ...... ఇదే ......ఆనంద కేళీ
రంగుల పండుగ హోళీ
చరణం :
ప్రతి గల్లీ ఓ గోకులం
లేదు మాకు వర్ణ భేదం
"గులాల్ "కుండవు కులాలు
ఇది ఆనంద "ఆర్ణవం"
వర్ణముల్లేని "పబ్బం " :ఇదే:
చరణం :
పుట్టుట,గిట్టుట,ప్రకృతి ఆట
రెంటికి మధ్యన రంగుల ఆట
ఒకటై వేద్దాం పువ్వుల బాట
వినిపిద్దాం ప్రగతి "ఏజెండా "
ఎగరేద్దాం మన హోళీ" జెండా" :ఇదే :
#
గీత సారం ఆగష్టు 87 ఏటి ఒడ్డున నీటి పూలు
ఎవరి కోసం పూయునో !
ఆకశాన వెండి మబ్బులు
ఎంత దూరం సాగునో! ll ఏటి ll
ఎదురు చూడదు చందమామ
వెన్నెలారగ బోయను
ఎదురు చూడదు కడలి కెరటం
దూర తీరం తాకను ll ఏటి ll
ఫలితమించుక ఎదురు చూడక
కర్మ చేయుటె గీత సారం
ఆ సార మెరిగి నడచుకొనుటే
సర్వ జనులకు మంగళం ll ఏటి ll
2 మన దేశం ఏప్రిల్ 2004
యువతంటే భవితం
భవితంటే భారతం
భారతం అంటే నీదేశం
పేరెన్నిక గన్న దేశం ll భవితంటే ll
ఆర్ధిక మాంద్యంలో
ఆధిక్యం చాటుకుంది
పగబట్టిన టెర్రరిజాన్ని
పెకలించి వేసింది ll భారతం ll
ప్రపంచమంతా ఓ గ్రామం
తావేలేదు ప్రపంచ సంగ్రామం
విశ్వనేత(ల) ఆధిపత్యం
అంతరించి పోతుంది ll యువతంటే ll
ఎల్లలన్నీ చెరిగిపోయి
ఖండాలన్నీ కలిసిపోయి
నీధాటికి ఒక్కటై ,నీదేశం
కేంద్ర బిందువై పోతుంది ll భవితంటే ll
నాయకులూ !నిద్రలెండి
నిజంతెల్సి మసులుకోండి
స్వార్ధం విడనాడండి
భారతాన్ని నిలపండి
భారతం నీదేశం
పేరెన్నిక గన్నదేశం + 3.మనిషీ !వనరుల ఒరవడీ ! 08-01-2011
ఉత్పత్తి శక్తుల్లో మహాశక్తి మనిషి
సంపదల సృజనామూర్తి మనిషి
వృత్తి నైపుణ్యంలో నేర్పుంది
కళాత్మకా ప్రవృత్తిలో ఓర్పుంది
నైతిక స్ఫూర్తి ఉంది అతడిలో
సాహసికత ఉంది అతనిలో
పనివంటి వస్తువు లేదనీ
పనిలోనే పూజ ఉందనీ
విశ్వసించిన విశ్వరూపం
వినీల గగనాల కెగసిన
విశ్వ జ్ఞానం
శాస్త్ర జ్ఞానం
గగనమెత్తు
అతడు గగనమెత్తు !
మనిషి నిలువెల్లా మేధస్సే
మనిషి శరీర మెల్ల యశస్సే
మనిషి ఓ విలక్షణం
మరకు లేని విచక్షణం
అందుకే _
మనిషీ !ఓ మనిషీ !
నువ్వు వనరులకే ఒరవడి !
+ 4. అందరిది - మనందరిదీ 7,జనవరి ,2011
జాబిలి కోసమా?
జాతి కోసమా ?
వెన్నెలా ? ఓ వెన్నెలా !
మబ్బుల కోసమా ?
మనుషుల కోసమా?
వానా ?ఓ వానా !
గగనం కోసమా ?
గమనం కోసమా ?
గాలీ !ఓ గాలీ ! ll జాబిలి ll
ఏదీ నీ సొంతానికి కాదనీ
ప్రకృతి జగతికి సంకేతం
పంచే గుణమే లేకుంటే
ప్రపంచమే కాదా శూన్యం ?
ఏదీ నీ సొంతానికి కాదని
ప్రకృతి జగతికి సంకేతం
పరోపకార మిదం శరీరం
పరోపకారమే లోక కళ్యాణం
పరపీడనమే ప్రగతికి అంతం
పరపీడనమే ప్రళయం -ప్రళయం ll ఏది నీ ll
అన్యాయం ఎదిరిస్తేనే చైతన్యం
దోపిడీ వల్లనే తిరోగమనం
దోపిడీ ఆపితేనే పురోగమనం
దిద్దు బాటే తిరుగు లేని బాట
తిరుగు బాటే దీ టైన బాట
అన్యాయం ఎదిరిస్తేనే చైతన్యం
దోపిడీ ఛేదిస్తేనే పురోగమనం
@ 5.రజనీ గంధా 8 నవంబర్ ,2010
తరుణులు మెచ్చే రజని గంధా
మరట్టులు మెచ్చే నిషీ గంధా
టాబూలు మెచ్చే ట్యూబు రోజా
మనమగువలు మెచ్చే లిల్లీగా ll తరుణులు ll
రమణులు రసరమ్యలు
రమణులు రసరాణులు
వాసనల సుగంధ రాజములు
వాసికెక్కిన సువాసనా గంధములు
రజని గంధాలు -నిషీ గంధాలు
వెదజల్లే వాసనల లిల్లీలు
అత్తరువుకే చిరునామాలు ll తరుణులు ll
హుషారుకి మజిలీలు
ధారులు ,క్రియాశూరులు
ప్రాపంచిక సుఖ రూపులు
వర్తమాన విహంగులు
ప్రేమికులు -లిల్లీ ప్రేమికులు
రమణులు -రస రమ్యలు
రమణులు-రసరాణులు
తొలి ప్రేమకు సంకేతం
వధూ కన్యకే సంతకం
రమణుల చిత్తహారిణి
రసరాణుల మనోహారిణి ll తరుణులు ll
రస రజని గంధా
టాబూల ట్యూబు రోజా
మన మగువల లిల్లీ రోజా ll తరుణులు ll
+ 6. కాకోపనిషత్తు 2,నవంబరు ,2010
నేనేకాకినని
కాకితో మొరపెట్టుకున్నా
నువ్వ్వే కాకివని
నన్నా కాకి ప్రశ్నించింది
కాకులెన్నిరకాలని
నే యెదురు ప్రశ్నవేశాను ?
అందుకా కాకి నవ్వింది
మీ మనుషులే మాకెన్నో
పేర్లు పెట్టారని
నిట్టూర్చింది
మా కుల గురువు
చాణక్యుడంది
మమ్మల్ని చూసి
మీరు నాల్గు నీతుల్ని
నేర్చుకోవాలంది
నిర్దేశించాడంది
ఒకటి -
మేం సాముహిక జీవులం
సమిష్టి విహంగాలం
రెండు -
మాకు దొరికిన ఆహారాన్ని
అరిచి,ఆహ్వానించి పంచుకు తింటాం
మూడు -
మేం శోకాన్ని కూడా
అందరిని పిలిచి,విలపించి
సాముహిక శోక ,సంతాపాల్ని
వెలిబుచ్చుతాం
నాలుగు -
మాకు,మీలా కుల ,మత భేదాల్లేవంది
మాలో ,తెలుపూ -నలుపూ
రెండే జాతులంది
తెల్లని గుడ్లని పొదుగుతాం
నల్లని స్వఛమైన పిల్లల్నిచేస్తాం
కాకి కోకిలౌతుందాని
మీలోకులు ప్రశ్నిస్తారు
మేం పొదిగితేనే
కిల -కిల ,కుహు-కుహూ
కోకిల్లవుతాయ్ !
మనిషీ ! ఓ పాపీ !
మేంచిరాయువులం ఎందుకంటే
మాకు సహజ మరణం లేదు
+ 7. ప్రజాఘోష 08-10-2010
చినుకు కాదిది కడలి చివరికి
వేళ్ళు కావివి బిగిసి పిడికిలి
ఓట్లు కావివి ప్రజల హక్కులు
జేజేలు కావివి జనుల ఘోషలు :చినుకు:
అణచి వేతకు గురియై
కూడు-గూడు కారవై
పనులు, పాటుకు దూరమై;
ప్రజాధనం మాయమై పోతుంటే -
సహనముండదు
చట్టముండదు
మిమ్మాలకించె స్థానముండదు
ప్రజల సయం అస్సలుండదు
ప్రజాస్వామ్యం నీడ ఇవ్వదు :చినుకు:
ప్రజా ప్రతినిధి ఎవడురా?
పేరోలగాన పెద్ద ఎవ్వడురా?
గద్దె నెక్కి-మిద్దె కట్టి
స్విస్సు బ్యాంకుల సొమ్ము బెట్టి
స్కీములెల్లా స్కాముల్జేసిన
మీరా? ప్రజా ప్రతినిధులూ ? :చినుకు:
ఇది ఓటు చేసిన చేటనీ
ఇది ఓటు వేసిన కాటనీ
ఒటు కింక చోటే లేదనీ
పోటెక్కిన ప్రజా పోరై
పిక్కటిల్లే పాంచజన్యం
యుద్ధభేరి మ్రోగిస్తుంది
మీ ఆగడాలు కూల్చి వేస్తుంది
ప్రతి ఫలాల్ పంచి ఇస్తుంది :చినుకు:
8. ఆలోచించేరా?
09-10 -2010
ఇది గాంధీ పుట్టిన దేశం
ఇది నెహ్రూ ఏలిన దేశం
ఇది బోసు స్ఫూర్తి నింపిన దేశం
ఇది శాస్త్రీజీ సుస్థిరపరచిన దేశం :ఇది:
స్వాతంత్రం వచ్చి ఇన్నేల్లైనా
సామాన్యుడికి ఒరిగిందేoటని?
ఆలోచిoచారా?
మీలో ఎవరైనా? :ఇది:
పరులు దోచుకున్న నాడు
నిరాకరించి, నిరసించి
ఉద్యమాల్జేసిన
మీ తాతల ముత్తాతల
వారసులెనా మీరు? :ఇది:
ఆలోచిoచారా?
మీలో ఎవరైనా?
నేటి భారతం చూసేరా?
కళ్ళు తెరిచి చూసారా?
భవితవ్యం భాగోతం
మన వాళ్ళే దోచుకుని
దాచుకుంటుంటే
తమాషా చూస్తున్నారా?
:ఆలోచిoచారా:
ఆ అమర వీరుల
వారసులేనా మీరు ?
భద్ర మేనా మీ భవితవ్యాలు?
సాలోచన చెయ్యండి
సమిధలు సిద్ధం చెయ్యండి
సమర గీతికలు పాడండి
మళ్ళీ సమరం చెయ్యండి
సుస్వరాజ్య సమరం నెరపండి :ఆలోచిoచారా:
వినాయకులేదో చేస్తారని
ఏదోపార్టీ చేస్తుందని
ఎన్నాళ్ళీ నిరీక్షణ?
ఈ నిర్లిప్త వీక్షణ?
నిటలాక్షులై కదలండోయ్
కదం తొక్కి, కదం కలిపి
శ్రీ గణేశు పాడండోయ్ : ఆలోచిoచారా:
అరవైఆరేళ్ళ కొలమానం
భారత మాతకే అవమానం
లేవండోయ్! లేవండి!
రొమ్ములొడ్డి పోరాడండి
ప్రతి ఒక్కడు నాయకుడై
ప్రతిఘటించండోయ్
ప్రతి ఒక్కడు సైనికుడై
నరుక్కురండోయ్!
అప్పుడే వచ్చేనోయ్
అసలు- సిసలు
స్వచ్ఛమైన - మచ్చలేని
నిజమైన, నిర్వాకమైన
ప్రజాస్వామ్యం!
ఆలోచించారా?
మీలో ఎవరైనా?
ఆలొకించెరా?
మీలో ఎవరైనా? :ఇది:
@ 9. అను 'మత్తు'చాలీసా 10,అక్టోబరు 2010
రాజులే పొయ్యేరు! రాజ్యాలు పొయ్యాయ్!
గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఖరుసై పొయ్యేరు. నిఖార్సైన
నీతిపరులు సోదిలోకి లేకుండా పొయ్యారు. నీతి,నియమాలు
నీ్ళ్ళు* అయిపోయినాయ్ . బలాత్కారాలు , మానభంగాలు
పెరిగిపొయినయ్ .కట్నాల వేధింపులు,ఆడపడుచుల
ఆత్మహత్యలు ,లంచాలు,నేరాలు-ఘోరాలు
పెచ్చు పెరిగిపోనాయ్! శోధించి , పరిశోధించి ఈటన్నిoటికీ
'రీజనింగు ' ఒక్కటేనని నిర్ధారణ కోచ్చేసేను.ఇదేదో ,
మీకేమో చిన్న విషయంలా కాపడద్ది . కాని ,ఇది పేద్ద జాడ్యం .
సూది మందు లేని అతి పెద్ద జాడ్యం. రోగం
పోవాలంటే "మందు"డోసు పుచ్చుకోవాల ! మరీ జాడ్యం
పోవాలంటె మందుని మందుగా పుచ్చు కోవాల!అప్పుడే
తాగుబోతులుండరు. సమాజంలో కస్మలం ఉండదు.
మీకు మాటలు అర్ధం కావు. అందుకే "అను'మత్తు'చాలీసా"
పాటయేత్తాను . పాడుకొండెహే ! దరువేసుకోరా!సూత్తా ఉండి
పోతావేరా? ఊగుతా వాయించకు !తాగుబోతనుకునేరు !!!
పల్లవి :
ఇంటికి ఇద్దరు పిల్లలు ముద్దు
ఒంటికి రెండే పెగ్గులు హద్దు
మత్తుకు చిత్తయి పోవద్దు
చేయరా! మత్తును చిత్తు :ఇంటికి:
మత్తుకు బానిసలై
ఆపై సోమరిపోతులై
ఆలోచనా హీనులై
దారులు తప్పి
రహదారులు తప్పి
గమ్యహీనులై పోతారు
ఆస్తులు,పుస్తులు హరీ! హరీ !
పరువు ప్రతిష్టలు సరే! సరి!
మత్తుకు చిత్తై పొవద్దురా !
చెయ్ రా! మత్తును చిత్తుగా ! :ఇంటికి:
జనని జనకులు శోకతప్తులై
పిల్లా పాపలు పస్తుల పాలై
నారీమణులు ఆకలి పాలై
పోతుంటే ........
తాగుబోతులార !
తాగేదేంటో తెలుసుకోండిరా !
సారా కాదురా,అది సార కాదురా!
సార కాదని తెలుసుకోండిరా
కన్నకడుపుల రక్తంరా!
మత్తుకుచిత్తై పోవద్దురా !
చెయ్ రా! మత్తును చిత్తుగా ! :ఇంటికి :
శీలం పోతే పోనీ
సౌశీల్యంగా మారొచ్చు
మానం పోనీ,పోతే పోనీ
రోగం వచ్చి ఆరోగ్యం చెడితే ?
మరెక్కడికెళ్లినా
మందులేదురా
అందుకే ;
మత్తుకు బానిస కాకురా
"మహ "రాజులకే చెల్లనిదీ
నువ్వో లెక్ఖా?
"ఇంచక్కా "వినుకోరా
"మందుని","మందు"గ వాడరా
బతికి నీవాళ్ళను
బతకనివ్వరా!
ఇంటికి ఇద్దరు పిల్లలు ముద్దు
ఒంటికి రెండే పెగ్గులు హద్దు
మత్తుకు చిత్తై పోవద్దు
చెయ్ రా మత్తును చిత్తు చిత్తు
10-10-2010
@ 10. మత్తు మనుగడకు చేటు
పల్లవి :
తప్పటడుగులు "మొదటి" పెగ్గులు
తప్పుడడుగులు "బానిస" పెదవులు
చట్టం "హెచ్చరిక" సీసాపై
పతనం పతనం ఆపై
ఆలకించరా! నిజం తెలియరా!
మనుగడకే పెను చేటురా :ఆలకించరా:
చరణం:
తాగిన తొందర మరణం
తాగిన రోజున నరకం
చచ్చాక నరకముండగా,
తెచ్చుకోకు బ్రతికుండగా
నిలబడి ఆలొకించరా
నూరేళ్ళు పండించరా :నిలబడి:
:చరణం:
పుట్టుక తొదివి సుఖ దుఃఖాలు
(తోడ బుట్టినవి సుఖ దుఃఖాలు)
(తోడ బుత్తువులు సుఖ దుఖాలు)
క్షణి కానన్దమ్ క్షమించని నేరం
అడుగెయ్యక ఆలోచించరా!
ఆలసించక ఆలోచించరా! :అడుగెయ్యక:
:చరణం:
ఆత్మ వంచన మహాపరాధం
నరజాతికే అది అవరోధం
ఆత్మా శోధన మహోపకారం
నిన్ను నువ్వే నిల్వ రించరా
అది మానవాళికే నీరాజనం
నిన్ను నువ్వే నిల్వ రించరా
నీకై నీవే తెలుసుకోరా :నిన్ను నువ్వే:
:చరణం:
మనిషి చావకూడదు
మనుగడ ఆగ కూడదు
చిత్తుగా చెయ్యర మత్తును
నిషేధించరా మత్తును :తప్పటడుగులు:
@ 11.హోళీ జెండా! ఎజెండా ! 26-2-2010
సాకి :
అది మాసం ఫాల్గుణం
తిధి పేరేమో పౌర్ణం
కృష్ణుడు పెట్టే ముహూర్తం
నాడే పూతన సంహారం
ఆనందానికి సంకేతం
మధురాప్రాంత ఉత్సవం
వసంతోత్సవం
అదే , ఈ ఆనంద కేళీ
రంగులపండుగ హోళీ
పల్లవి :
ఇదే ...... ఇదే ......ఆనంద కేళీ
రంగుల పండుగ హోళీ
చరణం :
ప్రతి గల్లీ ఓ గోకులం
లేదు మాకు వర్ణ భేదం
"గులాల్ "కుండవు కులాలు
ఇది ఆనంద "ఆర్ణవం"
వర్ణముల్లేని "పబ్బం " :ఇదే:
చరణం :
పుట్టుట,గిట్టుట,ప్రకృతి ఆట
రెంటికి మధ్యన రంగుల ఆట
ఒకటై వేద్దాం పువ్వుల బాట
వినిపిద్దాం ప్రగతి "ఏజెండా "
ఎగరేద్దాం మన హోళీ" జెండా" :ఇదే :
#
12. ఎందుకు?
మనవరాలు:
నిజమే ఎందుకు చెప్పాలి?
నిజమే ఎందుకు చెప్పాలి?
నాయనమ్మ:
చివరిదాకా నిలిచేదనీ,
చివరిదాకా నిలిచేదనీ,
“సత్యమేవ జయతి” అనీ,
నిజం అందుకు చెప్పాలి
సుఖముగ జీవించాలి
మనవరాలు:
ఎవరినీ నొప్పించకూడదు ఎందుకో?
ఎవరినీ నొప్పించకూడదు ఎందుకో?
నాయనమ్మ:
దేనికికైతే నువ్ నొచ్చుకుందువో,
దేనికికైతే నువ్ నొచ్చుకుందువో,
ఇతరులకెన్నడు చేయకనీ,
లోకఖ్యాతి
(ఇది) ‘విదుర నీతి’యనీ,
బుద్ధమహాత్ముల
బోధనలూ ఇంతేననీ,
ఎవ్వరినీ ‘నొప్పించకూడదు’ అందుకనీ
మనవరాలు:
పొరుగు-ఇరుగులతో
పొరుగు-ఇరుగులతో
కలిసి-మెలిసి ఎందుకు ఉండాలి?
నాయనమ్మ:
మంచీ చెడుల లోకమనీ,
మంచీ చెడుల లోకమనీ,
“మానవతం” కష్టసుఖాలనీ,
మనం “మనుషులం” సంఘజీవులం-
ఒకరికి-ఒకరం
ఆసరాలేక జీవించలేమనీ
అందుకే-
పొరుగు-ఇరుగుతో
కలిసి-మెలిసి ఉండాలి 9th,
సెప్టెంబర్ 2014
13. వెక్కిరించు ఓటమిని
పల్లవి:
వెక్కిరించు ఓటమిని
వెక్కిరించు ఓటమిని
కుక్కిన పేనై పడి ఉంటుంది
కుదేలై పోయావో?
తలకెక్కి సవారీ చేస్తుంది :వెక్కి:
చరణం:
గెలుపు గాడి తప్పిందంటే?
గెలుపు గాడి తప్పిందంటే?
ఓటమి
ఒళ్లోకి జారినట్టే!
నిరంతర
యత్నమే
విజయానికి
సంకేతం
:గెలుపెప్పుడు:
చరణం:
అలుపులేని సంయమనం
అలుపులేని సంయమనం
సలుపెరుగని సంధానం
పడిపోతున్నా లేచే తత్త్వంతో
మున్ముందుకు సాగాలి
ఆ
గెలుపుకే అలుపొచ్చి
విజయం నీ
సొంతం కావాలి
గెలుపెప్పుడు
శాశ్వతమై నిలిచింది?
వైఫల్యం తిష్టవేసుక్కూర్చుందా?
నిరంతర యత్నమే
విజయ
కేతనం :గెలుపెప్పుడు:
:వెక్కి:
చరణం:
విజయం” నీకోవిషయం చెపుతుంది
విజయం” నీకోవిషయం చెపుతుంది
నిన్ను లోకానికి పరిచయం చేస్తుంది
“ఓటమి” నీకో పాఠం నేర్పుతుంది
నీకో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది
విజయం వెనక రహస్యాలుండవ్
ఘోర
వైఫల్యాలే ఉంటాయి
“వై
ఫై వైఫల్యాలె” ఉంటాయి
:విజయం: :వెక్కి:
చరణం:
ఓటమంటే ఓ పాఠం!
ఓటమంటే ఓ పాఠం!
గురువై గుర్తుకు చేస్తుంది
గెలుపంటే గుణపాఠం
ఆత్మకే ప్రబోధం
గెలుపు-ఓటములు
పడిలేచే కెరటాలు
విజయాలకు బావుటాలు
గెలుపెప్పుడు శాశ్వతమై నిలిచింది?
వైఫల్యం తిష్టవేసుక్కూర్చుందా?
నిరంతర యత్నమే విజయం
నిరంతర యత్నం విజయ కేతనం
వెక్కిరించు ఓటమిని
కుక్కిన
పేనై పడి ఉంటుంది
కుదేలై పోయావో?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి